నిర్వేదం నుంచి బయటపడేదెన్నడు?
అవును! చంద్రబాబు డిఫరెంట్. ఆయన ఎవరినీ నమ్మరు. ఏ విషయాన్నైనా ఆయన స్వయంగా పరిశీలిస్తేనే గాని నిర్ణయం తీసుకోరు. గడిచిన చంద్రబాబు పాలనపై ఎవరిని అడిగినా.. చెప్పే [more]
అవును! చంద్రబాబు డిఫరెంట్. ఆయన ఎవరినీ నమ్మరు. ఏ విషయాన్నైనా ఆయన స్వయంగా పరిశీలిస్తేనే గాని నిర్ణయం తీసుకోరు. గడిచిన చంద్రబాబు పాలనపై ఎవరిని అడిగినా.. చెప్పే [more]
అవును! చంద్రబాబు డిఫరెంట్. ఆయన ఎవరినీ నమ్మరు. ఏ విషయాన్నైనా ఆయన స్వయంగా పరిశీలిస్తేనే గాని నిర్ణయం తీసుకోరు. గడిచిన చంద్రబాబు పాలనపై ఎవరిని అడిగినా.. చెప్పే మాట ఇది. అధికారుల నుంచి మంత్రుల వరకు కూడా అందరూ ఇదే అనుకున్నారు. చివరికి కీలకమైన శాఖల విషయంలోనూ చంద్రబాబు తన ప్రమేయం లేకుండా ఏ పనికూడా చేయలేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. పార్టీలో సీనియర్ నాయకులైన కేఈ కృష్ణమూర్తి, చిన్నరాజప్ప వంటి వారు గతంలో చూసిన శాఖల విషయంలోనూ ఆయన పదే పదే ప్రమేయం చేసుకున్నారు.
ప్రమేయం లేకుండానే….
దీంతో వారిలో ఒక విధమైన నిర్వేదం చోటు చేసుకుంది. ఒకానొక సందర్భంలో వారు బయటపడిపోయారు కూడా. “మా శాఖల్లో ఏం జరుగుతోందో కూడా మాకు తెలియడం లేదు. మీరు ఒకటి అడుగుతారు. మేం ఒకటి చెబుతాం. మా నాయకుడు మరొకటి చేస్తారుజ అంటూ.. కేఈ కృష్ణమూర్తి మీడియా ముందు అసహనం ప్రదర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో దాదాపు 70 మంది డీఎస్పీలను బదిలీ చేసిన విషయం కూడా తన దృష్టికి రాలేదని, అప్పట్లో హోం శాఖ మంత్రిగా ఉన్న రాజప్ప చెప్పారంటే పరిస్థితి ఏంటో అర్ధమవుతుంది.
స్వేచ్ఛ లేకుండా చేసిన….
ఫలితంగా చంద్రబాబు ఎవరినీ నమ్మరనే వాదన బలపడిపోయింది. ఇక, ఎమ్మెల్యేలు, ఎంపీల విషయానికి వస్తే.. వారి పరిస్థితి కూడా అంతే. నిష్టూరంగా అనిపించినా.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా చంద్రబాబు పాలనా కాలంలో స్వేచ్ఛ లేకుండా పోయింది. (వీరిలో కొందరికి మాత్రం మినహాయింపు) దీంతో వారిలో తీవ్రమైన నిర్వేదం ఏర్పడిపోయింది. కట్ చేస్తే.. చంద్రబాబు పాలనకు ప్రజలు ముగింపు పలికి, జగన్‌కు జై కొట్టారు. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. టీడీపీ తరపున వాయిస్ వినిపించేవారే కనిపించడం లేదు. టీడీపీకి ఇప్పుడు బలమైన గళం వినిపించే నాయకుల అవసరం ఎంతైనా ఉంది.
నేతలు నమ్మడం లేదట….
అయితే, ఇప్పుడు చంద్రబాబును నాయకులు నమ్ముతున్న పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం వస్తుందనే నమ్మకం కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ పుంజుకుంటుందనే విశ్వాసం కానీ వారిలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పరిస్థితి తిరగబడింది. నాడు చంద్రబాబు వీరిని నమ్మకపోతే.. ఇప్పుడు చంద్రబాబును వీరు నమ్మడం లేదు. మరి పరిస్థితి ఎప్పటికి దారిలోకి వస్తుందో చూడాలి.