అడ్డ పంచెలే బాబు కాళ్లకు అడ్డుతగులుతున్నాయా?
టీడీపీ అధినేత చంద్రబాబు కు తాను జగన్ పై చేస్తున్న ప్రచారమే తిరిగి రివర్స్ లో తనకు తంతుందని ఊహించి ఉండరు. ఆయనకు ిఇప్పుడు తాను చేసిన [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కు తాను జగన్ పై చేస్తున్న ప్రచారమే తిరిగి రివర్స్ లో తనకు తంతుందని ఊహించి ఉండరు. ఆయనకు ిఇప్పుడు తాను చేసిన [more]
టీడీపీ అధినేత చంద్రబాబు కు తాను జగన్ పై చేస్తున్న ప్రచారమే తిరిగి రివర్స్ లో తనకు తంతుందని ఊహించి ఉండరు. ఆయనకు ిఇప్పుడు తాను చేసిన ప్రచారమే పార్టీకి ఇబ్బందిగా మారింది. చంద్రబాబు ఎన్నికలకు ముందు నుంచి జగన్ పై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారు. జగన్ వస్తే ఎవరి ఆస్తులు కాపాడుకోలేమని, రాయలసీమ గ్యాంగ్ లు వస్తాయని, అడ్డ పంచెలు సర్వస్వం దోచుకుంటాయని ఎన్నికల సమయంలో తీవ్రంగా ప్రచారం చేశారు.
వరస సంఘటనలు…
కానీ ఏపీ ప్రజలు మాత్రం చంద్రబాబు విమర్శలను విశ్వసించలేదు. జగన్ కు జై కొట్టారు. 151 స్థానాల్లో విజయం సాధించారు. అయినా చంద్రబాబు ఇప్పటికీ సీమ గ్యాంగ్ నినాదాన్ని వదులుకోలేదు. పులివెందుల పంచాయతీ, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ నిత్యం జగన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వరసగా జరుగుతున్న సంఘటనలు చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. దానిని సరిదిద్దుకునే ప్రయత్నం ఆయన చేసే పనిలో ఉన్నారు.
తన పార్టీ ఎమ్మెల్సీ…..
నిజానికి భూదందా కేసులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ లో ఒక భూ వివాదం కేసులో దీపక్ రెడ్డి తలదూర్చారన్న ఆరోపణలున్నాయి. వారిని బెదిరించినందుకు గాను తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న దీపక్ రెడ్డిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ లో భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోని చంద్రబాబు జగన్ పై ఆ విమర్శలను మాత్రం వదిలిపెట్టడం లేదు.
తాజాగా అఖిల……
ఇప్పడు తాజాగా మాజీ మంత్రి అఖిలప్రియ కూడా భూ వివాదంలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. పార్టీలో చంద్రబాబు అఖిలప్రియకు కీలక బాధ్యతలను అప్పగించారు. అటువంటి అఖిలప్రియ పొరుగు రాష్ట్రంలో కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయితే చంద్రబాబు నోరు మెదపలేదు. అడ్డపంచెలని విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు అదే అడ్డ పంచెలు ఎదురుతంతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికైనా చంద్రబాబు తన పార్టీలో భూదందాలకు పాల్పడుతున్న వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఇతరులకు సూక్తులు చెప్పే అవకాశం ఉంటుంది.