బాబును తప్పుదోవ పట్టిస్తుంది వాళ్లేనా?

చంద్రబాబు పార్టీని పటిష్టం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల టూర్ పెట్టుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ చంద్రబాబు టూర్ ని ఈ రకంగా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటాయని [more]

Update: 2020-02-29 11:00 GMT

చంద్రబాబు పార్టీని పటిష్టం చేయాలని ఉత్తరాంధ్ర జిల్లాల టూర్ పెట్టుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ చంద్రబాబు టూర్ ని ఈ రకంగా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటాయని తమ్ముళ్ళు అసలు ఊహించలేదు. ఏకంగా చంద్రబాబుని విశాఖ విమానాశ్రయం నుంచే తిరిగి పంపించేయడాన్ని తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదే సమయంలో విశాఖ రాజధానికి చంద్రబాబు వ్యతిరేకం కాబట్టి ప్రజలు అలా చేశారని వైసీపీ మంత్రులు, నేతలు చెబుతున్నారు. దాంతో అటు చంద్రబాబుని సమర్ధించలేక, ఇటు విశాఖ రాజధానికి జై కొట్టలేక తమ్ముళ్ళు ఇరకాటంలో పడిపోయారు.

పెద్ద దెబ్బే…

విశాఖలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చి జనం గెలిపించారు. నిజానికి టీడీపీకి గత ఎన్నికల్లో ఒకే చోట నాలుగు సీట్లు రావడం అంటే పెద్ద రికార్డు. పైగా ఉత్తరాంధ్ర ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంది. అటువంటి చోట రాజధాని వస్తూంటే సున్నితమైన ఈ అంశంలో సరిగ్గా డీల్ చేయాల్సిన టీడీపీ హైకమాండ్ అమరావతికే మొగ్గు చూపుతూ నానా యాగీ చేసింది. దాని ఫలితమే ఇపుడు విశాఖ ఎయిర్ పోర్టులో ఇంత రచ్చ జరిగిందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. చంద్రబాబు దూరాలోచనతో మూడు రాజధానులపైన సరైన నిర్ణయం తీసుకోలేకపొయారని కూడా తమ్ముళ్ళు ఆక్రోసిస్తున్నారు. దీనివల్ల పెద్ద దెబ్బ తమకు పడిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు.

కక్కలేక..మింగలేక….

ఇపుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర తమ్ముళ్ళ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. ఇప్పటికే చాలా మంది తమ్ముళ్ళు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. వారిలో మాజీ మంత్రులు పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి. చంద్రబాబు జై అమరావతి అంటూ విశాఖ వస్తే తమకు జనం చీత్కారాలే కానుకగా లభిస్తాయని వారు అంటున్నారు. విశాఖ రాజధాని విషయంలో చంద్రబాబుని పార్టీలోని కొంతమంది తప్పుదోవ పట్టించార‌ని కూడా మరికొందరు నేతలు అంటున్నారు. వారి వల్లనే చంద్రబాబు విశాఖలో ఎవరూ రాజధాని కోరుకవడంలేదని భారీ స్టేట్ మెంట్ ఇచ్చేసి మరింతగా పార్టీకి చేటు తెచ్చారని కూడా విశ్లేషిస్తున్నారు.

నాన్ లోకలే….

దగ్గరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. వాటి అజెండా ఇప్పటికే వైసీపీ ఖరారు చేసి పెట్టింది. చంద్రబాబు ఈ వ్యూహం అర్ధం చేసుకోకుండా జై అమరావతి అంటూ ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని తమ్ముళ్ళు మధన పడుతున్నారు. విశాఖ రాజధానికి టీడీపీ వ్యతిరేకమని ప్రచారం ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు అడ్డుకోవడం వెనక కూడా ఈ వ్యతిరేక ప్రచారం జనంలోకి బలంగా పోవాలన్న వైసీపీ ఎత్తుగడ ఫలించిందని అంటున్నారు. దాంతో తాము లోకల్ బాడీ ఎన్నికల్లో నాన్ లోకల్ అయిపోతామని కూడా భయపడుతున్నారు. ఓ విధంగా టీడీపీ అధినాయకత్వం ఏకపక్ష వైఖరి వల్లనే టీడీపీకి చేటు వస్తోందని ఎక్కువమంది తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారుట. దాంతోనే సీనియర్లు ముఖం చాటేశారని భోగట్టా. మొత్తానికి చంద్రబాబు టూర్ తో టీడీపీ స్టాండ్ విశాఖకు యాంటి అన్నది బాగా తెలిసిపోయిందని పసుపు శిబిరంలో కలవరం చెలరేగుతోంది.

Tags:    

Similar News