బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టీడీపీ నేతలు ఎవరు..?
రాజకీయాల్లో ఉన్నవారికి పదవులే ప్రామాణికం. మరోమాట చెప్పాలంటే.. ప్రాణం కూడా ! అలాంటి పదవులు పోతే.. వారికి ప్రాణం పోయినట్టే! పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు ఎవరైనా [more]
రాజకీయాల్లో ఉన్నవారికి పదవులే ప్రామాణికం. మరోమాట చెప్పాలంటే.. ప్రాణం కూడా ! అలాంటి పదవులు పోతే.. వారికి ప్రాణం పోయినట్టే! పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు ఎవరైనా [more]
రాజకీయాల్లో ఉన్నవారికి పదవులే ప్రామాణికం. మరోమాట చెప్పాలంటే.. ప్రాణం కూడా ! అలాంటి పదవులు పోతే.. వారికి ప్రాణం పోయినట్టే! పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు ఎవరైనా కూడా ఇదే తరహాలో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరి కొందరు అవసరమైతే బెదిరింపులో.. బ్లాక్‌మెయిలో చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీలోని పలువురు నేతలు కూడా పార్టీ అధినేత చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న చర్చ పార్టీలోనే నడుస్తోంది. అసలే పార్టీ కష్టాల్లో ఉంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే లేడు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బాబు ఏ నిర్ణయం తీసుకున్నా కొందరికి ఖేధం మరి కొందరికి మోదం అన్నట్టుగా పరిస్థితి ఉంది.
కళా ఓడిపోయినా…..
టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. పనితీరుపై పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లో ఆయన పెరఫార్మెన్స్‌కు జీరో మార్కులు పడ్డాయి. కారణాలు ఏవైనా.. ఆయన పనితీరుతో పార్టీ ఓడిందనే కారణమే ఎక్కువగా వినిపించింది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ.. అంతర్గత చర్చల్లో ఇదే తరహా వ్యాఖ్యలు వినిపించాయి. అదే సమయంలో తన సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ ఆశించిన మేరకు పార్టీ ప్రగతి చూపించలేక పోయింది. ఎచ్చెర్లలో ఆయనే ఓడిపోయారు.
అచ్చెన్నాయుడికి పదవి ఇస్తారని తెలిసి…..
పైగా గెలిచిన వారు కూడా సొంత ఇమేజ్‌తోనే గెలుపు గుర్రం ఎక్కారనే వాదన కూడా ఉంది. ఇక, వీటికితోడు.. ఎన్నికల సమయంలో పార్టీలో కుమ్ములాటలు పెరిగిపోయాయి. వీటిని అరికట్టి.. పార్టీని నడిపించడంలోనూ కళా వెంకట్రావు విఫలమయ్యారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పార్టీలో కొత్త అధ్యక్షుడి నియామకానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల పార్టీ పగ్గాలను అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని దీనిపై ఆయనతో చర్చలు కూడా జరిపారని తెరమీదికి వార్తలు వచ్చాయి. వీటిలో వాస్తవం ఎంతో .. తెలియదు కానీ.. కళా వెంకట్రావు మాత్రం రియాక్ట్ అయ్యారట.
నా దారి నేను చూసుకుంటా…..
“నేనేమన్నా పదవి ఇవ్వమని బతిమాలానా? అయినా.. అన్నీ నా కనుసన్నల్లోనే జరుగుతున్నాయా ? నామాటను పట్టించుకున్న వారేరీ ? పైగా ప్రతి విషయంలోనూ నెంబర్ 2 జోక్యం ఎక్కువగా ఉంది. ఇన్నింటిని కూడా తట్టుకుని నేను కాబట్టి కొనసాగాను. అయినా.. ఇప్పుడు నన్ను తొలగించాల్సిన అవసరం లేదు. అదే జరిగితే.. నా దారి నేను చూసుకుంటా!“ అని ఆయన తన అనుచరులతో అన్నారట. గతంలోనూ ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆయన అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు.
అచ్చెన్న కూడా బెదిరింపులేనా…..?
ఇక చంద్రబాబు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఇప్పటికే అచ్చెన్నాయుడు ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలిసిందే. అయితే అచ్చెన్నాయుడు మాత్రం తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఈ పదవి స్వీకరిస్తానని.. తనకు పదవి ఇచ్చి మళ్లీ తనపై పెత్తనం చేస్తే తనకు వద్దని ఖరాఖండీగా చెప్పేశారట. దీనిని బట్టి అచ్చెన్నకు చంద్రబాబు పదవి ఇచ్చినా ఆయన డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
అల్టిమేటమ్ లు రావడంతో……
ఇక ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం తమ కండీషన్లకు చంద్రబాబు ఒప్పుకుంటారా ? లేదా తమదారి తాము చూసుకోమా ? అని బెదిరిస్తున్నట్టు టాక్. గుంటూరు జిల్లాలో రాయపాటి ఫ్యామిలీ తమకు సత్తెనపల్లి సీటు ఇస్తారా ? లేదా ? తమ దారి తాము చూసుకోమా ? అని చంద్రబాబుకు ఇప్పటికే తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి బెదిరింపులు, అల్టిమేటాలే పలువురు నేతల నుంచి చంద్రబాబుకు వస్తున్నాయని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.