భ్రమలన్నీ క్రమంగా తొలిగిపోయాయిగా?
అధికారం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత అది మనకే ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు విషయంలో ఇదే జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు [more]
అధికారం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత అది మనకే ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు విషయంలో ఇదే జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు [more]
అధికారం ఉంది కదా? అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత అది మనకే ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు విషయంలో ఇదే జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయలేదు. తానే సర్వశక్తిమంతుడన్న భ్రమలో ఉన్నారు. తాను నూతన ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత ముఖ్యమంత్రినని ఆయన బాగా భ్రమించారు. దాని ఫలితంగానే రాజ్యాంగ వ్యవస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఇబ్బందికరంగా మారాయి.
అధికారంలో ఉన్నప్పుడు…
2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. అందులో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అయితేనే బెటర్ అని ఎంచుకోవడం ఒక కారణం కాగా, మోదీ, పవన్ కల్యాణ్ మద్దతు మరో కారణం. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలోనూ ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదు. కనీసం విపక్షాలతో సంప్రదించే పరిస్థితి కూడా లేదు. అప్పట్లో విపక్షాలను ఆయన పురుగులను చూసి నట్లు చూశారు.
గవర్నర్ వ్యవస్థను….
ఇక గవర్నర్ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మరించలేం. కేంద్ర నియమించిన గవర్నర్లు రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా నినదించారు. గవర్నర్ వ్యవస్థకు తొలి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమేనని చెప్పారు. కేంద్రం బంటులుగా వ్యవహరిస్తూ, గవర్నర్లు వేగులుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ కట్ చేస్తే అదే గవర్నర్ ఇప్పుడు దిక్కయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాలను గవర్నర్ కు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.
కానీ ఇప్పుడు రివర్స్ తగిలి…..
మరొక అంశం. సీబీఐ, ఈడీ ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను తమ రాష్ట్రంలోకి రానివ్వబోమని చంద్రబాబు ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. తమ అనుమతి లేనిదే రాష్ట్రంలో ప్రవేశించ కూడాదని నిబంధన విధించారు. కానీ గత పదిహేను నెలలుగా చంద్రబాబు నోట నుంచి సీబీఐ మాట తప్పించి వేరే పదం విన్పించడం లేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు తలెగరేస్తే.. తర్వాత తలదించుకోవాల్సి వస్తుందనడానికి చంద్రబాబు ప్రత్యక్ష ఉదాహరణ.