అక్కడ డార్లింగ్ ఆయనేనట…!!

మీడియాని మేనేజ్ చేయడంలో చంద్రబాబుని మించిన వారు లేరంటారు. చంద్రబాబు తలచుకుంటే ఢిల్లీ జర్నలిస్టులు పరుగున వస్తారు. అది అమరావతి అయినా హైదరాబాద్ అయినా చంద్రబాబు ముందు [more]

Update: 2019-10-22 13:30 GMT

మీడియాని మేనేజ్ చేయడంలో చంద్రబాబుని మించిన వారు లేరంటారు. చంద్రబాబు తలచుకుంటే ఢిల్లీ జర్నలిస్టులు పరుగున వస్తారు. అది అమరావతి అయినా హైదరాబాద్ అయినా చంద్రబాబు ముందు గొట్టాలు పట్టుకుని నిలబడతారు. చంద్రబాబు అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నపుడైనా, ఇపుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా మీడియా ఆయన కనుసన్నలల్లోనే తిరుగుతుంది. ఇది ఓ విధంగా చంద్రబాబుకు వరం, అదే ఆయనకు బలం. ఇదిలా ఉండగా రాజకీయ ప్రత్యర్ధులు చంద్రబాబుకు జాతీయ మీడియా మద్దతు ఉంది అంటారు. మరి అది తెలుగు నేల వరకూ మాత్రమే. జాతీయ మీడియా సైతం చంద్రబాబునే హైలెట్ చేయడాన్ని ఎలా చూడాలి. ఏపీలో అయిదు నెలల క్రితం ప్రభుత్వం మారింది. అక్కడ కొత్త ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ నేషనల్ చానల్స్, ప్రింట్ మీడియా ఇంకా చంద్రబాబు గారు జపం చేయడమే అసలైన విడ్డూరం.

బాగా మోసేసారుగా…..

చంద్రబాబు అప్పట్లో సీఎం గా ఢిల్లీ వెళ్ళినపుడు జాతీయా మీడియా మొత్తం ఆయన చుట్టూనే తిరిగేది. అంతే కాదు, ఆయన ఏం మాట్లాడినా మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ ఇచ్చేది. ఇక జాతీయ స్థాయిలో మోడీ ప్రధానిగా ఉన్నారు. అదే మోడీపై చంద్రబాబు దండయాత్ర చేశారు. కాంగ్రెస్ సహా విపక్షాలకు సైతం దక్కని మీడియా మద్దతు ఆనాడు చంద్రబాబు ఒక్కరికే లభించడం గొప్ప విశేషంగానే చెప్పుకున్నారు. చంద్రబాబు ఒక్కరు చాలు మోడీకి సమవుజ్జీ అని, ప్రతిపక్షాలను అన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకువస్తారని కూడా మీడియా ఓ రేంజిలో మేసేసింది. ఇక ఏపీలో ఎన్నికల విషయంలోనూ చంద్రబాబుకు తిరుగులేదని, ఆయన గెలుపు మరోమారు ఖాయమని కూడా జాతీయ మీడియా ఎన్నో వార్తా విశ్లేషణలను రాసుకొచ్చింది.

అదీ విషయమట….

ఇక చంద్రబాబు విపక్ష నేతగా ఏపీలో చలో ఆత్మకూరు ఆందోళన చేపట్టారు. దానికి నేషనల్ చానళ్ళు అన్నీ లైవ్ టెలికాస్ట్ చేయడం గమనార్హం. అంతే కాదు, చంద్రబాబు హౌస్ అరెస్ట్ అంటూ జాతీయ మీడియా ఎప్పటికపుడు చేసిన ప్రసారాలు జాతీయ స్థాయిలోనూ వేడి పుట్టించాయి. ఇక అదే సమయంలో వైసీపీ సర్కార్ తీరుని విమర్శిస్తూ జాతీయ ప్రింట్ మీడియాలో కధనాలు కూడా వచ్చాయి. ఏపీలో ప్రజాస్వామ్యం తీరుపైనా విచారం వ్యక్తం చేస్తూ చర్చాగోష్టులు కూడా నిర్వహించారంటే చంద్రబాబు మార్క్ మీడియా మ్యాజిక్ ఏంటన్నది అర్ధమైపోతుంది. వీటి వెనక చంద్రబాబు మేనేజ్మెంట్ ఉందని అంటారు. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎంపీగారు జాతీయ మీడియాను ఇప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారని, దాని ఫలితమే చంద్రబాబు పిలుపు అందుకుని వాలిపోతారని అంటున్నారు. మరి మీడియా మేనేజ్మెంట్ లో వైసీపీ వెనకబడి ఉండడం వల్లనే ఇప్పటికీ యాంటీ న్యూస్ వెల్లువలా వస్తోందని అంటున్నారు. ఇక ఏపీలో మీడియాని నియంత్రించాలని వైసీపీ సర్కార్ అనుకుంటోందని కూడా జాతీయ మీడియా ఇపుడు గట్టిగానే నిలదీస్తోంది. చంద్రబాబు సైతం ఇదే ఇష్యూతో తాను నేషనల్ మీడియాను కలుస్తానని అంటున్నారు. ఇక హస్తినలో చంద్రబాబు మార్క్ రాజకీయానికి వైసీపీ మీద బురద అలా ఇలా పడదన్నమాటేగా.

Tags:    

Similar News