సీన్ అర్ధమయింది…. కానీ వెయిట్ చేయాల్సిందే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్ధం కానిదంటూ ఏమీ లేదు. ఇరవై నెలల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదని ఆయనకు తెలుసు. కాకుంటే పార్టీ మరింత బలహీనం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్ధం కానిదంటూ ఏమీ లేదు. ఇరవై నెలల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదని ఆయనకు తెలుసు. కాకుంటే పార్టీ మరింత బలహీనం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అర్ధం కానిదంటూ ఏమీ లేదు. ఇరవై నెలల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాలేదని ఆయనకు తెలుసు. కాకుంటే పార్టీ మరింత బలహీనం కాకుండా క్యాడర్ లో ధైర్యం నింపేందుకు, కనీస పనితీరును కనపర్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తనను కూడా క్యాడర్ పట్టించుకోవడం లేదని చంద్రబాబుకు అర్థమయింది.
అందుకే ఈ వ్యాఖ్యలు….
“ఈ రాష్ట్రం గురించి నేను ఒక్కడినే పోరాడాలా? మీకు బాధ్యత లేదా? మీకు పౌరుషం లేదా? మౌనంగా ఉంటే సరిపోతుందా? నన్ను పదిగంటల పాటు తిరుపతి ఎయిర్ పోర్టులో నిర్భంధిస్తే మీకు పట్టదా? స్పందించరా?” అంటూ చంద్రబాబు ప్రశ్నించింది ప్రజలనా? క్యాడర్ నా? అన్నది ఇట్టే అర్థమయిపోతుంది. తనను తిరుపతి ఎయిర్ పోర్టులో నిర్బంధించిన క్యాడర్ ఎటువంటి ఆందోళన చేయకపోవడం చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నట్లుంది.
మరో రెండేళ్ల వరకూ…..
అక్కడక్కడా జరిగినా కొద్దిమందితో మాత్రమే ధర్నాలకు దిగి మమ అనిపించారు. ఇవన్నీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబుకు నివేదికలు అందాయి. కానీ ఇప్పుడు ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. తాను ఒక్కడినే ఇక పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. సాధారణ ఎన్నికలకు ముందు వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుుందన్నది ఆయనకు తెలుసు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రం నేతలు మళ్లీ యాక్టివ్ అవుతారు.
పాదయాత్రకు సిద్ధమవుతారా?
అప్పటి వరకూ పార్టీని నడిపించాల్సిందే. ప్రతిరోజూ జగన్ పై పోరాటం చేయాల్సిందే. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా, చంద్రబాబు దృష్టంతా సాధారణ ఎన్నికలపైనే ఉంది. అందుకే ఆయన ప్రజలతోనే ఎక్కువగా ఇంట్రాక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరసగా జిల్లా పర్యటనలు పెట్టుకుంటారని తెలుస్తోంది. అవసరమైతే పాదయాత్ర చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ పై వ్యతిరేకత వచ్చేంత వరకూ వెయిట్ చేయకతప్పదు.