జగన్ స్థానంలో బాబును ఊహించుకోండి….షాట్ రెడీ లొకేషన్

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఉండవల్లి వెళ్తుండగా బెంజి సర్కిల్లో…..బులెట్ ప్రూఫ్ కాన్వాయ్ రయ్యిన వెళ్తుండగా…. మాటలు కూడా రాని ఓ మూడేళ్ళ చిన్నారి చేతిలో థాంక్ [more]

Update: 2020-07-19 06:30 GMT

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఉండవల్లి వెళ్తుండగా బెంజి సర్కిల్లో…..బులెట్ ప్రూఫ్ కాన్వాయ్ రయ్యిన వెళ్తుండగా…. మాటలు కూడా రాని ఓ మూడేళ్ళ చిన్నారి చేతిలో థాంక్ యూ తాతయ్య అని ప్లకార్డు పట్టుకుని ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఆ పిల్లాడిని చూడగానే సీఎం కాన్వాయ్ ఆగిపోతుంది. ఎక్కడి నుంచి వస్తారో కానీ ఓ పది మంది మీడియా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చి రాని మాటలతో ఆ బుడత, బాబుగారి చిడతలు రోజంతా వస్తాయి. టీవీలో చూసి ఎవరికి చెప్పకుండా తానే వచ్చానని చెప్పడంతో అంతా కళ్ళు తుడుచుకుంటారు.

లొకేషన్-2

కరోనా రోగుల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటలకు కరకట్ట మీద నుంచి బయలుదేరాడు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మొత్తం 50వాహనాలు.. 4ఓబీలు, ఓ ఓపెన్ టాప్ ఐచర్ వాహనం పోలోమని బయలుదేరాయి. అవి ఎక్కడికి వెళుతున్నాయో ఎవరికి తెలియకపోయినా కాన్వాయ్ చేరాల్సిన లొకేషన్ లో మాత్రం నాలుగు డీఎస్ఎన్జీ లు ఉంటాయి. ఉదయం ఐదుకే ఎడిటర్లకు కాల్స్ వెళ్లిపోతాయి. ఇక ఆస్పత్రి దగ్గర జస్ట్ ఓ మాస్క్ పెట్టుకుని వార్డులన్నీ తిరిగేస్తూ, మీడియా వాళ్ళ ముందు నవరసాలు ఒలికిస్తూ నాలుగు గంటల పాటు హంగామా ఉంటుంది. ఉదయం 6 నుంచి 10వరకు ఒరిజినల్, తర్వాత ఒకటి వరకు కరోనాపై కరాటే ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నమాట.

ఎపిసోడ్-3

ఈ కష్ట కాలంలో జనాలకు అండగా ఉండటానికి ఆడియో విజువల్స్ తయారు చేయాలని సీఎం పర్సనల్ కెమెరా మాన్ కి ఐడియా వస్తుంది. వెంటనే తన టీం తో ఓ షూట్ చేయించి, నాయకుడా, కరోనాకి బాబు లాంటి నాయకుడా అనుకుంటూ చెవులు అదిరే సౌండ్స్ తో సాంగ్ రెడీ చేయిస్తారు. మొత్తం ఐదు లక్షలతో పనైనా 59 లక్షల ఖర్చయిందని, అయినా పర్లేదని బాబు గారి ముందు బిల్డప్ ఉంటుంది. ఏయ్… ఇది చూడండి…. మనోడికి డబ్బులిచ్చేయండి అని వెంటనే ఆర్డర్ వినిపిస్తుంది. అది వినగానే మిగతా వాళ్ళు బెజవాడ వదిలేసి కృష్ణా నగర్ పరిగెడతారు….. పాటలు రెడీ చేయడానికి…. బిల్లు రెడి అయ్యేసరికి అది 75లక్షలో, కోటికి చేరడమో వేరే విషయం.

ఎపిసోడ్-4

కోవిడ్ వ్యాక్సిన్ తయారీ కోసం పని చేస్తున్న లాబ్ లో శాస్త్రవేత్తలకు బాబు సూచనలు ఇస్తున్న ఫోటోలు, బాబు గారి వల్లే తమ పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయని వ్యాసాలు కనిపించేవి. జనం నవ్వుకుంటారనే స్పృహ కూడా ఈ పత్రికలకు రాసే వాళ్లకు ఉండదు. అది చదివే వాళ్ళ కర్మకు వదిలేయడమే…..ఇక పత్రికల్లో హెడ్డింగ్ బట్టి వాళ్ళయూ రెమ్యూనరేషన్ ఉంటుంది. తాము పెట్టిన హెడ్డింగులు చూపి తెల్లారక ముందే మార్కులు వేయించుకోడానికి బ్యూరోలు పోటీ పడుతుంటాయి.ఇదంతా ఎందుకంటే…. కరోనా చికిత్సలు, మరణాల విషయంలో వీలైనంత విషం చిమ్మడమే లక్ష్యంగా ఆ రెండు పత్రికలు పని చేస్తున్నాయి.

ఆయన ఉండి ఉంటే…?

రాష్ట్రంలో, దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఆంక్షలను సడలించడమే ప్రధాన కారణం. ఆంక్షలు విధిస్తే బతకలేని పరిస్థితి. రోజు కూలీలు, వేతన జీవులు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎవరికి, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. వేరే రాష్ట్రాలతో పోలిస్తే, పట్టణ, పల్లె తేడా లేకుండా ఎక్కువ కరోనా టెస్ట్ లు ఆంధ్రాలో జరుగుతున్నాయి. ఉన్న వైద్యులు, సిబ్బంది స్థాయికి మించి కేసులు బయట పడుతున్నా ప్రభుత్వం శక్తికి మించి పని చేస్తోంది. ఒక్కసారి సీఎం స్థానంలో జగన్ బదులు చంద్రబాబు ఉంటే ఇవే పత్రికలు కరోనాతో కరాటే., కిల్ కిల్ కరోనా…చిల్ చిల్ ఏపి.., కరోనా ఫైట్ లో ఏపీ బెస్ట్…… ఆంధ్రా సలహాలు కోరుతున్న అగ్ర దేశాలు…., నివ్వెరబోయిన పొరుగు రాష్ట్రాలు శభాష్ బాబు అన్న ట్రంప్ సీబీఎన్ సలహా కోరిన జిన్ పింగ్ చైనాకు ఏపీ బృందం అని రాసేవి.

Tags:    

Similar News