బాబు పూర్తిగా సరెండర్ అయిపోయినట్లేనా?

అవును.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అవ‌లంబిస్తున్న వైఖ‌రిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఓ విధమైన విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. కేవ‌లం [more]

Update: 2020-04-01 03:30 GMT

అవును.. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అవ‌లంబిస్తున్న వైఖ‌రిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఓ విధమైన విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. కేవ‌లం ప‌ది మాసాల్లోనే బీజేపీకి ఇలా సాగిల‌ప‌డ‌టం ఎందుకు ? బాబూ అని ప్రశ్నిస్తున్నారు కూడా. విష‌యంలోకి వెళ్తే.. కేంద్ర ప్రభుత్వం దేశ‌వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రజ‌ల‌కు రూ.1.70 ల‌క్షల కో ట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రక‌టించింది. అయితే, నిజానికి ఈ మొత్తం మూడు మాసాల‌కు స‌రిపోద‌నేది బీజేపీలోని ఆర్థిక నిపుణుల మాట‌. ఇక‌, విప‌క్షాలు కూడా దీనిని వ్యతిరేకించాయి.

కేంద్రంపై ప్రశంసలు…..

ఏదో విదిలించిన‌ట్టుగా ఉందంటూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌పై విమ‌ర్శల వ‌ర్షం కురిపించారు. ఇక‌, బీజేపీలో తెర‌చాటుగా సంబంధాలు నెరుపుతుందంటూ విమ‌ర్శలు ఎదుర్కొంటోన్న ఏపీ అధికార పార్టీ కూడా ఈ విష‌యంలో మౌనంగానే వ్యవ‌హ‌రించింది. కానీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బీజేపీపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అనూహ్యంగా కేంద్రంపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. బీజేపీ ప్రభుత్వం మానవత్వగల దృష్టితో రూ.1.75 లక్షల కోట్ల నిధులను అత్యవసర ప్యాకేజీగా అంజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

మోదీపై కూడా…

అంతేకాదు, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఓ లేఖ కూడా రాశారు. అందులో బీజేపీ నిర్ణయాలను, విధానాలను అభినందించారు. వైద్య సిబ్బంది, రైతులు, పేదల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల అత్యవసర నిధిని ప్రకటించడాన్ని ఆయన ఎంతో ప్రశంసించారు. కరోనా మహమ్మారిని అణచివేసేందుకు నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన జనతా కర్ఫ్యూ ఎంతో గొప్పద‌న్నారు. అంతేకాకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ చేయించడం ఎంతో అభినందించదగ్గ విషయమని, వారి సేవకు, త్యాగానికి ఇలాంటి ప్యాకేజీలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ మిత్రపక్షాలు కూడా….

పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం వంటి నిర్ణయాలను అభినందించకుండా ఉండలేకపోతున్నానని చంద్రబాబు వివరించారు. ‘ఇంతటి ఉపద్రవ సమయంలోనూ దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే మీ ఆశయం ఎంతో గొప్పది. అందుకే మీ ప్రభుత్వం మానవత్వం గల ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు అభినందించారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు చూస్తే.. బీజేపీ అనుకూల పార్టీలు కూడా ఇలా పొగ‌డ్తల వ‌ర్షం కురిపించ‌లేదు. కానీ, చంద్రబాబు మాత్రం సాగిల‌ప‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న త‌ర్వలోనే బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపించాయి.

Tags:    

Similar News