టచ్ చేస్తే చాలట… బాబు నుంచి ఫోన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. గతంలో మాదిరిగా ఆయన అంటీ ముట్టనట్లు ఉండటం లేదు. సామాన్య కార్యకర్తను సయితం ఫోన్ చేసి మరీ [more]

Update: 2020-07-28 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. గతంలో మాదిరిగా ఆయన అంటీ ముట్టనట్లు ఉండటం లేదు. సామాన్య కార్యకర్తను సయితం ఫోన్ చేసి మరీ పలకరిస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడిన కాల్ రికార్డులను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ నెట్టింట్లో వైరల్ చేస్తుంది. చంద్రబాబు కార్యకర్తలను ఎలా దగ్గరకు తీసుకుంటున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నమే ఇది.

అధికారంలో ఉన్నప్పుడు…

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కార్యకర్తలను పట్టించుకోలేదు. కార్యకర్తలు సరే నేతలకు సయితం ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. పూర్తిగా అధికారుల పైనే ఆధారపడి చంద్రబాబు పాలన సాగించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని సంబరపడిన కార్యకర్తలను చంద్రబాబు టీం ఐదేళ్ల పాటు లెక్క చేయలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలు సయితం పార్టీకి దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గనడం లేదు.

నేరుగా ఫోన్ చేసి….

దీంతో చంద్రబాబు నేరుగా వారితో మాట్లాడేస్తున్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై కేసు నమోదయితే చాలు వెంటనే చంద్రబాబు నుంచి ఫోన్ వస్తుంది. కార్యకర్తకు చంద్రబాబు ఫోన్ చేసి భరోసా ఇస్తున్నారు. నెల్లూరు జిల్లా శ్రీకాంత్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడిన ఆడియో సంభాషణ టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైరల్ చేసింది. ఏడాదలో దాదాపు 800 మంది కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి.

ప్రత్యేకంగా న్యాయవాదులను…..

కరోనా నేపథ్యంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలు, నేతలకు టచ్ లోకి వెళుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ న్యాయవాదులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించింది. కార్యకర్తపై నమోదయిన కేసును పార్టీ న్యాయవాది చూస్తారు. కార్యకర్తలకు బెయిల్ రావడం, కేసు విచారణ అంతా ఆయనే చూసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన ఖర్చును కూడా పార్టీయే భరిస్తుందని చంద్రబాబు చెప్పారు. దీంతో గతంలో లాగా కాకుండా చంద్రబాబు స్టయిల్ మార్చి క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నాుల చేస్తున్నారు.

Tags:    

Similar News