ఏది చేసినా తప్పేనా? ఇప్పుడేమంటారో?
జగన్ ఏది చేసినా తప్పుపట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజం. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక [more]
జగన్ ఏది చేసినా తప్పుపట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజం. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక [more]
జగన్ ఏది చేసినా తప్పుపట్టడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజం. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారని చెప్పారు. వారే ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరవేస్తారన్నారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏ పనికీ ఎమ్మార్వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ సచివాలయంలోనే అన్ని పనులు జరిగిపోతాయని చెప్పారు. లక్షలాది మంది వాలంటీర్లను జగన్ ప్రభుత్వం నియమించింది.
మూటలు మోసే పని అంటూ….
ఇది పిచ్చి పనిగా టీడీపీ అధినేత చంద్రబాబు కొట్టిపారేశారు. మూటలు మోసే పనిగా కూడా ఆయన అభివర్ణించారు. అంతేకాదు వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్లి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కూడా కామెంట్స్ చేశారు. తమ పార్టీ వారికి ఉపాధిని కల్పించడం కోసమే జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని, దీనివల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని కూడా వ్యాఖ్యానించారు.
అదే వ్యవస్థ ఇప్పుడు….
అయితే ఇప్పుడు అదే వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరమయిందనే చెప్పాలి. చంద్రబాబు చెప్పిినట్లు వారు మూటలు మోసే పని ఇప్పుడు ప్రజలకు అక్కరకు వచ్చింది. రేషన్ నుంచి నగదు వరకూ స్వయంగా ఇంటికి వెళ్లి ఇస్తుండటంతో ఏపీలో లాక్ డౌన్ అమలుకు ఎటువంటి ఆటంకాలు కలగడం లేదు. అంతేకాదు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యను తేల్చడంలో కూడా వాలంటీర్లు పకడ్బందీగా చేశారు.
పక్కా సమాచారంతో….
విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆ కుటుంబ సభ్యులు చెప్పకపోయినా పరిచయం ఉండంటంతో వాలంటీర్లకు పొరుగింటి నుంచి ఈ సమాచారం లభించింది. దీంతో రెండు రోజుల్లోనే పక్కాగా నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. దీంతో ప్రభుత్వం వారిపై నిఘా పెట్టింది. వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరించే వీలు కలిగింది. కేరళలో సయితం ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద జగన్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు నాడు విమర్శలు చేసినా… నేడు ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రభుత్వం పక్కాగా తెలుసుకునే వీలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లభించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.