బాబు ఆలోచనలు పాదరసం కంటే వేగంగా..?
వర్ల రామయ్య, మాజీ పోలీస్ అధికారి. ఆయన రాజకీయ విషయాలను కూడా అచ్చమైన పోలీస్ భాషలోనే మాట్లాడుతారని పేరుంది. ఇక ఆయన రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో [more]
వర్ల రామయ్య, మాజీ పోలీస్ అధికారి. ఆయన రాజకీయ విషయాలను కూడా అచ్చమైన పోలీస్ భాషలోనే మాట్లాడుతారని పేరుంది. ఇక ఆయన రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో [more]
వర్ల రామయ్య, మాజీ పోలీస్ అధికారి. ఆయన రాజకీయ విషయాలను కూడా అచ్చమైన పోలీస్ భాషలోనే మాట్లాడుతారని పేరుంది. ఇక ఆయన రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి పాలు అయ్యారు. దాంతో తనకు రాజ్యసభ సీటు కావాలని అడగడం చంద్రబాబు ఇస్తానని చెప్పి మోసగించడం 2018 ఎన్నికల్లో అంతా చూశారు. అప్పట్లో మీడియాలో కూడా వర్ల పేరు వచ్చేసి అంతా కంగ్రాట్స్ చేప్పేశాక సీన్ రివర్స్ అయింది. ఆ బాధ ఎంత అన్నది వర్లకు మాత్రమే తెలుసు. ఆ తరువాత నామమాత్రమైన ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ మీద బ్రహ్మాస్త్రంగా ఆయన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. దళిత కార్డుతో ఇపుడు రాజ్యసబ ఎన్నికల్లో వర్ల చేత నామినేషన్ వేయించడం వెనక బాబు చాణక్య నీతి ఉందని అంటున్నారు.
ఒక్క దెబ్బకు ….
చంద్రబాబు ఆలోచనలు ఎపుడు పాదరసం కంటే వేగంగా ఉంటాయి. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క సీటు అధికార పార్టీకి అవసరం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా తమ పార్టీని గెలిపించే పనిలో బిజీగా ఉన్నారు వారిని ఈ వైపుగా తిప్పాలంటే రాజ్యసభకు ఎన్నికలు పెట్టాల్సిందే. ఎన్నికలు జరిగితే వారంతా ఈ వైపుగా చూస్తారు. ఈ లోగా లోకల్ బాడీ ఎన్నికల్లో వారు అటెన్షన్ కొంత తగ్గుతుంది. అక్కడ పరిస్థితి కూడా సానుకూలం చేసుకోవచ్చు. ఇదీ చంద్రబాబు ప్లాన్.
వేటు కోసమే…..
మరో వైపు వైసీపీ చెంతను ఉంటూ అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్న గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరిలను తమ ఉచ్చులో బిగించి వేటు వేయించాలని బాబు ప్లాన్. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేస్తారట. ఆ విధంగా వారు పార్టీకి అనుకూలం అయితే 23 ఓట్లు టీడీపీకి ఉంటాయి. లేకపోతే వారిని ఇరికించినట్లవుతుంది. దీంతో పాటుగా వైసీపీలో ఏమైనా అసంతృప్తి ఉందేమో అని చంద్రబాబు బూతద్దంతో వెతుక్కుంటున్నారుట. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా అధికార పార్టీ మీద గుస్సాగా ఉంటే వారికి ఆపరేషన్ ఆకర్ష్ తో ఇటువైపు తిప్పాలని కూడా ఒక అండర్ గ్రౌండ్ ప్లాన్ కూడా ఉందిట. అది అంత సులువు కాకపోయినా ఆ రకమైన ఫీలర్స్ వదలడం ద్వారా అధికార పార్టీని నిద్రలేకుండా చేయడం, లోకల్ బాడీ ఎన్నికల నుంచి జగన్ తదితరుల ద్రుష్టిని కొంతైనా ఇటువైపుగా మరల్చడం. ఇదీ బాబు గారి అపర చాణక్యం.
దళిత కార్డు……
ఇక చివరగా దళిత కార్డుతో కొంత సానుభూతి పొందడం. ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందని చంద్రబాబు ఆశ పడుతున్నారు. తాను దళిత పక్షపాతినని, అందుకే అధికార పార్టీ ఆ వర్గానికి అవకాశం ఇవ్వకపోయినా తాను ఇచ్చానని చెప్పుకొవడం. ఇది ఎంతవరకూ ఆ వర్గం నమ్ముతుందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఓడిపోయిన సీటుకు దళితలకు ఇచ్చి మరో మారు గొంతు కోశారని వైసీపీ ప్రచారం అపుడే మొదలెట్టింది. మొత్తానికి కింద పడ్డా మీదనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు రాజకీయానికి మాత్రం వైసీపీ సహా అంతా షాక్ అవుతున్నారు.