బాబు ఈసారి నాన్చరట.. చేసి చూపిస్తారట
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పరిస్థితులను అంచనా వేసుకుంటూ… బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మొన్నటి వరకూ [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పరిస్థితులను అంచనా వేసుకుంటూ… బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మొన్నటి వరకూ [more]
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పరిస్థితులను అంచనా వేసుకుంటూ… బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మొన్నటి వరకూ దయనీయంగా ఉంది. ఇప్పుడిప్పుడే పార్టీ కోలుకుంటోంది. అయితే చంద్రబాబు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న చర్చ పార్టీలో జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుంటారని చెబుతున్నారు.
ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా….
చంద్రబాబుకు ఇప్పటి వరకూ ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓటమి ఎదురయింది. పొత్తులతో కలసి వెళితేనే విజయం వరిస్తుంది. అయితే ఈసారి ఏపీలో పొత్తులకు అవకాశాలు లేవు. సీపీఐ తప్ప మరో పార్టీ చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగా లేదు. కాంగ్రెస్ రెడీ గా ఉన్నా దానికున్న ఓటు బ్యాంకును పట్టి, రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
కలవాలని ఉన్నా….
ఇక బీజేపీతో కలవాలని చంద్రబాబుకు బలంగా ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు దానికి జనసేన కూడా తోడవ్వడంతో వాటితోనే కలసి వెళ్లాలని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. జగన్ ను ఓడించాలంటే బీజేపీ, జనసేనతో కలసి ప్రయాణించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకోసమే పదిహేను నెలలుగా చంద్రబాబు బీజేపీని అవకాశమొచ్చినప్పుడల్లా దువ్వుతూనే ఉన్నారు. అయితే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబును దరిచేర్చుకునే అవకాశాలు కన్పించడం లేదు.
స్టాండ్ తీసుకుంటారట…
దీంతో చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా గళం విన్పించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బీజేపీ జగన్ ను కేసుల్లో కాపాడుతుందని చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు ఆరోపించారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి కూడా చంద్రబాబు మద్దతిచ్చారు. వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాలని మాత్రమే చెప్పారు. తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ఈనెల 8వ తేదీన జరిగిన బంద్ కు కూడా టీడీపీ శ్రేణులు దూరంగా ఉన్నాయి. అయితే రానున్న కాలంలో బీజేపీ కి వ్యతిరేకంగా చంద్రబాబు జాతీయ స్థాయిలో గళం విప్పే అవకాశముందని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో తనకు కలసి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తుండటమే ఇందుకు కారణం. మరి ఏం జరుగుతుందో చూడాలి.