స్పేస్ ఉంది.. .కానీ ఛేజ్ చేయగలమా?
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మరో [more]
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మరో [more]
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మరో ఏడాదిలో ఏపీలో టీడీపీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కక్ష పూరిత చర్యల వల్ల నేతలు బయటకు రావడం లేదని, లేకుంటే ఇప్పటికే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడే వారని ఆయన అంటున్నారు.
వీక్ గా ఉన్న టీడీపీని…..
ిఇక తెలంగాణాలోనూ వీక్ అయిన పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం చంద్రబాబు కరోనా కారణంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయన ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు.
బడా నేతలందరూ వెళ్లిపోగా……
తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమంగా ఖాళీ అవుతుంది. ఉన్న నేతలందరూ పార్టీని విడిచి వెళ్లిపోయారు. ఒక్క రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాత్రం ఇంకా పార్టీలోనే ఉండీ లేరనిపిస్తున్నారు. మొదటి శ్రేణి నేతలందరూ పార్టీని విడిచి వెళ్లిపోగా ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే తెలుగుదేశం పార్టీలో మిగిలారు. గతంలో ఏపీపైనే చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కార్యచరణ రూపొందించుకున్నారు.
కార్యవర్గాన్ని ప్రకటించాలని…..
దీంతో ఈ నెలాఖరుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. గతంలో రాష్ట్ర కమిటీలో 140 మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు 70 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ సరిహద్దుల్లో ఉండే జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మరి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందా? లేదా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.