టీడీపీకి ఇదే డెడ్ టార్గెట్
ఔను! రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రభుత్వాలు అనుసరించే వ్యూహాత్మక ఎత్తుగలతో పోటీ పడితేనే ప్రతిపక్షాలకు పునరుజ్జీవం అనేది ఉంటుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. వైసీపీ [more]
ఔను! రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రభుత్వాలు అనుసరించే వ్యూహాత్మక ఎత్తుగలతో పోటీ పడితేనే ప్రతిపక్షాలకు పునరుజ్జీవం అనేది ఉంటుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. వైసీపీ [more]
ఔను! రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రభుత్వాలు అనుసరించే వ్యూహాత్మక ఎత్తుగలతో పోటీ పడితేనే ప్రతిపక్షాలకు పునరుజ్జీవం అనేది ఉంటుంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆకర్ష్ మంత్రంతో పటాపంచలు చేసి పార్టీ ఉనికినే లేకుండా చేస్తానని శపథం చేశారు. అదే సమయంలో అసెంబ్లీలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు. ఇక, ఇంటా బయటా కూడా జగన్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు నేరస్తుడు అంటూ కామెంట్లు కుమ్మరించారు. అదే సమయంంలో రాజధాని నిర్మాణం కావాలన్నా.. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలన్నా.. మహిళలకు అండగా ఉండాలన్నా కూడా తాను తప్ప మరో గత్యంతరం లేదని చెపుకొచ్చారు.
ఎదురీత తప్పదా?
అయితే, వీటన్నింటినీ ఒకే ఒక్క వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొన్నారు. సంచలన నిర్ణయం తీసుకుని మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి, ప్రజలకుచేరువ అయ్యారు. వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ ఎవరి శపథాలు లేకుండానే, ఎవరి నుంచి ఆకర్ష్ మంత్రాలు లేకుండానే, ఎవరి శాపనార్థాలూ లేకుండానే రాజకీయంగా ఎదురీదుతోంది. అసలు పార్టీ ఉంటుందా? వచ్చే రెండు మూడేళ్లలోనే ఖాళీ అవుతుందా ? అనే సందేహాలు వచ్చే పరిస్థితి ఎదురైంది.
జగన్ నిర్ణయంతో….
మరి ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు ఇప్పటికే జగన్ సర్కారుపై భీకరమైన రేంజ్‌లో యుద్ధం చేస్తున్నారు. ఇసుక దీక్షలు చేశారు. తన ఇంటిని కూలగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నా కాంటీన్లను మూసేశారని, పేదలకు పట్టెడన్న కూడా దొరకడం లేదని రోడ్ల మీదకు వచ్చారు. అయితే, ఇవేవీ కూడా పార్టీని నిలబెట్టలేకపోయాయి. యువతకు పెద్దపీట వేస్తానన్నారు. అయినా పార్టీలో చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఇక, ఆయనముందున్న ఏకైక బిగ్ అండ్ డెడ్ టార్గెట్ రాజధాని. ఆయన కలలు గన్న రాజధాని, తన వారితోనే కాకుండా అనేక మందితో పెట్టుబడులు పెట్టించిన నగరం, ప్రపంచ పటంలో చూసి మురిసిపోవాలనుకున్న నగరం నేడు జగన్ తీసుకున్న నిర్ణయంతో చరిత్రలో కలిసిపోయేందుకు రెడీ అయిపోయింది.
ఆ ప్రాంతానికే పరిమితం…..
మరి ఈ విషయంలో చంద్రబాబు అమరావతిని రక్షించుకునేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. అయితే, దీనికి కూడా ఆయనకు కలిసి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే విశాఖలోని టీడీపీ నాయకులు రాజధానిని వ్యతిరేకించే పరిస్థితిలేదు. కర్నూలులో హైకోర్టును వద్దనేవారు లేరు. దీంతో ఇప్పుడు రాజధాని విషయం కేవలం ఆ 29 గ్రామాలకే పరిమితం అయితే.. టీడీపీ వ్యూహానికి గొడ్డలి పెట్టుకాకతప్పదని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి సయితం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.మరి చంద్రబాబు తన వ్యూహానికి ఎలా ? పదును పెడతారో చూడాలి.