జగన్ ఉచ్చులో చంద్రబాబు చిక్కుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం నలుగుతూనే ఉంది. అయితే చంద్రబాబు జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం నలుగుతూనే ఉంది. అయితే చంద్రబాబు జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం నలుగుతూనే ఉంది. అయితే చంద్రబాబు జగన్ వేసిన ఉచ్చులో పడిపోయారన్న టాక్ వినపడుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం. తొలినాళ్లలో ఇసుక కొరతపై చంద్రబాబు ఆందోళన చేశారు. ఇది కొంత వరకూ ఉపయోగపడింది. ప్రజలకు ఇసుక దొరకకపోవడంతో చంద్రబాబు ఆందోళనకు ప్రజల నుంచి కూడా పరోక్ష, ప్రత్యక్ష మద్దతు లభించింది.
ప్రజా సమస్యలపై…
ఆ తర్వాత రాజధాని అమరావతి అంశంపై ఆందోళనకు దిగారు. కానీ ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే సమస్య అయినా రాజధాని తరలించడం ఎందుకున్న ప్రశ్న ఎక్కువ మందిలో నెలకొంది. అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబు జోలె పట్టి మరీ విరాళాలు సేకరించారు. దీనికి కూడా బాగానే స్పందన వచ్చింది. ఇక కరోనా సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ రోజూ విమర్శలు చేసే వారు. తెలంగాణతో పోల్చుకుని ఏపీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందేమోనని భావించిన వారు లేకపోలేదు.
అజెండాను మార్చడంతో……
కానీ రాను రాను ప్రజాసమస్యలు కాకుండా చంద్రబాబు అజెండాను మార్చడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రధానంగా హిందుత్వ అజెండాను బాబు భుజానికెత్తుకోవడం రాజకీయంగా సరైన స్టెప్ కాదని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి. అంతర్వేది రధం దగ్దం, దుర్గమ్మ గుడిలో రధంలో సింహాలు మాయమవ్వడం, సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వంటివి పార్టీకి మైలేజీ తెచ్చిపెట్టకపోగా బీజేపీకి బీ టీంగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ట్రాప్ లో పడినట్లే…..
నిజానికి చంద్రబాబు అజెండా ఇది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. కులాల ప్రభావం ఎక్కువ ఉంది తప్ప మతాల ఊసుపెద్దగా లేదు. కానీ ఆ అజెండాను ఎత్తుకుని చంద్రబాబు కొన్ని వర్గాల వారికి దూరమవుతున్నారన్న భావన పార్టీ నేతల నుంచే విన్పిస్తుంది. బీజేపీ, వైైసీపీ వేసిన ఉచ్చులో చంద్రబాబు పడిపోయరన్నది వాస్తవం. ఆ రెండు పార్టీలు పైకి కలహించుకుంటున్నా లోపల సహకరించుకుంటున్నాయి. ఈ విషయం తెలిసీ చంద్రబాబు హిందుత్వ అజెండాను అందుకుని బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నించి కొందరికి దూరమయ్యారంటున్నారు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ సద్దుమణిగాయి. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఇంకా చర్చ జరుగుతూనే ఉండటం విశేషం.