నట్టేట మునుగుతామనేనా?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఏం జ‌రుగుతోంది ? చంద్రబాబును న‌మ్ముకున్న నాయ‌కులకు భ‌రోసా లభిస్తోందా ? లేక తాము ఎక్కడ గొంతు విప్పితే.. అక్కడ కేసులు [more]

Update: 2019-12-21 00:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో ఏం జ‌రుగుతోంది ? చంద్రబాబును న‌మ్ముకున్న నాయ‌కులకు భ‌రోసా లభిస్తోందా ? లేక తాము ఎక్కడ గొంతు విప్పితే.. అక్కడ కేసులు పెట్టేందుకు రెడీగా ఉన్న పోలీసులతో తాము తిప్పలు ప‌డాల్సిందేన‌ని నాయ‌కులు హ‌డ‌లి పోతున్నారా ? అందుకే అటు అసెంబ్లీలోను, ఇటు బ‌య‌ట కూడా వారంతా మౌనంగా ఉంటున్నారా? అంటే.. ఔన‌నే సంకేతాలే టీడీపీ శ్రేణుల నుంచి వ‌స్తున్నాయి. ప్రస్తు తం గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీని మిన‌హాయిస్తే.. చంద్రబాబు టీం సంఖ్య 22. కానీ, అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌చ్చినవారు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, వ‌చ్చినా మాట్లాడిన వారు చంద్రబాబుతో క‌లిపి న‌లుగురు.

కేసుల భయమేనా?

మ‌రి మిగిలిన వారు ఏం పాపం చేసుకున్నారు? వారికి మాట్లాడ‌డం రాదా? లేక జ‌గ‌న్ ప్రభుత్వంపై చేసేం దుకు విమ‌ర్శలే లేవా? అదీ కాదంటే వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మస్యలే లేవా? ఇవ‌న్నీ ప‌క్కన పెడితే.. వారంతా భ‌య‌ప‌డుతున్నారా? అంటే.. ఔను భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పుడు ఏ టీడీపీ సీనియ‌ర్‌ను ప‌ల‌క‌రించినా ఇదే మాట వినిపిస్తోంది. మా నాయ‌కులు ఉన్నా..కూడా మాట్లాడ‌లేరు. గ‌తం వారిని వెంటాడుతోంది ? ఇప్పుడు ఏం మాట్లాడితే.. ఎక్కడ కేసులు పెట్టి జైలుకు పంపిస్తారోన‌ని వారంతా హ‌డ‌లి పోతు న్నారు. ఇదీ సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. నిజానికి రాజ‌కీయాల్లో ఉన్నవారికి కేసుల నుంచి భ‌యం ఉంటుందంటే. అంత‌గా న‌మ్మే ప‌రిస్థితి లేదు.

ఫ్యూచర్ పైనేనట….

అయితే, ఇప్పుడు టీడీపీలో సైలెంట్‌గా ఉన్న నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. వారిలో భ‌యం క‌న్నా కూడా ఫ్యూచ‌ర్‌పైనే ఎక్కువ‌గా ఆందోళ‌న‌, ఆస‌క్తి ఉన్నట్టు క‌నిపిస్తోంది. “ప్రభుత్వం ఏదైనా మాకెందుకు.. మా ప‌నులు మాకు జ‌రిగితే చాలు.“ అని అనుకుంటున్న నాయ‌కుల సంఖ్య పెరిగిపోయింది. వీరిలో టీడీపీ నాయ‌కులే ఎక్కువ‌గా ఉన్నారు. తాజాగా అసెంబ్లీలోనే మంత్రి శంక‌ర్ నారాయ‌ణ చెప్పిన‌ట్టు ప్రభుత్వ మ‌ద్యం దుకాణాలు, బార్లను ఆశిస్తున్నవారిలో టీడీపీ నాయ‌కులే ఎక్కువ‌గా ఉన్నారు. ఇవే కాకుండా ప్రభుత్వం నుంచి అనేక రూపాల్లో వీరికి కాంట్రాక్టులు, వ్యాపారాలు ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో పోయి పోయి క‌య్యం పెట్టుకునే ప‌రిస్థితి ఇప్పుడున్న త‌మ్ముళ్లకు లేదు.

భారీగా పెట్టుబడులు పెట్టి……

నిజానికి వీరంతా మ‌ళ్లీ చంద్రబాబు ప్రభుత్వమే వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ఏ ఒక్కరూ కూడా జ‌గ‌న్ ప్రభుత్వం వ‌స్తుంద‌ని ఆశించ‌లేదు. దీనికి ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు అండ్ కో చేయించిన ల‌గ‌డ‌పాటి స‌ర్వే కూడా ఒక కార‌ణం. ప్రజ‌లంతా చంద్రబాబునే కోరుకుంటున్నార‌ని ఆయ‌న‌తో చెప్పించారు. దీంతో టీడీపీలోని చాలా మంది నాయ‌కులు వివిధ ప‌నుల్లో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టారు. భారీ భారీ కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్‌ను కానీ, ఆయ‌న ప్రభుత్వాన్ని కానీ, విమ‌ర్శించ‌డం అనే విష‌యాన్ని ప‌క్కన పెడితే.. అసెంబ్లీలో త‌మ వాయిస్ బ‌లంగా వినిపించినా త‌మ‌కు ఇబ్బందులు త‌ప్పవ‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీలోనే ఉన్నా.. చంద్రబాబుకు స‌హ‌క‌రించ‌డం లేద‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News