తెగింపు లేకుండానే లాగించేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ఎవరూ కాదనలేరు. చంద్రబాబు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. రాష్ట్రానికి సీఈవోగా తనకు తాను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ఎవరూ కాదనలేరు. చంద్రబాబు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. రాష్ట్రానికి సీఈవోగా తనకు తాను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ఎవరూ కాదనలేరు. చంద్రబాబు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. రాష్ట్రానికి సీఈవోగా తనకు తాను అభివర్ణించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విజన్ కూడా ఎవరూ తప్పుపట్టరు. ఆయన విజన్ హైదరాబాద్ విషయంలో సక్సెస్ అయినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళతారని అందరూ భావించారు. కానీ నవ్యాంధ్రప్రదేశ్ లోనే ఆయన సక్సెస్ కాలేకపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
సీఎంగా సక్సెస్ అయినా…..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు సక్సెస్ చూసినా పార్టీ అధ్యక్షుడిగా మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. తెగింపు నిర్ణయాలు లేకపోవడం, పార్టీ కోసం కష్టపడి, తమ శ్రమనంతా ధారపోసే కార్యకర్తలను పట్టించుకోకపోవడం చంద్రబాబు చేసిన పెద్దతప్పుగా చెప్పుకోవాలి. దాని ఫలితమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కార్యకర్తలను అసలు ఏమాత్రం పట్టించుకోరు. ఎన్నికల సమయానికి వచ్చేసరికి వాళ్లు గుర్తుకొస్తారు కాని టిక్కెట్లు మాత్రం దక్కవు.
కష్టపడి పనిచేసే వారికి…
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో చంద్రబాబు నమ్మకాన్ని తెచ్చుకోలేకపోయారన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్లోనూ కార్యకర్తల్లో తెగింపు కన్పించలేదు. వైసీపీ అధికారం దూరంగా ఉన్నప్పుడు ఎందరో కార్యకర్తలు శ్రమించారు. వారిలో ఉన్న ఫైర్ ను గుర్తించిన జగన్ వారికి ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు గత ఎన్నికల్లో కేటాయించారు. ఫలితంగా కార్యకర్తగా ఉన్న వారు ఎంపీలయ్యారు. ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలాంటి నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో కన్పించవు. డబ్బులు ఉన్నవారికే సీట్లు దక్కుతాయన్న నిరాశలో కార్యకర్తలున్నారు.
నమ్మకం లేకనే…?
చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కార్యకర్తలను ఇక నుంచి పట్టించుకుంటానని చెప్పినా ఎవరూ నమ్మలేకపోతున్నారు. తెగించి పార్టీ కోసం కష్టపడినా, ఖర్చు చేసినా ఫలితం దక్కదన్న ఆందోళన పసుపు పార్టీ తమ్ముళ్లలో ఉంది. అందుకే తెగించి రోడ్డుపైకి రాలేకపోతున్నారన్న వాదన టీడీపీలో బలంగా ఉంది. కఠిన నిర్ణయాలు, తెగింపు లేకుండానే చంద్రబాబు పార్టీని లాగించేస్తున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టిందన్నది వాస్తవం. ఇప్పటికైనా చంద్రబాబు తెగింపు నిర్ణయాలు తీసుకోకుంటే పార్టీ క్యాడర్ లో నమ్మకం అనేది ఎప్పటికీ ఏర్పడదు.