అర్జంటు గా కావాలట
చంద్రబాబుకు ఎపుడూ అధికారమే ఆశ, శ్వాస అని విమర్శలు ఉన్నాయి. వాటికి తగినట్లుగానే ఆయన మాటలు, చేతలూ కూడా ఉండడమే విశేషం. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి [more]
చంద్రబాబుకు ఎపుడూ అధికారమే ఆశ, శ్వాస అని విమర్శలు ఉన్నాయి. వాటికి తగినట్లుగానే ఆయన మాటలు, చేతలూ కూడా ఉండడమే విశేషం. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి [more]
చంద్రబాబుకు ఎపుడూ అధికారమే ఆశ, శ్వాస అని విమర్శలు ఉన్నాయి. వాటికి తగినట్లుగానే ఆయన మాటలు, చేతలూ కూడా ఉండడమే విశేషం. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజే మళ్ళీ టీడీపీదే అధికారం అని జంకూ గొంకూ లేకుండా అనేయగలరు. ఇక విపక్ష పాత్రలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు పెట్టండి అంటూ ఈ ఏడు నెలల్లో డిమాండ్ చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తాజాగా చంద్రబాబుకు మరో మారు ఎన్నికల అవసరం కనిపిస్తోంది. అమరావతిని రాజధానిగా మార్చాలంటే ఎన్నికలకు జగన్ వెళ్ళాలంట. ఎందుకంటే ఆయన మ్యానిఫేస్టోలో ఎక్కడా రాజధాని మారుస్తామని చెప్పలేదుట. అందువల్ల ప్రజా తీర్పు అనుకూలంగా రావాలంటే ఎన్నికలకు వెళ్లడమే మేలు అని సూచిస్తున్నారు చంద్రబాబు.
అరువు డిమాండ్….
నిజానికి ఈ డిమాండ్ చేసింది మొదట సీపీఐ నారాయణ. ఆయన జగన్ ఎన్నికల్లో రాజధాని మారుస్తామని చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి ప్రజల మద్దతు తీసుకుని మార్చుకుంటే అపుడు ఎవరూ వ్యతిరేకించరు అంటూ విమర్శలతో కూడిన సూచన ఒకటి చేశారు. దాన్ని ఇపుడు దానిని చంద్రబాబు పట్టుకున్నారు. అమరావతి నుంచి రాజధాని మార్చుకోవాలంటే ముందు ఎన్నికలు పెట్టించండి అంటూ అరువు డిమాండ్ తో చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారు.
జగన్ చెప్పారుగా…
జగన్ తన ఎన్నికల సభల్లో ఎక్కడా రాజధానిని మారుస్తామని స్పష్టంగా చెప్పకపోయినా కూడా రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, పచ్చని పొలాలను లాక్కుని టీడీపీ చిచ్చు రేపిందని అంటూ వచ్చారు. అందువల్ల తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తామని కూడా జగన్ పాదయాత్రలోనూ, ఎన్నికల సభల్లోనూ కూడా చెప్పడం జరిగింది. పైగా జగన్ అమరావతిని కొనసాగిస్తామని కూడా ఎక్కడా చెప్పలేదని వైసీపీ నేతలు అంటున్నారు.
రెండు జిల్లాలు చూసుకునా?
చంద్రబాబుకు ఇపుడు ఎక్కడ లేని ధైర్యం వస్తోందా. కేవలం రెండు జిల్లాల్లో అక్కడక్కడ వస్తున్న నిరసనలు, ఆందోళనలను చూసుకుని జగన్ పని అయిపోయింది అనుకుంటున్నారా? ఎన్నికలు పెడితే తానే అధికారంలోకి వస్తానని గట్టిగా నమ్మేస్తున్నారా? అన్నదే ఇక్కడ డౌట్. నిజానికి మూడు రాజధానుల మీద ఎన్నికలు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర జనాలు కూడా ఓట్లు వేస్తారు కదా. మరి అక్కడ టీడీపీకి ఏ విధంగా జనం పట్టం కడతారు. కేవలం రెండు జిల్లాలో సైకిల్ పరుగులు తీసినంతమాత్రాన అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబు అనుకుంటున్నారా? లేక షరా మామూలుగా జగన్ ది అసలు గెలుపే కాదని, ప్రజలు తప్పు చేశారని భావించి ఎన్నికలకు పోదామంటున్నారా. చూడాలి మరి.