చంద్రబాబుకు ఉప్పందిందా? వారితో టచ్ లో ఉన్నారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే జమిలి ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2022లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే జమిలి ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2022లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పదే పదే జమిలి ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2022లో ఖచ్చితంగా జమిలి ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతి వీడియోకాన్ఫరెన్స్ లో చంద్రబాబు జమిలి ఎన్నికలను ప్రస్తావించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఊరికే అనరు. తనకున్న పరిచయాలు, అనుభవంతో జమిలి ఎన్నికలు వస్తున్నాయని చెబుతున్నారని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు….
నిజానికి మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నిలకు వెళ్లాలని ఎప్పటి నుంచో అనకుంటుంది. ఒకేదేశం ఒకే ఎన్నిక నినాదంతో బీజేపీ ముందుకు వెళ్లాలనుకుంటుంది. దీనిపై బీజేపీ కేంద్ర నాయకత్వం కసరత్తులు కూడాచేస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబుకు ఇప్పటికీ బీజేపీలో కొందరి పెద్దలతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. వారితో టచ్ లో ఉంటున్నారు. వారు అందించిన సమాచారం మేరకే చంద్రబాబు జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారన్నది పార్టీలో చర్చ జరుగుతోంది.
టచ్ లోకి వెళుతూ…..
ఇటీవల చంద్రబాబు పదే పదే బీజేపీ పెద్దలకు వివిధ సందర్భాల్లో ఫోన్ చేసి మరీ పరామర్శలు చేస్తున్నారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను పరామర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. వీరితో పాటు మరికొందరు పెద్దలతో కూడా చంద్రబాబు తరచూ మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లనే చంద్రబాబు జమిలి ఎన్నికల ప్రస్తావనను పదే పదే చేస్తున్నారంటున్నారు.
యాక్టివ్ చేయడానికేనా?
అయితే దీంతో పాటు గత పదిహేడు నెలలుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో యాక్టివ్ గా లేరు. అధికారం లేకపోవడం, అక్రమ కేసులు బనాయిస్తుండటంతో వారంతా ఎక్కువ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. వ్యాపారాలను చూసుకుంటూ పార్టీకి దూరమయ్యారు. దీంతోనే చంద్రబాబు రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయని హింట్ ఇస్తున్నారని కూడా అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే పదే పదే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారని మాత్రం పార్టీ నేతలు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.