బాబు కొత్త ప్రయోగం.. ఇలాగైనా పార్టీ నిల‌బ‌డుతుందా..?

రాజ‌కీయాల్లో వ్యూహాల‌కు తిరుగులేని నాయ‌కుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వంలో ఆయ‌న అనేక వ్యూహ ప్రతివ్యూహాల‌ను చ‌విచూసిన నాయ‌కుడిగా పేరుప‌డ్డారు. తాను వ్యూహం ప‌న్నితే [more]

Update: 2020-03-28 12:30 GMT

రాజ‌కీయాల్లో వ్యూహాల‌కు తిరుగులేని నాయ‌కుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు. ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వంలో ఆయ‌న అనేక వ్యూహ ప్రతివ్యూహాల‌ను చ‌విచూసిన నాయ‌కుడిగా పేరుప‌డ్డారు. తాను వ్యూహం ప‌న్నితే ఎంత స‌మ‌స్య అయినా వీగిపోదా? అని ఆయ‌న దైర్యం. ఈ ధైర్యమే ఇప్పుడు సంక‌ట స్థితిలో ఉన్న పార్టీని కూడా న‌డిపిస్తోంద‌న‌డంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయ‌న ఇలాంటి వ్యూహాన్నే అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఉన్న ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడూ లేదు. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌ను ప‌క్కన పెడితే పార్టీ నుంచి ఈ రేంజ్‌లో నాయ‌కులు సైకిల్‌ను దిగిపోవ‌డం అనేది గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. దీనికి అనేక కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి.

ఉన్న వారిని…..

అయినా కూడా పార్టీని నిలబెట్టుకోవ‌డం చంద్రబాబుకు చాలా అవ‌స‌రం. ఈ క్రమంలో ఆయ‌న పార్టీ నుంచి పోయిన వారిని ఒక పక్కన బ‌తిమాలుతూనే ఉన్నారు. పైకి మాత్రం ఆయ‌న గంభీరంగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం వారు వ‌స్తే బాగుండున‌నే మాట మాత్రం అంటున్నారు. ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌య్యారు. వీరిలో కీల‌క‌మైన క‌ర‌ణం బ‌ల‌రాం వంటి నాయ‌కుడు కూడా ఉండ‌డం చంద్రబాబుకు ఇబ్బందిగానే ప‌రిణ‌మించింది. అయితే, పోయిన వారు పోయినా.. ఉన్నవారిని నిల‌బెట్టుకుందామ‌ని చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రయ‌త్నిస్తున్నారు.

సీనియర్లతో ఫోన్లు….

అయితే, ఇప్పటికే కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస‌రావు వంటి వారు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఊగిస లాట‌లో ఉన్న నాయ‌కులు కూడా ఇప్పుడు కొంత శాంతించారు. అయితే, ఇప్పుడు చంద్రబాబుస‌రికొత్త వ్యూహాన్ని తెర‌మీదికి తెచ్చార‌ని అంటున్నారు టీడీపీలోని నాయ‌కులు. అదేంటంటే.. చంద్రబాబు కూడా జ‌గ‌న్ బాట‌లో ప‌య‌నిస్తున్నార‌ట‌. గ‌తంలో తాను అధికారంలోకి రాక‌ముందుగానే జ‌గ‌న్ వ్యూహాత్మకంగా త‌న పార్టీ నేత‌ల‌కు ప‌లు హామీలు ఇచ్చి… త‌న‌వైపు తిప్పుకొన్నార‌ట‌. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే, అలా హామీలు ఇచ్చిన వారంద‌రికీ కూడా ప‌ద‌వులు ఇచ్చారా ? లేదా? అనేది ప‌క్కన పెడితే.. ఆయ‌న ప్రణాళిక స‌క్సెస్ అయింది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ఫార్ములా అవ‌లంబిస్తున్నార‌ట‌. పార్టీ నుంచి వెళ్లిపోతారు! అనుకున్నవారిని బుజ్జగించ‌డంతో పాటు సైలెంట్‌గా వారికి సీనియ‌ర్లతో ఫోన్లు చేయిస్తున్నారు.

హామీలు… పదవుల ఆశ చూపుతూ…..

మీరు పార్టీలో ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారాంలోకి వ‌స్తే.. మీకు బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తాం. ఎస్సీ కోటాలో మిమ్మల్ని రాజ్యస‌భ‌కు పంపుతాం. మీకు హోం మంత్రి పోస్టు ఇస్తాం. మిమ్మల్ని.. మంత్రిని చేస్తాం.. అంటూ రాయ‌బారాలు పంపుతున్నార‌ట‌. అయితే, ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. కొంద‌రు నాయ‌కులు మాత్రం మా చంద్రబాబు న‌మ్మలేం! అంటున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News