రామ‌చంద్రయ్యా ? ఏమైపోయావ్ ?

ఆయ‌న‌ది నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం… ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారు.. ప‌లు పార్టీలు మారారు.. రెడ్ల హ‌వా ఉన్న క‌డ‌ప జిల్లాలో బ‌లిజ వ‌ర్గానికి చెందిన నేత‌గా [more]

Update: 2021-02-17 14:30 GMT

ఆయ‌న‌ది నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం… ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారు.. ప‌లు పార్టీలు మారారు.. రెడ్ల హ‌వా ఉన్న క‌డ‌ప జిల్లాలో బ‌లిజ వ‌ర్గానికి చెందిన నేత‌గా ఉండి కూడా రాజ్యస‌భ‌కు ఎంపిక‌య్యారు. అక్కడ ఓ వెలుగు వెలిగారు. అలాంటి నేత రాజ‌కీయంగా రాంగ్ స్టెప్ వేసినా డ‌క్కా మొక్కీలు తిని మ‌రీ ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు అధికార వైఎస్సార్‌సీపీలో ఉన్నా ఆయ‌న ఎక్కడున్నారో కూడా ఎవ్వరికి తెలియ‌డం లేదు. ఆ నేత ఎవ‌రో కాదు సీ రామ‌చంద్రయ్య. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ టైం నుంచే ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉండేది. ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి రాజ్యస‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. నాడు వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రతిప‌క్షంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నప్పుడు అదే క‌డ‌ప జిల్లా నుంచి బ‌ల‌జల్లో ప‌ట్టున్న రామ‌చంద్రయ్యను చంద్రబాబు ఎంక‌రేజ్ చేశారు.

చిరంజీవి సహకారంతో….

2004లో టీడీపీ ఓడిపోయాక రామ‌చంద్రయ్య. చంద్రబాబును తీవ్రంగా విబేధించి సామాజిక వ‌ర్గాల ప‌రంగా చిరంజీవి ప్రజారాజ్యంలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న సీమ నుంచి వ‌చ్చి కృష్ణా జిల్లా మచిలీప‌ట్నంలో ఖ‌చ్చితంగా గెలుస్తాన‌న్న ధీమాతో పోటీ చేసినా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావ‌డంతో చిరంజీవి రిక‌మెండేష‌న్‌తో ఎమ్మెల్సీ సొంతం చేసుకున్నారు. చిరంజీవీ కోటాలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ద‌క్కించుకున్న ఏకైక నేత రామ‌చంద్రయ్యే. ఆ ఎమ్మెల్సీతో ఆరేళ్ల పాటు చ‌ట్టస‌భ‌ల్లో ఉన్నారు. ఆ ప‌ద‌వి అంద‌రూ మ‌ర్చిపోయిన రామ‌చంద్రయ్యకు పున‌ర్జన్మ నిచ్చింది.

వైసీపీలో చేరిన తర్వాత….

టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక రామ‌చంద్రయ్య చంద్రబాబును, టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నారు. త‌ర్వాత ఆయ‌న ప్రజారాజ్యంలోకి వెళ్లినా అదే పాట పాడారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నా మ‌ళ్లీ అదే పంథాలో వెళ్లారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. సీనియ‌ర్‌గా ఉన్న త‌న సేవ‌ల‌ను పార్టీ క‌డ‌ప జిల్లాలో వాడుకుంటుంద‌ని రామ‌చంద్రయ్య. ఆశించారు. అయితే క‌డ‌ప జిల్లా వైసీపీ రెడ్లు అంద‌రూ త‌ల‌పండిన వాళ్లే కావ‌డంతో వాళ్లకు రామ‌చంద్రయ్య అస్సలు గుర్తుకే రాలేదు.

ఏ పదవి ఇవ్వాలన్నా…..

జ‌గ‌న్ ప‌ట్ల ఎంతో విధేయ‌త‌తో ఉన్న రామ‌చంద్రయ్య ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రెస్‌మీట్లు చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా అధిష్టానానికి, జ‌గ‌న్‌కు గుర్తు లేని చాలా మంది నేత‌ల లిస్టులో ఆయ‌న కూడా చేరిపోయారు. పైగా క‌డ‌ప జిల్లాలో ఏ ప‌ద‌వి కావాల‌న్నా ముందుగా ఓ సామాజిక వ‌ర్గం నేత‌లే లైన్లో ఉంటున్నారు. రామ‌చంద్రయ్యకు ఇప్పుడు ఏ ఎమ్మెల్సీ అయినా రాక‌పోదా ? అన్న ఆశ ఉన్నా వైసీపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ను జ‌గ‌న్ గుర్తు పెట్టుకోవ‌డం.. ఆయ‌న‌కు ప‌ద‌వి రావ‌డం రెండూ క‌ష్టమే..! ఇక వ‌యోః భారంతో కూడా ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండ‌లేక‌పోతున్నారు. కాంగ్రెస్‌లో ల‌క్కీగా ఎమ్మెల్సీతో పొలిటిక్‌గా రీ చార్జ్ అయిన రామ‌చంద్రయ్య. రాజ‌కీయం వైసీపీలో ఉంటుందా ? ఉండ‌దా ? అన్న ప్రశ్నల‌కు కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Tags:    

Similar News