నాకేసి పోయి నాటకాలాడుతున్నావా?

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలనే చూస్తారు. ఇసుమంత ప్రయోజనం రాజకీయంగా ఉంటుందనుకున్నా దానిని వదిలి పెట్టరు. కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ రోజూ [more]

Update: 2020-03-27 06:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం రాజకీయాలనే చూస్తారు. ఇసుమంత ప్రయోజనం రాజకీయంగా ఉంటుందనుకున్నా దానిని వదిలి పెట్టరు. కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ రోజూ చంద్రబాబు ప్రకటనలు చేయడాన్ని పలువురు తప్పుపుడుతున్నారు. పక్కనే ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణ్ణంగా తెలిసి కూడా చంద్రబాబు ప్రకటనలు రాజకీయ ప్రయోజనం కోసమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

ఆర్థికంగా కష్టాల్లో…..

ఏపీ ఆర్థికంగా కష్టాల్లో ఉందని చంద్రబాబుకు తెలియంది కాదు. అన్నీ అప్పుల కుప్పలే. ఈ దశలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్, కిలో కందిపప్పు, వెయ్యి రూపాయల నగదును ప్రకటించింది. అయితే నగదును వెయ్యి నుంచి ఐదువేలకు పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హుద్ హుద్ తుఫాను సమయంలో తాము ఇచ్చిన ప్యాకేజీని ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీనికి వైసీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు.

అది కొన్ని జిల్లాలకే….

హుద్ హుద్ తుఫాను కొన్ని ప్రాంతాలకు, కొన్ని జిల్లాలకే పరిమితమని, కరోనా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని కావాలని ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు రోజుకో ప్రకటనలు చేస్తున్నారని మంత్రులు సయితం మండి పడు తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమయిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వారిని క్వారంటైన్ లో ముందుగా ఉంచకపోవడం వల్లనే ఈ సమస్య అని చంద్రబాబు ఎత్తిపొడుస్తున్నారు. అయితే తాము తీసుకున్న చర్యల వల్లనే పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ప్యాకేజీపై రగడ…..

ఇక కేరళ తరహా ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ప్రజల్లో భరోసా నింపలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాల ప్యాకేజీలను ప్రకటించాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే ఎన్నికలకు ముందే నిధులన్నీ నాకేసి వెళ్లిపోయిన చంద్రబాబుకు మాట్లాడే నైతిక హక్కు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు చెప్పిన రాష్ట్రాల్లో విపక్షాలు అధికారపార్టీకి సహకరిస్తున్నాయన్న విషయాన్ని వైసీపీ నేతలు గర్తుచేస్తున్నారు. మరోవైపు ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ప్రకటించిన ప్యాకేజీ అమోఘంగా ఉందన్నారు. లాక్ డౌన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఒకవైపు కేంద్రానికి మెచ్చుకోలు, రాష్ట్రంపై విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఏపీలో కరోనా సమయంలోనూ రాజకీయాలు హాట్ హాట్ గానే ఉన్నాయి.

Tags:    

Similar News