ఢిల్లీలో బాగానే పనిచేస్తున్నాయట
ఏపీ వరకూ ముఖ్యమంత్రి జగన్ కి, చంద్రబాబుకు వీర లెవెల్లో ఫైట్ సాగుతోంది. అది రాజకీయ వైరమే కాదు, వ్యక్తిగత ద్వేషాన్ని సైతం దాటి ఎక్కడికో పోతోంది. [more]
ఏపీ వరకూ ముఖ్యమంత్రి జగన్ కి, చంద్రబాబుకు వీర లెవెల్లో ఫైట్ సాగుతోంది. అది రాజకీయ వైరమే కాదు, వ్యక్తిగత ద్వేషాన్ని సైతం దాటి ఎక్కడికో పోతోంది. [more]
ఏపీ వరకూ ముఖ్యమంత్రి జగన్ కి, చంద్రబాబుకు వీర లెవెల్లో ఫైట్ సాగుతోంది. అది రాజకీయ వైరమే కాదు, వ్యక్తిగత ద్వేషాన్ని సైతం దాటి ఎక్కడికో పోతోంది. ఫలితంగా శాసనమండలి రద్దు దాకా కధ సాగింది. జగన్ ని మండలిలో ఓడించిన చంద్రబాబుని ఏకంగా రద్దు తీర్మానంతో ఖంగు తినిపించారు యువ ముఖ్యమంత్రి జగన్. అయితే ఇపుడే అసలు కధ మొదలవుతోంది. జగన్ తాను చేయగలిగింది అసెంబ్లీ తీర్మానం మాత్రమే. నెగ్గించుకోవాలంటే ఢిల్లీలో లాబీయింగ్ అవసరం. మరి ఆ విషయంలో ఆరితేరిపోయిన చంద్రబాబు అక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు.
తన వారితోనే ……
బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు నిన్నటిదాకా తెలుగు తమ్ముళ్ళే. వారిలో సుజనా చౌదరి బాబుకు వీర విధేయుడు. ఆయన ఇపుడు ఢిల్లీలో మండలి బిల్లు అసలు కేంద్రం దృష్టికే రానీయకుండా తన చక్రం వేస్తున్నారుట. మరో వైపు ఏపీ బీజేపీ నేతలు కూడా జగన్ కి బద్ధ విరోధులుగా ఉన్నారు. వారంతా కలసి డైరెక్ట్ గా తమ అధినాయకత్వానికి చెప్పి మరీ ఇప్పట్లో మండలి రద్దు బిల్లుని ముట్టుకోవద్దని గట్టిగానే సూచిస్తున్నాట. అంటే చంద్రబాబుకు అనుకూలంగా ఇపుడు ఢిల్లీలో రెండు వర్గాలు పనిచేస్తున్నాయన్నమాట.
విజయమేనా…?
ఇక జగన్ ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర పెద్దలతో మాట్లాడారని, వారితో టచ్ లో ఉన్నారని అంటున్నారు. మరో వైపు జగన్ కుడిభుజం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైనే ఈ భారమంతా మోపారట. ఆయన తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఢిల్లీలో ఈ పార్లమెంట్ సెషన్లోనే బిల్లు వచ్చేలా చూస్తున్నారుట. ఆయనకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే గడచిన ఏడు నెలల ఏపీ రాజకీయం చూసుకుంటే కొంత ఎడం వచ్చిందని అంటారు. ఇపుడు విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యంపైనే మండలి రద్దు బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు.
రాజ్యసభలో…
ఇక ఎలాగోలా మోడీ కరుణించి లోక్ సభలో రద్దు బిల్లు పెట్టించి పాస్ చేయించుకున్నా అసలైన కధ రాజ్యసభలో ఉందని అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు, కాంగ్రెస్ అక్కడ బలంగా ఉంది. పైగా ఇతర పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పార్టీలను బుజ్జగించి బిల్లుని పాస్ చేయించుకోవాల్సిన అవసరం బీజేపీకి అయితే లేదు. కానీ జగన్ కి ఇది వ్యక్తిగత ప్రతిష్ట. అంటే ఆయనే నేరుగా రంగంలోకి దిగి ఢిల్లీలో లాబీయింగ్ చేయాలన్నమాట. పైగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతోనే జగన్ రాజకీయ కధ ఇలా మొదలై సాగుతోంది.
అమ్మ పలికేనా?
పైగా సొనియాగాంధీతో జగన్ కి జన్మ వైరం ఉంది. ఇక ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శైలజానాధ్ మాటలను బట్టి చూస్తే తమ పార్టీ తెచ్చిన మండలిని జగన్ రద్దు చేశారని గుస్సా అవుతున్నారు. వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్ పెద్దలు రాజ్యసభలో బిల్లుకు అడ్డం కొడతారన్న డౌట్లు ఉన్నాయి. మరో వైపు బీజేపీలో తన మనషులు ఉన్నట్లుగా కాంగ్రెస్ లోనూ తన సన్నిహితులు చంద్రబాబుకు ఉన్నారు. లోక్ సభను దాటి రద్దు బిల్లు పెద్దల సభకు వస్తే చంద్రబాబు మరింత రాజకీయం చేసైనా అక్కడ దాన్ని గట్టిగా అడ్డుకుంటారని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు మండలి రద్దు బిల్లు ఎన్నెన్నో గండాలు దాటాల్సి వుందని అంటున్నారు.