టార్చర్ పెడుతున్నారు…జెండా ఎత్తేయడమే బెటరా ?

ఓ వైపు చంద్రబాబు జూం మీటింగుల హోరు ఎక్కువైపోతోంది. ఆయన చెప్పిందే చెబుతూ తెగ బోర్ కొట్టించేస్తున్నారు. అమరావతి మన రాజధాని అని అక్కడ నినాదాలు ఇస్తున్నారు. [more]

Update: 2020-08-15 14:30 GMT

ఓ వైపు చంద్రబాబు జూం మీటింగుల హోరు ఎక్కువైపోతోంది. ఆయన చెప్పిందే చెబుతూ తెగ బోర్ కొట్టించేస్తున్నారు. అమరావతి మన రాజధాని అని అక్కడ నినాదాలు ఇస్తున్నారు. అంతే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతలంతా విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలుపు ఇస్తున్నారు. ఈ మేరకు ఫోన్ల ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు, ఇతర కీలక నాయకులకు అధిష్టానం నుంచి ఈ మధ్యన వత్తిడి బాగా ఎక్కువ అవుతోందిట. దీంతో తమ్ముళ్ళు ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నామని వాపోతున్నారు. లోకల్ గా ఉండే సమస్యలు మాకు తెలుస్తాయి. కానీ ఏదీ అర్ధం చేసుకోకుండా ఇలా చేయడమేంటని కూడా గుస్సా అవుతున్నారుట.

రివర్స్ అవుతుందా….

చంద్రబాబు చెప్పినట్లుగానే తాము విశాఖ రాజధాని వద్దు అంటూ వీధిన పడి ఆందోళన చేస్తే తమ పొలిటికల్ కెరీర్ మొత్తం రివర్స్ అవుతుందని తమ్ముళ్ళు భయపడుతున్నారుట. హై కమాండ్ కి అమరావతి రాజధాని కావాలి, మంచిదే, కానీ విశాఖ దాకా వచ్చిన రాజధానిని కాదంటే ఇక్కడ ఓటేసిన జనం తిరగబడితే గతేంటని కూడా తమ్ముళ్ళు మధనపడుతున్నారుట. విశాఖ సిటీ తప్పించి రూరల్ జిల్లాతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అన్నీ కూడా బాగా వెనకబడిఉన్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ సర్కార్ రాజధాని పెడుతూంటే సాధారణ జనంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని చెబుతున్నారు. కాదని మధ్యకు వెళ్తే మాడు పగిలేది టీడీపీకేనని కూడా పసుపు పార్టీ నాయకులు ఆందోళన పడుతున్నారు.

తేల్చేస్తారా…?

పార్టీలో ఉండడం వల్ల అమరావతి అనాలి, విశాఖలో ఉండడం వల్ల వైజాగ్ కాపిటల్ అనాలి. ఈ రెండింటికీ మధ్యలో నలిగిపోతున్నామని తమ్ముళ్ళు తల బాధుకుంటున్నారుట. ప్రెస్ మీట్లు పెట్టి విశాఖ వద్దు అమరావతి ముద్దు అనమని హై కమాండ్ గట్టిగా ఆదేశాలు జారీ చేస్తున్న నేపధ్యంలో ఇక అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా తమ్ముళ్ళు భావిస్తున్నారుట. పార్టీ నుంచి బయటకు వస్తే స్వేచ్చగా విశాఖకు జై అనవచ్చునని చాలా మంది టీడీపీ నాయకుల ఆలోచనగా కనిపిస్తోందిట.

కొబ్బరికాయతో పాటే గుమ్మడి కాయ….

జగన్ విశాఖ రాజధానికి శంఖుస్థాపన చేసిన రోజునే టీడీపీకి గుమ్మడి కాయ కొట్టాలని తమ్ముళ్ళు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారుట. ఇప్పటికే ఉత్తరాంధ్రాలో రాజకీయంగా కీలకమైన ఓ కుటుంబంలోని ప్రముఖ నాయకుడు చంద్రబాబు మాట ఈ ఒక్క విషయంలో వినకూడదని డిసైడ్ అయిపోరట. ఈ నాయకుడు గతంలో అమరావతి ముద్దు అన్న వారే. ఇపుడు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశాక కాదంటే పొలిటికల్ కెరీర్ పోతుందని భావిస్తున్నారుట. ఇదే విధంగా విశాఖకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారుట. మరి ఇందులో ఎంతమంది వైసీపీలో చేరుతారో తెలియదు కానీ చంద్రబాబు ఆదేశాలకు మాత్రం తలాక్ అంటున్నారు. అంటే బాబుకే అమరావతిని వదిలేసి తమ సొంత అజెండాకు తమ్ముళ్ళు సిధ్ధపడుతున్నారన్న మాట. మొత్తానికి అమరావతి అని గొంతు చించుకుంటున్న చంద్రబాబు పార్టీకి ఎదురవుతున్న నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News