అమరావతి నిర్మాణం హై రిస్క్
బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. 13 జిల్లాలను ఆరు రీజియన్లుగా విభజించి అధ్యయనం చేశామని చెప్పింది. [more]
బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. 13 జిల్లాలను ఆరు రీజియన్లుగా విభజించి అధ్యయనం చేశామని చెప్పింది. [more]
బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. 13 జిల్లాలను ఆరు రీజియన్లుగా విభజించి అధ్యయనం చేశామని చెప్పింది. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధులు ఇచ్చిన నివేదిదకపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీకి మరిన్ని పోర్టులు అవసరం ఉందన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రకమైన వనరులున్నాయో పరిశీలించామన్నారు. ఏపీకి 2.25 లక్షల కోట్ల రుణాలున్నాయని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతలో ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు. అభివృద్ధికి ఏ విధానాలు పాటించాలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని చెప్పారు.
విశాఖకు ఇంటర్నేషనల్ లింక్….
మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా వ్యవస్థలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉందని సూచించామన్నారు. దక్షిణాదిలోనే ఏపీలో తక్కువ తలసరి ఆదాయం ఉందని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్నారు. ఆరు అంశాల ఆధారంగా బోస్టన్ కమిటీ నివేదికను రూపొందించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయన్నారు. కృష్ణా జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ఇంటర్నేషనల్ లింక్ కేవలం విశాఖపట్నంకు మాత్రమే ఉందన్నారు. విశాఖ నుంచి చెన్నైై వరకూ రోడ్డు కనెక్టివిటీ ఉందన్నారు.
అన్ని ప్రాంతాల్లో సమతుల్యత…
కడప, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నామని చెప్పారు. రాయలసీమలోని పెనుకొండ, రాయదుర్గం వంటి ప్రాంతాలను సర్క్యూట్ టూరిజంగా తీర్చిదిద్దవచ్చని బోస్టన్ కమిటీ అభిప్రాయపడింది. ఎకో టూరిజాన్ని కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయవచ్చన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సమతుల్యత కోసం వివిధ సూచనలను బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి సూచించిందన్నారు. అనంతపురం, కడప, నెల్లూరు, విజయవాడ వైపు కనెక్ట్ చేయడానికి కొన్ని ఎక్స్ ప్రెస్ హైవే లను కూడా నిర్మించాలని సూచించారు. గోదావరి, కృష్ణా జిల్లాలను పెన్నా నదితో అనుసంధానం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా ఏర్పాటు చేయాలన్నారు.
నలభై నుంచి అరవై ఏళ్లు…..
మెగా సిటీలు రీజినల్ ఎకనమిక్ గ్రోత్ కు ఉపయోగపడతాయని అభిప్రాయపడింది. లండన్ 22 శాతం, టోక్యో 35, ప్యారిస్ 25, బ్యాంకాక్ 20 శాతం జీడీపీ ఇస్తుందన్నారు. గ్రీన్ సిటీ ఫీల్డ్ కి వెళ్లినప్పుడు చాలా ఖర్చవుతుందని కమిటీ అభిప్రాయపడింది. కొత్తగా నగరాన్ని నిర్మించాలంటే 4.2 బిలియన్లు ఖర్చవుతుందన్నారు. పదివేల మంది కోసం సిటీ నిర్మాణం కోసం 4.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. 32 గ్రీన్ ఫీల్డ్ సిటీలను పరిశీలంచామన్నారు. నవీ ముంబయి, నయా రాయపూర్ వంటి నగరాలను పరిశీలిస్తే కేవలం నవీ ముంబయి మాత్రమే గ్రీన్ ఫీల్డ్ సిటీగా సక్సెస్ అయిందన్నారు. ఇవి అభివృద్ధి కావడానికి 40 నుంచి 60 ఏళ్లు పట్టిందన్నారు. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో గత యాభై సంవత్సరాల్లో నిర్మించిన నగరాలను కూడా పరిశీలించామన్నారు. గత యాభై ఏళ్లుగా ఆ నగరాల్లో పురోగతి లేదన్నది తమ అధ్యయనంలో తేలిందన్నారు.
అమరావతిని ఏ విధంగా చూసినా…..
అమరావతి ఏవిధంగా చూసినా నిర్మించడం సాధ్యం కాదన్నారు. అనుకున్నది సాధించలేమని కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. అమరావతిలో ఇప్పుడు 1.2 లక్షల మంది మాత్రమే జనాభా ఉందన్నారు. 25 ఏళ్లలో అమరావతి జీడీపీ 15 నుంచి 16 శాతం జీడీపీ మాత్రమే పెరుగుతుందని కమిటీ పేర్కొంది. అక్కడ 1.1 లక్షల కోట్లు పెట్టుబడులు పెడితే జీడీపీ పెరుగుతుందని కమిటీ పేర్కొంది. అంత పెట్టుబడి పెడితే 80 శాతం రుణం తెచ్చుకోవాల్సి ఉంటుంది. 8 నుంచి 10 వేల కోట్లు రుణాలు కట్టడానికి సరిపోతుందన్నారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ కింద చూస్తే ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న 8వేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాలను కమర్షియల్ గా చేయాలనుకుంటే ఒక్కక్క ఎకరం 20 కోట్లు ధర పలకాల్సి ఉంటుందన్నారు. 20 కోట్లకు ఎకరం చేరాలంటే ఇరవై ఏళ్లు పడుతుందన్నారు. మూడు వేల ఎకరాలను ప్రభుత్వం వినియోగించుకున్న ఫలితం ఉండదన్నారు.
ఈ సొమ్ము ప్రాజెక్టుల మీద వెచ్చిస్తే….
లక్షా పదివేల కోట్లు ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి మంచిదా? లేదా మరో అభివృద్ధి చెందిన నగరంలో కొంత పెట్టడం మంచిదా? అన్న దానిపై కూడా అధ్యయనం చేశామన్నారు. నలభై సంవత్సరాలు తర్వాత వచ్చే ఆదాయం కోసం లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం రిస్క్ ఈజ్ వెరీ హై అని కమిటీ పేర్కొంది. ఈ డబ్బులు ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీరు అందించే అవకాశం ఐదు సంవత్సరాల్లో చేయగల అవకాశముందన్నారు. దీన్ని నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్నారు. దీనికి రిస్క్ వెరీ లో గా ఉంటుందన్నారు.