రెచ్చగొడితే… నచ్చినట్లు చేస్తారా?

రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోతారు. ఇది ఎక్కడైనా సహజం. రెచ్చగొడితే ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోరు. 151 శాసనసభ్యులతో బలంగా ఉన్న వైసీపీని పెద్దల సభ ద్వారా అణగదొక్కాలనుకుంటే [more]

Update: 2020-06-18 06:30 GMT

రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోతారు. ఇది ఎక్కడైనా సహజం. రెచ్చగొడితే ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోరు. 151 శాసనసభ్యులతో బలంగా ఉన్న వైసీపీని పెద్దల సభ ద్వారా అణగదొక్కాలనుకుంటే వైసీపీ ఊరుకుంటుందా? ఊరుకూనే ఊరుకోదు. ఇది చంద్రబాబుకు కూడా తెలియంది కాదు. అయినా రాజకీయం కోసం తాత్కాలిక ప్రయోజనం కోసం ఆడుతున్న ఆటలో ఎవరు బలి అవుతారన్నది భవిష్యత్ మాత్రమే తేల్చగలదు.

రాజధానిని తరలించడం…..

రాజధాని అమరావతిని ఇక్కడి నుంచి తరలించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. తాను నిర్మించదలచుకున్న రాజధానిని జగన్ చిన్నాభిన్నం చేస్తున్నారన్న ఆవేదన చంద్రబాబులో ఉండిఉండవచ్చు. ఏపీకి ఒక ముఖ్యమైన నగరం లేకుండా చేస్తున్నారన్న బాధ ఉండవచ్చు. కానీ వైసీపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రణాళికలు వైసీపీకి ఉంటాయి. రాజధాని అమరావతి నుంచి తరలిస్తే నష్టపోయేది ఎవరన్నది నాలుగేళ్ల తర్వాత ప్రజలు తీర్పు చెబుతారు.

విమర్శల వరకూ ఓకే….

కానీ చంద్రబాబు అప్పటి దాకా వెయిట్ చేయలేరు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటారు. తాను చెప్పిందే ప్రభుత్వం చేయాలంటారు. ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకాదని దెప్పిపొడుస్తారు. ఏడాదిలోనే అట్టర్ ఫెయిల్ అందని చెబుతారు. విమర్శల వరకూ ఓకే. అధికార పార్టీపై విపక్షం ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. వాటిని ప్రజలు నమ్ముతారా? లేదా? అన్నది తర్వాత విషయం. అయితే శాసనమండలి బిల్లులను పదే పదే అడ్డుకోవడం చంద్రబాబు రెచ్చగొట్టు రాజకీయమేనంటారు.

ఎప్పటికైనా తప్పదు కదా?

ఇప్పుడు కాకుంటే ఆరు నెలలు… ఆరు నెలలు కాకుంటే ఏడాది.. జగన్ కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. మూడు రాజధానుల బిల్లులను నెగ్గించుకోలేరా? వాటిని అక్కడ ఏర్పాటు చేయలేరా? ఖచ్చితంగా చేస్తారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. తనను రెచ్చగొట్టే కొద్దీ ఆ ఆలోచనలో జగన్ లో మరింత బలపడుతుంది. వీలయినంత త్వరగా పని పూర్తి చేసేందుకు అడుగులు వేస్తారు. ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందక పోవడంతో మరోసారి శాసనమండలిని ఏర్పాటు చేసే అవకాశముంది. అయితే ఇందుకు పదిహేను రోజులు సమయం కావాలంటున్నారు న్యాయనిపుణులు. మొత్తం మీద ఏపీలో రెచ్చగొట్టే రాజకీయం జోరుగా నడుస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News