ఆ మాజీ మంత్రుల‌కు నోటీసులు.. బాబు నిర్ణయం.. రీజ‌న్ ఇదే

రాష్ట్రంలో ఒక‌ప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు క‌ష్టాలు ముసురుకున్నాయి. అధికారం కోల్పోవ‌డ‌మే కార‌ణం కాదు.. పార్టీ కూడా నిల‌బ‌డే ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణం.. [more]

Update: 2020-07-21 00:30 GMT

రాష్ట్రంలో ఒక‌ప్పుడు అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు క‌ష్టాలు ముసురుకున్నాయి. అధికారం కోల్పోవ‌డ‌మే కార‌ణం కాదు.. పార్టీ కూడా నిల‌బ‌డే ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణం.. పార్టీలోనే ఉంటూ.. పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నార‌నే విమ‌ర్శలు నాయ‌కుల‌పై ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త ప్రభుత్వంలో ప‌ద‌వులు ద‌క్కించుకుని అనుభ‌వించిన పార్టీలో కొంద‌రు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల‌కు, అధినేత పిలుపుల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో వారిని మార్చాల్సిందేన‌ని.. అలాంటి వారివ‌ల్ల పార్టీకి మేలు క‌న్నా కూడా కీడే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని నివేదిక అందింది.

మంత్రులుగా పనిచేసి…..

ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయాక పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఎప్పటిక‌ప్పుడు ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు ఎలా ? ఉంటున్నారు ? ఏం జ‌రుగుతోంది ? అన్నదానిపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు చేతికి అందిన పార్టీ నివేదిక‌లో.. ఆస‌క్తికర విష‌యాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మాజీ మహిళా మంత్రులు ఇప్పుడు అచేత‌న స్థితిలో ఉన్నార‌నేది ప్రధాన విష‌యం. చంద్రబాబు అధికారంలో ఉండ‌గా.. ఏరికోరి కొంద‌రికి మ‌హిళా మంత్రులుగా ప్రమోష‌న్ ఇచ్చారు. వీరిలో ప‌శ్చిమ గోదావ‌రి నుంచి పీత‌ల సుజాత‌(ఎస్సీ నాయ‌కురాలు), అనంత‌పురం నుంచి ప‌రిటాల సునీత‌(ఓసీ), క‌ర్నూలు నుంచి భూమా అఖిల ప్రియారెడ్డి(ఓసీ), కిమిడి మృణాళిని (బీసీ) మంత్రులు చ‌క్రం తిప్పారు. వీరిలో ఇద్దరిని అంటే పీత‌ల సుజాత‌, కిమిడి మృణాళినిల‌ను 2017లో చంద్రబాబు ప‌క్కన పెట్టారు.

ఓటమి తర్వాత…..

త‌ర్వాత భూమా అఖిల ప్రియ‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకున్న మాజీ మంత్రులు ప‌రిటాల సునీత ప్లేస్‌లో పోటీ చేసిన కుమారుడు శ్రీరామ్‌‌, భూమా అఖిల ప్రియ‌, కిమిడి మృణాళినికి బ‌దులుగా పోటీ చేసిన కుమారుడు నాగార్జున‌ ఓడిపోయారు. అయితే, ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు అనేవి స‌హ‌జ‌మే. కానీ, వీరంతా కూడా ఓడిపోయిన త‌ర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎవ‌రి మానాన వారు సొంత అజెండాల‌తో ప‌నిచేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక‌, మాజీ మంత్రుల్లో అందునా 2017లో చంద్రబాబు ప‌క్కన పెట్టిన పీతల సుజాత‌, కిమిడి మృణాళినిల్లో ఒక్క సుజాత మాత్రమే కొంత మేర‌కు తాను ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక్రమాల‌కు హాజ‌రువుతున్నారు.

మీ కంటే ఆమే నయమని….

ఈ క్రమంలోనే సీనియ‌ర్లు.. అస‌లు.. మాజీ మ‌హిళా మంత్రులు పార్టీలో ఉంటారో… ఉండ‌రో.. తేల్చుకోవాల‌ని అధినేత‌కు సూచించార‌ట‌. మీ క‌న్నా తెలుగు మ‌హిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత బాగా యాక్టివ్‌గా ఉంటున్నార‌ని కూడా చంద్రబాబు సుతిమెత్తిగా వార్నింగ్ కూడా ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ క్రమంలో చంద్ర‌బాబు వారికి నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వ‌ర్గాలు చూచాయ‌గా వెల్లడించాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. పార్టీ అదికారంలో ఉన్నప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవ‌హ‌రించి, పార్టీని నిల‌బెట్టాల్సిన స‌మ‌యంలో ఇలా వ్యవ‌హ‌రించ‌డంపై సీనియ‌ర్లు కూడా తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News