అదే రొద్ద కొట్టుడు అయితే ఎలా.. ?

మాట్లాడితే జగన్ పని అయిపోయింది అంటూ చంద్రబాబు అంటారు. ఎక్కడ జగన్ పని అయిందని అటు తమ్ముళ్లకే డౌట్లు వస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన లోకల్ బాడీ [more]

Update: 2021-08-13 05:00 GMT

మాట్లాడితే జగన్ పని అయిపోయింది అంటూ చంద్రబాబు అంటారు. ఎక్కడ జగన్ పని అయిందని అటు తమ్ముళ్లకే డౌట్లు వస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలని వైసీపీ నమోదు చేసింది. ఇక తిరుపతిలో గత ఎన్నికల్లో వచ్చిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది. మరో వైపు టీడీపీకి గత సారి కన్నా ఓట్లు తగ్గాయి. ఇంకో వైపు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక ఉంటే అక్కడ టీడీపీ నుంచి అభ్యర్ధిని పోటీ పెట్టాలంటే ఒకటిని రెండు సార్లు జంకే సీన్ ఉంది. ఇన్ని రకాలుగా అవస్థలు పడుతున్న చంద్రబాబు లేస్తే మనిషిని కాను అన్నట్లుగా జగన్ కి సవాళ్ళు విసరడమే వింతా విడ్డూరమూ అంటున్నారు.

అంత టైమ్ ఇచ్చారా..?

చంద్రబాబు వైఖరి చూస్తూంటే లేస్తే మనిషిని కాను అన్నట్లుగా ఉందనే చెబుతారు. జగన్ ఇలా సీఎం అయ్యారో లేదో అలా ఆయన మీద దాడికి దిగిపోయారు. జగన్ కి కనీసం నెల రోజుల పాటు అయినా గెలుపు ఆనందం మిగల్చలేదు. మరి రెండేళ్ల కాలంలో కూడా ఏ రోజూ టీడీపీ అధినాయకుడు కానీ అనుకూల మీడియా కానీ జగన్ కి టైమ్ ఇచ్చి చూసింది ఎక్కడైనా ఉందా. తెల్లారి లేస్తే చాలు జగన్ మీద విరుచుకుపడిపోవడానికి పెదబాబు, చినబాబు సిద్ధంగా ఉంటారు. మరి అన్నవన్నీ అనేస్తూ ఇపుడు కొత్తగా తాము దిగివచ్చినట్లుగా బస్తీ మే సవాల్ జగన్ అనడమే చంద్రబాబు టైప్ పాలిటిక్స్ అనుకోవాలి.

చిత్తశుద్ధి ఉందా…?

గత రెండేళ్ళుగా వైసీపీ మీద టీడీపీ చేస్తున్న అరోపణలు అన్నీ కూడా వ్యక్తిగతానికి సంబంధించినవే అని చెప్పాలి. జగన్ మీద బురద జల్లుడే వాటిలో ఎక్కువ. ఎంతసేపూ పులివెందుల పంచాయతీ, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మాట్లాడడం తప్ప ఫలానా ప్రజా సమస్య ఇది, దానికి మా పరిష్కారం ఇది, మీరు చేసిన తప్పు ఇది అని నిక్కచ్చిగా చెప్పిన తీరు ఎక్కడైనా ఉందా బాబూ అంటున్నారు విశ్లేషకులు. తనకు శాశ్వతంగా ఉండిపోవాల్సిన ఏపీ సీఎం సీటుని జగన్ దక్కించుకున్నాడు అన్న అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నట్లుగా ఇప్పటికీ మెజారిటీ జనం నమ్ముతున్నారు. అందుకే ఆయన కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవడంలేదు అంటున్నారు.

ఎవరికి అండగా …

జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తే వెళ్ళి వుండవచ్చు కాక. కానీ విశాఖలో భూ దందా జరగలేదని చంద్రబాబు కానీ ఆయన మాజీ మంత్రులు కానీ గట్టిగా చెప్పగలరా అన్నది ఒక నిలువెత్తు ప్రశ్న. అంతే కాదు, సంగం డైరీ విషయంలో అవినీతి జరగలేదు అనగలరా అంటున్నారు వైసీపీ నేతలు, ఇక ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఉన్నారా లేరా అన్నది కూడా దర్యాప్తులో తేలాలి కానీ చంద్రబాబు క్లీన్ చీట్ ఇవ్వడమెందుకు అన్న మాటా ఉంది. మొత్తానికి మా వాళ్ళు అంతా ఆణిముత్యాలు, వైసీపీ నేతలే దొంగలు, దోషులు అంటూ నిందిస్తే జనాలు నమ్ముతారా. నిజానికి చంద్రబాబు గత ఎన్నికలలో ఓటమి తరువాత రెండేళ్ల పాటు సైలెంట్ గా ఉండి ఇపుడు జనాల్లోకి వస్తే ఆయన మీద అటు జనాలకు, ఇటు మీడియాకు కూడా ఫుల్ అటెన్షన్ ఉండేది. కానీ ప్రతీ రోజూ రొడ్డకొట్టుడు విమర్శలతో చంద్రబాబు తన పవర్ ని తానే తగ్గించేసుకున్నారని అంటున్నారు. ఇపుడు కొత్తగా మీ సంగతి చూస్తామంటూ హూంకరించినా జనాలకు పట్టుతుందా అన్నది తమ్ముళ్ళే ఆలోచించుకోవాలి మరి.

Tags:    

Similar News