బాబు వెనుక‌డుగు.. వ్యూహ‌మా..? విఫ‌ల‌మా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా విష‌యం లేకుండా చేయ‌ర‌ని అంటారు ప‌రిశీల‌కులు. సింహం త‌న ల‌క్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగు అడుగులు వెన‌క్కి వేసిన‌ట్టు ఇప్పుడు [more]

Update: 2020-03-03 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా విష‌యం లేకుండా చేయ‌ర‌ని అంటారు ప‌రిశీల‌కులు. సింహం త‌న ల‌క్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగు అడుగులు వెన‌క్కి వేసిన‌ట్టు ఇప్పుడు కూడా చంద్రబాబు త‌న ల‌క్ష్యాన్ని చేరుకునే క్రమంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా చైత‌న్య యాత్రలో కొంత వెన‌క్కి త‌గ్గార‌ని టీడీపీ త‌మ్ముళ్లు చెప్పుకొంటున్నారు. అయితే, ఇది వ్యూహాత్మకంగా వెన‌క్కి త‌గ్గడ‌మా? లేక‌ ఏదైనా కార‌ణం ఉందా ? అనే కోణంలోనూ జోరుగా చ‌ర్చ సాగుతోంది. దీంతో ప్రజా చైత‌న్య యాత్ర నిలిచిపోవ‌డంపై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున సెటైర్లు వైర‌ల్ అవుతున్నాయి.

ఆ తర్వాత నుంచి…..

మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్యటించి జ‌గ‌న్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల‌పై ప్రజ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చాల‌ని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ యాత్ర అట్టహాసంగా ప్రారంభ‌మైంది. రెండు రోజులు అక్కడ ప‌ర్యటించారు. ప్రజ‌ల నుంచి రెస్పాన్స్ తీసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ త‌ర్వాత నుంచి ఈ యాత్రకు బ్రేక్ ప‌డింది.

ఈ రెండే కారణం…..

అంతేకాదు, దీని గురించి పార్టీలో కూడా పెద్ద పెద్ద నాయ‌కులు ఎక్కడా చ‌ర్చ చేయ‌డం లేదు. వాస్తవానికి త్వర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లకు ఈ యాత్రను చుక్కాని చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ యాత్రకు బ్రేక్ ప‌డింది. దీనికి కార‌ణాలేంట‌నే ప్రశ్నలు సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. వాస్తవానికి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే టీడీపీ ఈ ప్రశ్నల‌కు స‌మాధానం ఇవ్వడం లేదు. అయితే, రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వయ లోపం. రెండు ఆర్థిక స‌మ‌స్యగా నాయ‌కులు భావించ‌డం. ఈ రెండు ప్రధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయ‌ని కొంద‌రు టీడీపీ నాయ‌కులే భావిస్తున్నారు.

అలసిపోతున్నారా?

ఇక‌, పైకి వినిపించ‌ని కార‌ణం చంద్రబాబు త‌న యాత్రల్లో అలిసి పోతున్నార‌ట‌. వ‌యో భారం వ‌ల్ల ఆయ‌న పైకి యాక్టివ్‌గా క‌నిపిస్తున్నా.. అతి త‌క్కువ స‌మ‌యానికే ఆయ‌న అల‌స‌ట చెందుతున్నార‌ని, ప్రస్తుతం వేస‌వి కావ‌డంతో మ‌రింత‌గా స‌మ‌స్యలు వ‌చ్చేది కార‌ణ‌మ‌ని అంటున్నారు. ఇంకో కార‌ణం.. ప్రజ‌ల్లో అనుకున్నంత‌గా రెస్పాన్స్ లేక‌పోవ‌డ‌మేన‌ని స‌మాచారం. ఏదేమైనా.. చైత‌న్యం కొర‌వ‌డింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక జిల్లాల్లో ఒక‌రిద్దరు నాయ‌కులు మిన‌హా అస‌లు ఈ యాత్రల‌ను ప‌ట్టించుకున్న వాళ్లే లేరు. మ‌రి కొంద‌రు చంద్రబాబు గారికి ఇప్పుడే ఇంత ఆరాటం ఎందుకు హాయిగా రెస్ట్ తీసుకునేదానికి అని జోకులు వేసుకుంటున్నారు.

Tags:    

Similar News