ఆర్థికంగా చితికపోవడంతోనే?

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కార్పొరేట్ల పార్టీగా మార్చేశార‌న్న అప‌వాదు ఉంది. ఎన్టీఆర్ టైంలో ఎక్కువుగా సామాన్యుల‌కు, రైతుల‌కు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ప్రాధాన్యత ఉండేది. చంద్రబాబు [more]

Update: 2019-12-22 13:30 GMT

తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కార్పొరేట్ల పార్టీగా మార్చేశార‌న్న అప‌వాదు ఉంది. ఎన్టీఆర్ టైంలో ఎక్కువుగా సామాన్యుల‌కు, రైతుల‌కు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ప్రాధాన్యత ఉండేది. చంద్రబాబు రెండుసార్లు వ‌రుస‌గా ఓడిపోయిన‌ప్పటి నుంచి పార్టీలో కార్పొరేట్ల లాబీయింగ్ ఎక్కువైంది. అప్పటి నుంచి చంద్రబాబు పార్టీని కూడా కార్పొరేట్ స్టైల్లోనే ముందుకి నడిపించారు. ఆ పార్టీకి చెందిన మాజీ నేత‌లు సుజనా చౌదరి, సిఎం రమేష్ సహా అనేక మంది నేతలకు చంద్రబాబు పార్టీలో రెడ్ కార్పెట్ పరిచారు.. నారాయణ వంటి వారికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వారు పార్టీకి గత పదేళ్ళు గా అన్ని విధాలుగా అండగా నిలిచారు.

నమ్మిన వారే…..

ఇక ఇదే సమయంలో గంటా శ్రీనివాసరావు, గరికపాటి మోహనరావు వంటి వారు తలో చేయి వేశారు. గ‌రిక‌పాటి పార్టీ మారిపోయారు. ఇక చంద్రబాబు ఎంక‌రేజ్ చేసిన మిగిలిన కార్పొరేట్ నేత‌లు అంతా పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పార్టీకి, పార్టీ కార్యక‌లాపాల‌కు దూరంగా ఉన్నారు. చంద్రబాబు ఎవరికి అయితే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారో వారు పార్టీ మారిపోయారు. నారాయణ, గంటా మారడానికి సిద్దంగా ఉన్నారు. దీనితో పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉండే నేతల మీద చంద్రబాబు దృష్టి పెట్టినట్టు సమాచారం. జిల్లాల్లో బలంగా ఉండటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో తనకు అండగా నిలబడే నేతల కోసం చంద్రబాబు వెతుకులాట మొదలుపెట్టారు.

నాలుగున్నరేళ్ల పాటు….

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీని మ‌రో నాలుగున్నరేళ్ల పాటు న‌డిపించ‌డం అంటే సామాన్యమైన విష‌యం కాదు. టీడీపీకి పార్టీ ప‌ర‌మైన ప‌ద‌వులే త‌ప్పా.. ఇత‌ర ప‌ద‌వులు ఒక్కటి కూడా వ‌చ్చే ఛాన్స్ లేదు. ఒక్క ఎమ్మెల్సీ కూడా రాదు. ఇప్పుడు చంద్రబాబు ఎంత‌మందికి ప‌ద‌వులు ఎర‌వేసినా వాళ్లెవ్వరు ఆయ‌న మాట‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. అయితే ఇప్పుడు త‌న సామాజిక‌వ‌ర్గంలోనే ఆర్థికంగా బ‌లంగా ఉన్న నేత‌ల‌కు ప‌ద‌వులు క‌ట్టబెట్టేందుకు రంగం సిద్ధమ‌వుతోంద‌ట‌.

ఉత్తరాంధ్ర బాధ్యతలను…..

ఇప్పటికే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ తో చంద్రబాబు మాట్లాడినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర లో ఆయన పార్టీని ఆర్ధికంగా మోస్తారట. ఇక గల్లా జయదేవ్ కి గుంటూరు, ప్రకాశం జిల్లాల‌ బాధ్యతలను అప్పగించే ఆలోచన చేస్తున్నారట. ప్రకాశం జిల్లా బాధ్యత‌ల‌ను మాజీ మంత్రి శిద్ధా రాఘ‌రావు మీద పెట్టేయాల‌ని చూసినా.. ఆయ‌న మొన్న ఎన్నిక‌ల్లో త‌న‌కు ఇష్టం లేక‌పోయినా ఎంపీగా పోటీ చేసి భారీగా న‌ష్టపోయారు. దీంతో ఆయ‌న అంత సుముఖ‌త వ్యక్తం చేయ‌లేద‌ని తెలిసింది.

ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి…..

ముర‌ళీమోహ‌న్ లాంటి వాళ్లను చంద్రబాబు ఎంత జోకొడుతున్నా వాళ్లు పార్టీ అంటేనే దూరం జ‌రుగుతున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో పార్టీకి ఆర్ధికంగా అండగా నిలబడే నేతలు కరువు అయ్యారు. ఇది పార్టీకి ఇబ్బందిగా మారడంతో కొంత మందిని వెతికి వారికి పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల‌కు క‌లిపి ఒక నేతను చంద్రబాబు పట్టుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News