బాబు చెప్పిందే జరుగుతోందా?

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. కానీ తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు శాసిస్తున్నారు. తన అనుభవాన్ని రంగరించి మరీ అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు. చంద్రబాబు చెప్పిందే [more]

Update: 2020-04-30 13:30 GMT

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. కానీ తన రాజకీయ చాణక్యంతో చంద్రబాబు శాసిస్తున్నారు. తన అనుభవాన్ని రంగరించి మరీ అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు. చంద్రబాబు చెప్పిందే ఇపుడు అచ్చంగా ఏపీలో జరుగుతోంది అని అటు రాజకీయ లోకం, ఇటు సామాన్య జనం కూడా అనుకునేలా సీన్ ఉందంటే అది బాబు గొప్పతనం కిందే చెప్పుకోవాలి. లేకపోతే ఏపీలో కేసులు దాచేస్తున్నారని, చాలా ఎక్కువగానే వ్యాధి వ్యాపించిందని ముందు నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. అదిపుడు రుజువు అవుతోందని తమ్ముళ్ళు అంటున్నారు. ఒక దశలో తెలంగాణా కేసులో నాలుగవ వంతు ఉన్న ఏపీ ఇపుడు ఆ రాష్ట్రాన్ని మించడం అంటే చంద్రబాబు వేసిన అంచనాలు కరెక్ట్, ఇదే ఆయన పాలనానుభవం అని ఓవైపు తమ్ముళ్ళు గట్టిగానే ఊదరగొట్టేస్తున్నారు.

ముందే అలా ….

నిజానికి ఏపీలో కేసుల పెరుగుదల వెనక రాపిడ్ కిట్ల ప్రభావం ఉంది. ఎక్కువగా టెస్టులు జరుగుతున్నాయి. దాంతో కేసులు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా నుంచి రాపిడ్ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది, దాని వల్ల కేసులు పెరుగుతాయని చంద్రబాబుకు ముందే తెలుసు. దాంతో ఆయన మొదటి నుంచే అదే పాట పాడారు. ఇపుడు చూశారా నేను చెప్పాను, కేసులు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఇంతకాలం కేసులు దాచేసిందని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ తెలియని సాదర జనం మాత్రం బాబు చెప్పాడు, అదే జరుగుతోంది అంటున్నారు. ఇక్కడే జగన్ పాలనానుభవం ప్రశ్నార్ధకం అవుతోంది కూడా.

యనమల జోస్యం….

సరే కేసులు పెరిగి ఏపీలో భయాందోళన పరిస్థితులు ఉంటే మరో వైపు చంద్రబాబు అనుంగు అనుచరుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయితే మరింతగా బెదరగొట్టేతున్నారు. మే 3 లాక్ డౌన్ ఎత్తేసేనాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రెండు వేల పై దాటుతాయని అంటున్నారు. ఇప్పటికి వేయి ఉంటే మరో వారంలో అవి రెట్టింపు అవుతాయని యనమల చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద అక్కసు ఎంత ఉన్నా కేసులు తగ్గాలని ఎవరైనా కోరుకోవాలి కానీ పెరుగుతాయని చెప్పడమేంటి దిగజారుడు రాజకీయం కాకపోతేనూ అంటూ తటస్థులు కూడా యనమల వారి ప్రకటనను తప్పుపడుతున్నారు.

పనిచేస్తున్నా…..

నిజానికి ఏపీ సర్కార్ కరోనా కట్టడి విషయంలో బాగా పనిచేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సగటు కంటే కూడా ఏపీలో టెస్టులు వేగంగా, ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతోనే కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమని వైద్య నిపుణులు కూడా అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇలాగే ప్రతీ చోటా జరగాలని సూచిస్తోంది. కానీ కేసులు పెరగడం అంటే అది ఫెయిల్యూర్ గా ఏపీలోని టీడీపీ లాంటి రాజకీయ పార్టీలు భావించడం, అది సర్కార్ అసమర్ధతగా చిత్రీకరించడం దారుణమే. ఓ వైపు కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్నా వీడని రాజకీయమే తమ్ముళ్ల నోట ఈ మాటలు అనిపిస్తోందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ర్యాండం టెస్టులు కూడా చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. మొత్తానికి టోటల్ గా ఏపీలో కరోనా ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఈ టెస్టులు ఉపయోగపడతాయని మేధావులు కూడా అంటున్నారు. కానీ సగటు జనం భయంతో రాజకీయం చేస్తున్న టీడీపీ మాత్రం కరోనా పై తనదైన రూట్లోనే వెళ్తోంది.

Tags:    

Similar News