తమ్ముళ్ళూ ఔనంటారా? కాదంటారా?
చంద్రబాబు ఏంటో. ఆయన తీరు ఏంటో. కనీసం తన కొడుకు లోకేష్ గురించి అయినా ఆయన సరిగ్గా అర్ధం చేసుకున్నారా అన్నదే పెద్ద డౌట్. కాలం కలసి [more]
చంద్రబాబు ఏంటో. ఆయన తీరు ఏంటో. కనీసం తన కొడుకు లోకేష్ గురించి అయినా ఆయన సరిగ్గా అర్ధం చేసుకున్నారా అన్నదే పెద్ద డౌట్. కాలం కలసి [more]
చంద్రబాబు ఏంటో. ఆయన తీరు ఏంటో. కనీసం తన కొడుకు లోకేష్ గురించి అయినా ఆయన సరిగ్గా అర్ధం చేసుకున్నారా అన్నదే పెద్ద డౌట్. కాలం కలసి వచ్చి అపర చాణక్యుడు బిరుదు దక్కితే మురిసిపోవడం కాదు, కానీ కాలంలో కధ కంచికి చేరుతున్న వేళ బాబు గారి అసలు విన్యాసాలు చూడాలిపుడు. పార్టీలో ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోలేని బాబు, ఏపీ జనం గురించి ఇంకేం ఆలోచిస్తారని సెటైర్లు పడుతున్నారు. ఉమ్మడి ఏపీని రెండు ముక్కలు చేయడంతో తెలంగాణాలో పార్టీ పరువు, బరువూ పోగొట్టుకున్న చంద్రబాబు ఇపుడు జగన్ వేసిన మూడు రాజధానుల పాచికలో నిలువునా చిక్కి పూర్తిగా చతికిలపడాల్సివస్తోంది.
మౌనంగానే ….
అందుకే చంద్రబాబుకు విశాఖ రాజధానిగా ప్రకటించడం ఒక దుర్దినంగా, చీకటి రోజుగా అనిపించవచ్చు కానీ విశాఖ తమ్ముళ్లకు మాత్రం ఇది సుదినంగానే ఉంది. వారు విశాఖ జనం ఓట్లతోనే గెలిచారు. విశాఖవాసులకు రాజధాని వస్తూంటే వద్దని అడ్డు చెప్పి చంద్రబాబు జెండా అజెండా మోయడానికి ఏ పసుపు తమ్ముడూ ఇపుడు సిధ్ధంగా లేకపోవడం విశేషమే. అందుకే కంచుకోట అనుకున్న చోట. ఏకంగా విశాఖ సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఒక్క తమ్ముడు కూడా రాజధానిని వ్యతిరేకించలేదు. పైగా లోపాయికారిగా మద్దతు ఇస్తున్నారు. ప్రజలందరికీ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయమని పిలుపు ఇచ్చిన చంద్రబాబు తన తమ్ముళ్లను మాత్రం లేపలేకపోతున్నారంటే ఆలోచించుకోవాలి.
సీమలో సేమ్ సీన్….
ఇక రాయలసీమలో తెలుగుదేశానికి ఎపుడో సీన్ కాలింది. 2019 నాటికి వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చేసింది. దాంతో కనీసం మూడు రాజధానుల విషయంలో అయినా చంద్రబాబు కొంత అనుకూలంగా కర్నూలు లో హైకోర్టు వరకూ తమకు ఒకే అని మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ అన్నీ అమరావతిలోనే ఉండాలి అంటూ చంద్రబాబు పట్టిన మొండి పట్టుకు సీమలో సీన్ సితార్ అయింది. అక్కడ ఒక్కరంటే ఒక్కక తెలుగుతమ్ముడు ఇది అన్యాయమని అనడంలేదు. పైగా న్యాయరాజధాని ప్రకటించిన జగన్ ఇప్పటిదాకా ముఖ్యమంత్రులుగా ఉన్న వారందరికంటే గొప్పవారు, పాలనాదక్షుడు అంటూ కితాబు ఇస్తున్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని నినాదం సీమలో కూడా అరణ్య రోదనగానే మిగిలింది.
లేవని గొంతులు….
ఇక చంద్రబాబుకు బలముంది, అలాగే సామాజికవర్గం దన్ను ఉంది అని చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా గట్టిగా లేచిన గొంతులేమున్నాయి ఇపుడు. ఒక్క దేవినేని ఉమా, బోండా ఉమా లాంటి వారు తప్ప మిగిలిన వారంతా గప్ చిప్ అయ్యారు. వారి ఆక్రోశం ఆవేదన అమరావతిలో హైప్ క్రియేట్ చేసి కొనుక్కున్న భూములు బండబారాయని మాత్రమే కాదు, తమకు పెద్ద దిక్కు అండగా ఉంటారనుకున్న చంద్రబాబు రాజకీయం మరీ ఇంత పేలవంగా నేలబారుడుగా ఉండడం చూసి ఆగ్రహం అంటున్నారు. ఒక విధంగా అమరావతి రాజధాని ఎపిసోడ్ తో చంద్రబాబు తన సొంత సామాజికవర్గం మద్దతు కూడా కోల్పోయారా అన్న అనుమానాలు వస్తున్నాయి.