పక్కన పడేసింది అందుకేనట

ఏపీ మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వస‌నీయ‌త కోల్పోయారా ? దేశంలోనే త‌న‌ను మించిన పొలిటిక‌ల్ లీడర్ లేడ‌ని చెప్పుకొనే [more]

Update: 2020-01-23 09:30 GMT

ఏపీ మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వస‌నీయ‌త కోల్పోయారా ? దేశంలోనే త‌న‌ను మించిన పొలిటిక‌ల్ లీడర్ లేడ‌ని చెప్పుకొనే చంద్రబాబుకు ఇప్పుడు న‌మ్మలేని ప‌రిస్థితులు ఎదుర‌య్యాయా ? ముఖ్యంగా ఢిల్లీలోనూ ఆయ‌న ప‌ర‌ప‌తిని పోగొట్టుకున్నారా ? అంటే తాజా ప‌రిణామాల‌ను విశ్లేషిస్తున్న కొంద‌రు ఔన‌నే అంటున్నారు. ముఖ్యంగా బీజేపీలోని సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా చంద్రబాబు విశ్వసించ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా అమిత్ షా, ప్రధాని న‌రేంద్ర మోడీ వంటి వారు చంద్రబాబు పొడ అంటేనే ఈస‌డించుకుంటున్నార‌ని హస్తిన వ‌ర్గాలు చెబుతున్నాయి.

40 శాతం తెచ్చుకున్నా….

దీనికి ఉదాహ‌ర‌ణ‌గా తాజాగా ఏపీలో చోటు చేసుకున్న బీజేపీ-జ‌న‌సేన పొత్తును వారు ఉద‌హ‌రిస్తున్నారు. నిజానికి బీజేపీకి జ‌న‌సేన‌తో క‌ల‌వ‌డం వ‌ల్ల ఎలాంటి ప్రయోజ‌నం లేదనేది అంద‌రికీ తెలిసిందే. ఓటు బ్యాంకుకు జ‌న‌సేన చాలా దూరంలో ఉంది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్‌పై విశ్వసనీయ‌త ఉన్నట్టుగా కూడా ప‌రి స్థితులు క‌నిపించ‌డం లేదు. ఇక ఏపీలో బీజేపీ బ‌లం, ఆ పార్టీ ప‌ట్ల ప్రజ‌ల్లో ఉన్న న‌మ్మకం గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. అదే స‌మ‌యంలో టీడీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మొన్నటి వ‌ర‌కు అధికారంలో ఉన్న పార్టీ. పైగా 40% ఓటు బ్యాంకు తెచ్చుకుంది.

నిత్యం ప్రజల్లో ఉంటున్నా….

చంద్రబాబు నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు. ఎక్కడ ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న వాలిపోతున్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. అయినా కూడా బీజేపీ పొత్తు విష‌యానికి వ‌చ్చే స‌రికి టీడీపీని కాద‌ని జ‌న‌సేన‌ను అక్కున చేర్చుకుంది. రాత్రికి రాత్రి ప‌వ‌న్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మ‌రీ చ‌ర్చించి చేతులు క‌లిపింది. దీంతో అస‌లు ఆది నుంచి ఎన్డీయేలో భాగ‌స్వామిన‌ని చెప్పుకొనే చంద్రబాబును కాద‌ని బీజేపీ ప‌వ‌న్‌ను మాత్రమే ఎందుకు ద‌రిచేర్చుకున్నట్టు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్న ఏకైక స‌మాధానం చంద్రబాబు విశ్వస‌నీయ‌త కోల్పోయార‌ని.

విశ్వసనీయత లేకనే….

త‌న అవ‌స‌రం ఉన్నన్నాళ్లు చంద్రబాబుకు అంద‌రూ మంచిగా క‌నిపిస్తార‌ని, త‌న అవ‌స‌రం తీరిపోయాక మాత్రం ఆయ‌న వ‌దిలేస్తార‌ని ఈ విధానాన్ని మోడీ స‌హా షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నార‌ని, ముఖ్యంగా హోదా విష‌యంలో యూట‌ర్న్ తీసుకోవ‌డం, మోడీ హ‌ఠావో నినాదాలు ఇవ్వడం, ఎన్నిక‌ల టైంలో ఆయ‌న దేశం అంతా తిరిగి మోడీని ఓడించాల‌ని ప్రచారం చేయ‌డం వంటివి పార్టీలో చ‌ర్చకు వ‌చ్చాయ‌ని, అందుకే చంద్రబాబు ప్రస్థావ‌న కూడా తీసుకురావ‌ద్దని అధిష్టానం ఆదేశాలు ఉన్నాయ‌ట‌. మొత్తంగా చూస్తే చంద్రబాబుపై విశ్వస‌నీయ‌త‌తో పాటు న‌మ్మకం కూడా లేకుండా పోయింద‌ని అంటున్నారు.

Tags:    

Similar News