ట్యాగ్ కోసం ఆరాటమే తప్ప?
తెలుగుదేశం పార్టీని నటుడు ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన రాజకీయాల్లో నటించలేదు. ఉన్నది ఉన్నట్లుగానే చేసుకుని పోయారు. కాబట్టే ఆయనకు రాజకీయ నటులు బాగా ఆశ్చర్యానికి గురి చేశారు. [more]
తెలుగుదేశం పార్టీని నటుడు ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన రాజకీయాల్లో నటించలేదు. ఉన్నది ఉన్నట్లుగానే చేసుకుని పోయారు. కాబట్టే ఆయనకు రాజకీయ నటులు బాగా ఆశ్చర్యానికి గురి చేశారు. [more]
తెలుగుదేశం పార్టీని నటుడు ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన రాజకీయాల్లో నటించలేదు. ఉన్నది ఉన్నట్లుగానే చేసుకుని పోయారు. కాబట్టే ఆయనకు రాజకీయ నటులు బాగా ఆశ్చర్యానికి గురి చేశారు. దాదాపుగా మూడు వందల పై చిలుకు చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ తానే మహా నటుడిని అని భావించుకునేవారు. కానీ రాజకీయాల్లో ఆయనకు తనకు మించిన మహా నటుడు అల్లుడు చంద్రబాబు రూపంలో కనిపించారు. తన ముఖ్యమంత్రి కుర్చీని, పార్టీని కూడా లాగేసుకున్న తరువాత కానీ చంద్రబాబులో గొప్ప నటుడు ఎన్టీఆర్ కి కనిపించలేదు అంటారు.
బీసీల పార్టీగా ……
నిజానికి తెలుగు దేశం పార్టీకి బీసీల పార్టీగా పేరుంది. బీసీలు ఆ పార్టీని మొదటి నుంచి దగ్గరకు తీసుకున్నారు. తమకంటూ రాజకీయంగా ఊపిరిపోసే ఒక పార్టీ ఏపీలో వచ్చిందనుకున్నారు. ఎన్టీఆర్ జమానాలో కధ అలాగే సాగింది కూడా. ఎపుడైతే అల్లుడు చంద్రబాబు పార్టీని టేకోవర్ చేశారో బీసీలకు కొంత ఇబ్బందులు వచ్చాయని వారే చెబుతారు. అసలు అధికారం తమ చేతుల్లో ఉంచుకుని బీసీలను అలా బయటకు గొప్పగా చూపించే ప్రయత్నం చంద్రబాబు ఏలుబడిలో జరిగిందని కూడా అంటారు. ఇవన్నీ పరాకాష్టకు చేరడంతోనే బీసీలు టీడీపీని తిరస్కరించి మరో ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ వైపు మళ్ళిపోయారు. బీసీల దెబ్బను తొలిసారి రుచి చూసిన తెలుగుదేశం బిత్తరపోవాల్సివచ్చింది.
ట్యాగ్ కోసమేనా….?
బీసీల పార్టీ టీడీపీ అని పదే పదే చెప్పుకోవాల్సిన అగత్యం ఇపుడు చంద్రబాబు సహా పెద్దలకు ఎందుకు వచ్చింది. బీసీలు నాలుగు దశాబ్దాలుగా ఆదరించిన చోట అనుమానాలు ఎందుకు కలిగాయి. దానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా టీడీపీ అగ్ర నాయకత్వం ఎపుడైనా సమీక్ష చేసుకుందా అంటే జవాబు ఉండదు. టీడీపీ మరో మారు బీసీల ట్యాగ్ తగిలించుకోవడానికే ఆరాటపడుతోంది తప్ప నిజంగా చిత్త శుద్ధితో వారి ఆవేదనను అర్ధం చేసుకుందా అన్న చర్చ మాత్రం ఉంది. లేకపోతే నిన్నటిదాకా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నది ఎవరు. కళా వెంకటరావు కూడా బీసీ నేత కారా? అన్న డౌట్లు తమ్ముళ్లే వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు అర్జంటుగా అచ్చెన్నాయుడిని ముందు పెట్టి బీసీలకు టీడీపీ పెద్ద పదవి ఇచ్చామని టీడీపీ పెద్దలు డప్పు కొడుతూంటే బీసీ తమ్ముళ్ళు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా ఆలోచించాలిగా.
ఫోకస్ లోకేషేగా…?
ఏపీకి టీడీపీ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏపీలో వరదలు వచ్చాయి. మరి జనంలోకి వెళ్లాలింది. టూర్లు వేయాల్సింది ప్రోటోకాల్ ప్రకారం అయితే అచ్చెన్నాయుడే. చంద్రబాబు ఎటూ జాతీయ అధ్యక్షుడు గా ఉన్నారు. ఇక ఆయన తనయుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. మరి లోకేష్ హడావుడి చేస్తూ జనంలో తిరుగుతూంటే కొత్త ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏం చేయాలి. కళా వెంకటరావు మాదిరిగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ కూర్చోవాలా. ఈ మాత్రం భాగ్యానికి కళా అయితేనేంటి, అచ్చెన్న అయితేనేంటి అని బీసీలు అనుకోరా. అధికారం లేని పదవులు కట్టబెడుతూ ఫోకస్ మాత్రం తమ భావి వారసుడి మీదనే పెడుతూ చంద్రబాబు నడుపుతున్న ఈ బీసీ మంత్రాంగం ఏంటన్నది తెలిసిపోబట్టే కదా బీసీలు టీడీపీకి దూరం అయ్యింది అని అంటున్నారు. మొత్తానికి కళా పోయి అచ్చెన్న వచ్చెన్ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం సెటైర్లు వేశారంటే టీడీపీ పాలిటిక్స్ అంతలా బయటపడిపోతోంది మరి.