అడిగారా? పెట్టారా? ఎందుకోసం?

వైసీపీ అంటే కేసుల కోసం బీజేపీ చెప్పినట్లు వింటుందనుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ కూడా ఇదే. జగన్ కేసుల కోసం కేంద్రంలోని అధికార పార్టీ పెట్టే [more]

Update: 2020-09-15 08:00 GMT

వైసీపీ అంటే కేసుల కోసం బీజేపీ చెప్పినట్లు వింటుందనుకోవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ కూడా ఇదే. జగన్ కేసుల కోసం కేంద్రంలోని అధికార పార్టీ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు పలుకుతున్నారని. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వైసీపీ మద్దతిచ్చినప్పుడు కూడా చంద్రబాబు జగన్ పై ఇదే ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి వైసీపీ స్టాండ్ లో మార్పు లేదు. గత కొంతకాలంగా ఎన్డీఏ పెడుతున్న ప్రతి అంశానికి వైసీపీ మద్దతిస్తూనే ఉంది.

జగన్ అంటే సరే…..

మరి చంద్రబాబు ఎందుకు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు? అన్నదే ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దీనికి చెప్పేందుకు చంద్రబాబు వద్ద సమాధానం ఉందా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజమే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లునూ టీడీపీ సమర్థిస్తూ వస్తుంది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలోనూ వైసీపీ కంటే ముందుగా టీడీపీ తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఒకే ఒక సభ్యుడు…..

నిజానికి టీడీపీకి రాజ్యసభలో ఒక్కరే సభ్యులు ఉన్నారు. ఉన్నవారిని బీజేపీలోకి పంపించేశారు. మిగిలింది కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే. ఒక్క ఓటు కోసం ఇటు ఎన్డీఏ, అటు యూపీఏ నుంచి చంద్రబాబుకు ఫోన్ రాలేదు. అయినా టీడీపీ మద్దతిచ్చింది. జగన్ కి అంటే కేసుల భయంతో బీజేపీకి బేషరతుగా మద్దతిస్తున్నారనుకోవచ్చు. అది నిజమేనని కాసేపు అనుకుందాం. మరి చంద్రబాబుకు ఏమైంది. ఎన్నికలకు ముందు మోడీని చీల్చి చెండాడతానని చెప్పి ఊరూరా తిరిగిన చంద్రబాబు ఇప్పుుడు ఎందుకు మద్దతిస్తున్నట్లు?

ఎప్పటికైనా కుదురుతుందని…..

దీనికి కారణం కూడా ఉందంటున్నారు. భవిష్యత్ లో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒకటి కాగా. మరొకటి జగన్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేదుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆశించి ఇలా అడగకపోయినా బీజేపీకి మద్దతిస్తున్నారన్నది వాస్తవం. ఏమాత్రం అవకాశం ఉన్నా బీజేపీతో మళ్లీ సఖ్యత కుదిరితే ఏపీలో తిరిగి పార్టీని ఒక గాడిన పెట్టవచ్చన్నది చంద్రబాబు భావన. అందుకే మోదీ పిలుపు కోసం చంద్రబాబు ఎప్పటికీ నిరీక్షిస్తూనే ఉంటారు. అంతేకాకుండా వాళ్లు అడగకపోయినా ముందుండి మద్దతిస్తూనే ఉంటారు.

Tags:    

Similar News