ఇంటి దొంగలు కళ్ల ముందే తిరుగుతున్నా?

న‌న్నెవ‌రూ మాయ చేయ‌లేరు. – ఇదీ.. త‌ర‌చుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నోటి నుంచి వినిపించే మాట‌. అంటే త‌న‌ను అధికార ప‌క్షం నాయ‌కులు [more]

Update: 2020-02-29 05:00 GMT

న‌న్నెవ‌రూ మాయ చేయ‌లేరు. – ఇదీ.. త‌ర‌చుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నోటి నుంచి వినిపించే మాట‌. అంటే త‌న‌ను అధికార ప‌క్షం నాయ‌కులు మోసం చేస్తున్నార‌నే యాగిల్‌లో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చు. కానీ, ఇంటి దొంగ‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడు అనే సామెత మాత్రం టీడీపీలో నిజ‌మ‌వుతోంది. సొంత పార్టీలోనే త‌న క‌ళ్లకు గంత‌లు క‌డుతున్న నాయ‌కుల‌ను చంద్రబాబు గుర్తించలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. చంద్రబాబుకు అంతా బాగుంద‌ని చెబుతారు.. అంతేకాదు, తామంతా క‌లిసి క‌ట్టుగా పార్టీని మోసేస్తున్నామ‌ని అంటారు.

పార్టీపైనే ప్రభావం…

ఇది విన్న చంద్రబాబు ఆహా.. ఇంక పార్టీకి తిరుగులేద‌ని అనుకుంటాను. త‌న మానాన తాను స్పీచ్ ఇచ్చి చాప చుట్టేస్తారు. ఆయ‌న అలా వెళ్లిపోగానే.. త‌మ్ముళ్లు 'ఎవ‌రి దారిలో వారు' వెళ్లిపోతారు. ఒక‌రికొక‌రు పొంత న లేకుండా రాజ‌కీయ బాట వేసుకుంటారు. ఇదీ ఇప్పుడు కృష్ణాజిల్లాలో టీడీపీ ప‌రిస్థితి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు టీడీపీలోని సీనియ‌ర్లు. పైకి అంతా బాగున్నట్టు క‌నిపిస్తుంది. కానీ, లోలోన మాత్రం వ‌ర్గ పోరు, సామాజిక పోరు భారీ ఎత్తున కృష్ణా జిల్లా టీడీపీలో అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇది అంతిమంగా పార్టీపైనే ప్రభావం చూపిస్తోంద‌ని చెబుతున్నారు.

కలిసే ఉన్నామని చెబుతూ…

వాస్తవానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో కృష్ణాలోని 16 అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో రెండు అసెంబ్లీ ఒకే ఒక ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఇప్పటికే గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్ పార్టీకి దూర‌మ‌య్యారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చంద్రబాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. కుదిరిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న నాయ‌కుల‌ను ఒకే వేదిక‌పై చేర్చి పాఠాలు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో అంద‌రూ “ మేం క‌లిసే ఉన్నాం. పార్టీ క‌లిసే న‌డిపిస్తాం. మామ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు. మీకు వ‌చ్చిన‌వ‌న్నీ త‌ప్పుడు నివేదిక‌లు. మ‌మ్మల్ని న‌మ్మండి “- అని ఒక‌టో త‌ర‌గతి పిల్లాడు పాఠం అప్పగించిన‌ట్టు చెబుతారు.

అంతర్గత కుమ్ములాటలే…

దీంతో చంద్రబాబు నిజ‌మే క‌దా అనుకుంటారు. కానీ, ఆ వెంట‌నే స‌భ‌ముగియ‌గానే ఎవ‌రికివారు వారి వారి ఆధిప‌త్యం చూపించుకునేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇలాంటివారిలో బుద్దా వెంకన్న-కేశినేని నాని, జలీల్ ఖాన్-నాగుల్ మీరా, బొండా ఉమా-కేశినేని, గద్దె రామ్మోహన్-దేవినేని ఉమా, బోడే ప్రసాద్-రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు-కొల్లు రవీంద్ర, ఉప్పులేటి కల్పన-వర్ల రామయ్య, కాగిత ఫ్యామిలీ-కొనకళ్ళ ఫ్యామిలీ, జవహర్-స్వామిదాస్, ముద్దరబోయిన-టీడీపీ కేడర్, జయమంగళ-చలమలశెట్టి రామాంజనేయులు ఇలా చాలా మంది అంతర్గత కుమ్ములాట‌ల‌తో తీరిక లేకుండా ఉన్నారు.

ఎప్పటికి మారతారో?

విజ‌య‌వాడ న‌గ‌రంతో పాటు మైల‌వ‌రం, పెన‌మ‌లూరు, పామ‌ర్రు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, మ‌చిలీప‌ట్నం, తిరువూరు, పెడ‌న, నూజివీడు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు, మూడు గ్రూపు త‌గాదాలు న‌డుస్తున్నాయి. మ‌రి వీరిని చంద్రబాబు ఎప్పటికి మారుస్తారో.. పార్టీ ఎప్పుడు బాగుప‌డుతుందోన‌ని టీడీపీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మ‌రి చూద్దాం.. ఎప్పటికి బాగుప‌డుతుందో.

Tags:    

Similar News