కోణం వేరు.. ధోరణులు వేరు.. బాబు తరం కాదిది?
చంద్రబాబు తరం వేరు, ఇపుడు అధికారంలో ఉన్న జగన్ తరం వేరు. ఒక సమస్యను చూడడంతో ఇద్దరి ధోరణులలో ఆ భిన్నత్వం కచ్చితంగా కనిపిస్తుంది. పైగా జగన్ [more]
చంద్రబాబు తరం వేరు, ఇపుడు అధికారంలో ఉన్న జగన్ తరం వేరు. ఒక సమస్యను చూడడంతో ఇద్దరి ధోరణులలో ఆ భిన్నత్వం కచ్చితంగా కనిపిస్తుంది. పైగా జగన్ [more]
చంద్రబాబు తరం వేరు, ఇపుడు అధికారంలో ఉన్న జగన్ తరం వేరు. ఒక సమస్యను చూడడంతో ఇద్దరి ధోరణులలో ఆ భిన్నత్వం కచ్చితంగా కనిపిస్తుంది. పైగా జగన్ ఒక విషయాన్ని తనదైన శైలిలో అధ్యయనం చేస్తారు. చంద్రబాబు ప్రతీ దాన్ని జనం వైపు నుంచి తీసుకుంటారు. ఇంకా దానికి రాజకీయం, ఇతర ప్రయోజనాలు కూడా జత చేసి మరీ మసాలా అద్దుతారు. అందుకే చంద్రబాబు నోటి వెంట హుదూద్ తుఫానుని ఉఫ్ అని ఊదేశాను, సముద్రానికి అడ్డుగా గోడలు కడితే తుఫానులు రావు లాంటి విచిత్రమైన ప్రకటనలు వస్తుంటాయి. ఇక చంద్రబాబుతో పోలిస్తే జగన్ వాస్తవంగా ఆలోచన చేస్తారు. చంద్రబాబు ముందు జనాలను ఎలా తన వైపు తిప్పుకోవాలన్నదే ఆలోచనగా పెట్టుకుంటారని చెబుతారు.
జగన్ శైలిలో ….
నిజానికి జగన్ ప్రతీదీ ఆడంబరం చేయాలనుకోరు. రాజకీయం చేయలనుకుంటే దానికి సమయం ఉందని అంటారు. ఇంకా చెప్పాలంటే ఏదైనా పధకం ఇచ్చామంటే దాన్ని పొందిన వారు తప్పకుండా గుర్తుంచుకుంటారని జగన్ నమ్ముతారు. ఇక తాను ప్రతీ దాన్ని జనంలోకి పోయి ప్రచారం చేసుకోవడం దండుగ అన్నది కూడా జగన్ ఉద్దేశ్యం. పని మాట్లాడాలి కానీ మనం కాదు అంటారు. అందుకే కరోనా వంటి విపత్కర సమయంలో కూడా జగన్ తాను అనుకున్న దానికే కట్టుబడ్డారు. దాన్ని కట్టడి చేయడంపైన దృష్టి పెట్టారు కానీ తానే కరోనాను ఆపుతాను అంటూ భీకరమైన ప్రకటనలు ఇవ్వలేదు.
హడావుడేనా…?
ఇక చంద్రబాబు ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే హడావుడి ఓ రేంజిలో ఉండేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. ప్రజలకు ఆ సంగతి తెలుసు. చంద్రబాబు రోజుకు పదిసార్లు మీడియా ముందుకు వచ్చి ఆయనే కరోనా కేసుల వివరాలు కూడా చదివేసేవారు కూడా. ఇక వీలు చేసుకుని జిల్లాలను కూడా చుట్టేసి కరోనాను జయిద్దామంటూ భారీ ఉపన్యాసాలు ఇచ్చేవారు. నిజానికి చంద్రబాబు అనుకుంటున్నట్లుగా లొంగే వ్యాధి ఇది కాదు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఇలాంటి పెను ఉపద్రవాన్ని కూడా చూడలేదు. అయినా సరే చంద్రబాబు తనదైన మార్క్ ప్రచారంతో జనాల్లో ఏపీ సీఎం నంబర్ వన్ అని, ఏదో చేసేశారన్న ఇంప్రెషన్ మాత్రం వచ్చేలా చూసుకునేవారు.
బ్యాలన్స్ చేస్తూ ….
ఇక జగన్ విషయం వస్తే ఆయన కరోనా నివారణపైన ఇది అధికారుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత చేసినా కూడా అసలైన పని జనాలు చేయాల్సివుందని మనసారా నమ్ముతున్నారు. అందుకేవారితోనే ఆయన మాట్లాడుతున్నారు. వారిలో భయం ఉంచాలి, కానీ అది మరీ ఎక్కువైపోతే అసలుకే ఎసరు వస్తుంది. దీంతో బ్యాలన్స్ గానే జగన్ వెళ్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ కేసులు విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా చెబుతూ కితాబు ఇస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణాలో ఉన్న పీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి వంటి వారు కూడా ఏపీ కరోనా టెస్టుల్లో బెస్ట్ అంటున్నారు.
అదే తేడా…?
ఇక చంద్రబాబు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తనలాగానే జగన్ ప్రతీదానికీ స్పందించాలి అనుకోకుండా ఉండడం. తరాల అంతరం కూడా బాబు అర్ధం చేసుకోవాలి. ఈనాటి తరం ప్రతినిధిగా జగన్ తనదైన పని చేస్తున్నారు. డెబ్బైల కాలం నాటి నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంకా జనాన్ని రాజకీయాన్ని అలాగే చూస్తున్నారు, చేస్తున్నారు. బాబు అయినా జగన్ అయినా మంచి చేసే బాగుంది అని ప్రజలు అంటారు, లేకపోతే పక్కన పెడతారు. ఇపుడున్న ఆధునిక సాంకేతిక సంపత్తి వారికి ఆ అవకాశం ఇచ్చింది. అందువల్ల పదే పదే విమర్శలు చేస్తే అబద్దం నిజం అవదు, అలాగే నిజాలు చెబితే బాబుని కూడా జనం పరిగణంలోకి తీసుకుంటారు.