బోస్టన్ ఆప్షన్లు ఇవే
చారిత్రాతికంగా చూసనప్పుడు డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ మోడల్ ఏపీకి అనువుగా ఉంటుందని బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు అభిప్రాయపడినట్లు ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. అన్ని ప్రాంతాలు కలిసి [more]
చారిత్రాతికంగా చూసనప్పుడు డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ మోడల్ ఏపీకి అనువుగా ఉంటుందని బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు అభిప్రాయపడినట్లు ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. అన్ని ప్రాంతాలు కలిసి [more]
చారిత్రాతికంగా చూసనప్పుడు డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ మోడల్ ఏపీకి అనువుగా ఉంటుందని బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు అభిప్రాయపడినట్లు ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలను బ్యాలన్స్ చేస్తూ, చారిత్రికంగా ఉన్న ఒప్పందాలను అమలు చేయాలని సిఫార్సు చేసింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాలను పరిశీలించారన్నారు. ప్రతి రిజియన్ నుంచి మూడు సిటీలను ఎంపిక చేశారన్నారు. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలును తీసుకున్నప్పుడు ఈ మూడింటిలో ఏది బెస్ట్ అని కూడా అధ్యయనం చేసిిందన్నారు. హైకోర్టు, లెజిస్లేచర్ లతో పాటు మొత్తం 8 విభాగాలుగా విభజించడం జరిగిందన్నారు. నేరుగా ప్రజలతో సంబంధం లేని శాఖలను గుర్తించామన్నారు. ఇందుకు బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రెండు ఆప్షన్లు ఇచ్చాయన్నారు.
ఆప్షన్ 1 :
విశాఖలో సెక్రటేరియట్, గవర్నర్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఇండ్రస్ట్రీస్, టూరిజం శాఖలు, అత్యవసర పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు. మొత్తం పదిహేను శాఖలు విశాఖలో పెట్టవచ్చు.
అమరావతి ఏరియాలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్. స్థానిక పరిపాలన, సంక్షేమ వంటి శాఖలను పది పెట్టుకోవచ్చు. హైకోర్టు బెంచ్ ను పెట్టుకోవచ్చు.
కర్నూలులో హైకోర్టుతో పాటు అప్పిలేట్ అధారిటీస్ ఏర్పాటు
దీనిప్రకారం వెళితే 4,700 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.
ఆప్షన్ 2 :
విశాఖపట్నంలో సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్, ఆల్ డిపార్ట్ మెంట్స్ హెడ్స్, హైకోర్టు బెంచ్, అసెంబ్లీ అత్యవసర సమావేశాలు
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయవచ్చు.
కర్నూలులో హైకోర్టుతో పాటు అప్పిలేట్ అధారిటీస్ ను ఏర్పాటు చేయాలి
దీనిప్రకారం 2,500 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.
2009 అక్బోటరు లో వచ్చిన వరదల కారణంగా అమరావతి ప్రాంతం ముంపునకు గురయిందన్నారు. అక్కడ ఏ విధమైన నిర్మాణం సరికాదని ఐఐటీ చెన్నై కూడా తేల్చింది. 11.82 లక్షల క్యూసెక్కుల వరద అప్పుడు వచ్చిందన్నారు. ఇక్కడ నిర్మాణం చేయాలంటే నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందన్నారు. నలభై మీటర్ల లోతుకు నిర్మాణం చేపట్టాలన్నారు. లక్షమంది సచివాలయానికి వస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే పంచాయతీరాజ్, మున్సిపల్ 32 వేల మంది, 22 వేల మంది పరిశ్రమలు, 8వేల మంది ఎడ్యుకేషన్ కు సంబంధించిన వారు వచ్చారన్నారు. సాధారణ ప్రజలు సచివాలయానికి వచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. ప్రాంతీయంగా అందుబాటులో ఉండే కార్యాలయాల ద్వారా ప్రజలకు సేవలందించవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా అందించవచ్చన్నారు. ఆప్షన్ 2 మాత్రమే బెటరని కూడా బోస్టన్ కమిటీ చెప్పింది. ఆప్షన్ 1లో అధికారుల మధ్య సమన్వయం లోపం జరుగుతుందన్నారు. ఏరకంగా చూసినా విశాఖపట్నం ది బెస్ట్ అని బోస్టన్ కమిటీ తేల్చింది.