ప్రవచనాలు…సూక్తిముక్తావళి… చాగంటి చంద్రబాబు
సాయంత్రం ఐదు గంటలు మోగిన వెంటనే ఠంచనుగా టీవీల్లో ప్రత్యక్షమవుతారు. కరోనా వైరస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ప్రజలకు అందించడానికే తాను వచ్చానని చెబుతారు. పనిలో [more]
సాయంత్రం ఐదు గంటలు మోగిన వెంటనే ఠంచనుగా టీవీల్లో ప్రత్యక్షమవుతారు. కరోనా వైరస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ప్రజలకు అందించడానికే తాను వచ్చానని చెబుతారు. పనిలో [more]
సాయంత్రం ఐదు గంటలు మోగిన వెంటనే ఠంచనుగా టీవీల్లో ప్రత్యక్షమవుతారు. కరోనా వైరస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు ప్రజలకు అందించడానికే తాను వచ్చానని చెబుతారు. పనిలో పనిగా అధికార పార్టీ, ప్రభుత్వంపై కాసింత బురద జల్లి వెళతారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని తన నివాసం నుంచి విజయవాడలోని విలేకర్లతో మీడియా సమావేశం నిత్యం పెడుతున్నారు. ఇందులో మీడియా మిత్రుల సందేహాలకు కూడా చంద్రబాబు సమాధానాలిస్తున్నారు.
రాజకీయాల గురించి మాట్లాడనంటూనే….
తాను రాజకీయాల గురించి మాట్లాడానికి రాలేదంటూనే వాటి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు. హమారా జమానా అంటూ సూక్తి ముక్తావళి మొదలుపెడతారు. తాను హుద్ హుద్, తిత్లీ వంటి తుఫానుల సమయంలో ఎంత కష్టపడిందీ. ప్రధాని మోదీ ఎంత మెచ్చుకుందీ వివరిస్తారు. విశాఖలో తాను దీపావళి పండగ జరుపుకోవద్దన్న ఒక పిలుపు నిస్తే జరుపుకోలేదని ఆయన ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూతో పోల్చుకుంటారు. జగన్ కరోనా వైరస్ నియంత్రణకు తనను సంప్రదించాలని చెబుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి అభిప్రాయాలను తీసుకోవాలని కోరతారు.
చివరకు టోటల్ ఫెయిల్ అంటూ….
జగన్ ప్రభుత్వం టోటల్ గా ఫెయిలందని ముక్తాయింపు నిస్తారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా జరిగేది కాదని చెప్పుకొస్తారు. అంతేకాదు రైతుల వద్ద నుంచి పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో పాటు పేద కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాల్సిందేనని రోజూ జగన్ కు గుర్తు చేస్తూ ఉంటారు. లాక్ డౌన్ వల్లనే తాను ఏపీకి రాలేకపోతున్నానని, తన మనసంతా అక్కడే ఉందని ఆయన మీడియా సమావేశంలో చెప్పుకుంటూ పోతారు. తన అనుకూల మీడియా నుంచి కూడా అమాయకమైన ప్రశ్నలు వస్తాయి. వాటికి నేర్పుగా తనను తాను ప్రశంసించుకుంటూ, జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోసేలా సమాధానాలిస్తారు.
అన్ని తెలిసి కూడా….
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు తెలియంది కాదు. అలాగని కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. కరోనా పరీక్షలు తక్కువ చేస్తుందని ప్రభుత్వాన్ని దెప్పి పొడుస్తారు. అసలు దేశంలోనే కరోనా పరీక్షలు ఎన్ని జరుగుతున్నాయన్న విషయం బాబుకు తెలిసినా ఆ విషయాన్ని చెప్పరు. ఏపీ ప్రభుత్వమే కరోనాకు అసలు కారణమని గట్టిగా చెబుతారు. ప్రతిరోజూ చంద్రబాబు ప్రవచనాలు, సూక్తిముక్తావళిని చూసి పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మరో చాగంటి కోటేశ్వరరావులా తయారయ్యారని సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి.