అన్ ఫిట్ అని తేల్చారా? అందుకే వాంటెండ్ గానే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అనేక పదవులను భర్తీ చేశారు. పార్టీలో పనికొస్తారనుకున్న వారందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి చంద్రబాబు సంతృప్తి పర్చారు. అయితే [more]

Update: 2020-11-16 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల అనేక పదవులను భర్తీ చేశారు. పార్టీలో పనికొస్తారనుకున్న వారందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి చంద్రబాబు సంతృప్తి పర్చారు. అయితే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుటుంబాన్ని మాత్రం చంద్రబాబు పక్కన పెట్టారు. నిజానికి బొజ్జల కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి విడదీయలేని సంబంధం ఉంది. రెడ్డి సామాజిక వర్గమైనా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన రాజీకీయ జీవితం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీలోనే గడిపారు.

చాలా మంది వెళ్లిపోయినా….

పార్టీ ఓటమి పాలయిన సమయంలోనూ సీనియర్ నేతలు అనేక మంది పార్టీని విడిచి వెళ్లిపోయినా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం ఏనాడూ జెండాను విడిచిపెట్టలేదు. పార్టీ లైన్ ను కూడా దాటలేదు. దీంతో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన అడ్డాగా మార్చుకున్నారు. 1989 నుంచి వరసగా ఆయన గెలుస్తూనే వస్తున్నారు. 2004లో మినహా ఆయన 2014 వరకూ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆరుసార్లు విజయాలు సాధించి పార్టీకి అండగా నిలిచారు.

ఆరోగ్య కారణాల రీత్యా….

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయనను తొలగించడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడ బొజ్జల సుధీర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి చికిత్స పొందుతున్నారు.

తనయుడు సుధీర్ రెడ్డి మాత్రం…….

కానీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసినట్లే కన్పిస్తుంది. టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నా పట్టించుకునే వారే లేరు. పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టే వారే లేరు. చంద్రబాబు సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఏంటని అక్కడి క్యాడర్ ప్రశ్నిస్తుంది. బొజ్జల సుధీర్ రాజకీయాలకు అన్ ఫిట్ అని నిర్ధారించుకున్న చంద్రబాబు బొజ్జల సుధీర్ రెడ్డికి ఏ పదవి ఇవ్వలేదు. రాష్ట్ర కార్యవర్గాన్ని మొత్తాన్ని యువతతో నింపిన చంద్రబాబు ఈ యువనేతను వాంటెడ్ గానే పక్కన పెట్టినట్లు స్పష్టమవుతుంది.

Tags:    

Similar News