మహానాడులోపే మాయమవుతారా? కాపాడుకోవడం కష్టమేనా?

వైసీపీ తిరిగి తెలుగుదేశం పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్దమయింది. ఎమ్మెల్యేలపైనే వైసీపీ వల విసురుతుంది. వారితో పాటు కొంత ఆర్థికంగా బలమైన నేతలతో పాటు, ప్రజల్లో [more]

Update: 2020-05-21 05:00 GMT

వైసీపీ తిరిగి తెలుగుదేశం పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్దమయింది. ఎమ్మెల్యేలపైనే వైసీపీ వల విసురుతుంది. వారితో పాటు కొంత ఆర్థికంగా బలమైన నేతలతో పాటు, ప్రజల్లో పట్టున్న నేతలను కూడా ఎంపిక చేసి మరీ పార్టీ కండువాలను కప్పుకునేందుకు సిద్ధమయింది. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుంది. ఆ విధంగా చంద్రబాబును మానసికంగా దెబ్బతీయాలని వైసీపీ భావిస్తుంది.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా….

ఈ మేరకు ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే వైసీపీకి చేరువయ్యారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈనెలాఖరుకు తమ పార్టీకి మద్దతిస్తారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఇద్దరు, కోస్తాకు జిల్లాకు చెందిన మరొకరు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు వీరిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికను వైసీపీ రూపొందించుకుంది. టీడీపీ మహానాడుకు ముందే వారిని పార్టీలో చేర్చుకుని దెబ్బకొట్టాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది.

టచ్ లో ఉంటున్నా…..

మరోవైపు చంద్రబాబు లాక్ డౌన్ తో హైదరాబాద్ లోనే ఉండిపోయారు. చంద్రబాబు ప్రతి రోజూ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నా ఏదో ఒక కార్యక్రమం ఇచ్చి నేతలను యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా హాజరు కావడం లేదు. వీరి గురించి చంద్రబాబు కొంత ఆందోళన చెందుతున్నారు. వారితో నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతూ భరోసా నింపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.

మహానాడు లోపే…..

పార్టీ ఓటమి పాలయిన నాటి నుంచి చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారు. జిల్లా సమీక్షలు నిర్వహించి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. జిల్లా సమీక్షలు నిర్వహించిన చోట కూడా నేతలు పార్టీని విడిచి వెళ్లడం ఆందోళన కల్గిస్తుంది. మరోవైపు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. వైసీపీ వల నుంచి వారిని కాపాడుకోవడం చంద్రబాబుకు కష్టంగానే మారింది. చంద్రబాబు నుంచి వచ్చే భరోసాతో టీడీపీ నేతలు ఆగలేకపోతున్నారు. నాలుగేళ్ల పాటు విపక్షంలో ఉండలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు పార్టీ నేతలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వర్క్ అవుట్ కాలేదంటున్నారు. మహానాడులోపే చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోగొట్టాలన్నది వైసీపీ ఆలోచన. మరి చంద్రబాబు తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News