బొబ్బిలి బ్రదర్స్ బై బై చెప్పేస్తున్నారు
విజయనగరం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పార్టీకి ఇప్పటికే జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చిపెట్టేసింది. [more]
విజయనగరం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పార్టీకి ఇప్పటికే జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చిపెట్టేసింది. [more]
విజయనగరం జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పార్టీకి ఇప్పటికే జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా వైసీపీ మొత్తానికి మొత్తం ఊడ్చిపెట్టేసింది. ఇక విజయనగరం జిల్లాలో నాయకులు కూడా నిస్తేజంగా మారారని అంటున్నారు. విజయనగరం రాజుగా ఉన్న పూసపాటి అశోక్ గజపతి రాజు పూర్తిగా హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. ఆయన సొంత జిల్లాకు రావడం మానుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన అక్కడే ఉంటున్నారు. విజయనగరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండుగకు ప్రతీ ఏటా వచ్చే రాజుగారు ఈసారి రాలేదు. ఇక వారి కుటుంబం తరఫున రాజకీయంగా కుమార్తె అదితి గజపతి రాజు కాస్త చురుకుగా కనిపిస్తున్నారు. ఆమె విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక వర్గ పోరు జిల్లాలో ఉంది. అదితి గజపతిరాజు కార్యకలాపాలను మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వర్గీయులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ పూసపాటి వారి పరపతి పెరగడంలేదు.
బొబ్బిలి రాజుల రూటు అటేనా…?
ఇక బొబ్బిలి రాజులుగా పేరుపొందిన మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఆయన సొదరుడు బేబీ నాయనలు సైతం ఇదివరకులా రాజకీయంగా దూకుడు చూపించలేకపోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయాలతో పాటు, ఆనక వైసీపీలో ఉన్న ఈ సోదరులకు టీడీపీలో వర్గ పోరు మొదటినుంచి ఉంది. ఇపుడు పార్టీ ఎటూ ఓడిపోయినందువల్ల ఎవరికి వారే యమునా తీరేగా కధ సాగుతోంది. ఈ నేపధ్యంలో బొబ్బిలి సోదరులను పార్టీ మారుతారన్న ప్రచారం వూపందుకుంది. అయితే బేబీ నాయన వైసీపీలోకి వెళ్తాడని అంటూండంగా మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు విషయంలో మాత్రం జగన్ కఠినంగా ఉన్నారని అంటున్నారు. తాను అన్ని రకాలుగా విలువ ఇస్తే సుజయ కృష్ణ రంగారావు మోసం చేసి టీడీపీలోకి వెళ్లాడన్న ఆగ్రహం జగన్ కి ఇంకా ఉందని అంటున్నారు. దాంతో సుజయ కృష్ణ చూపు బీజేపీ మీద ఉందని అంటున్నారు.
ఇద్దరు ఒక్కటిగానే….
ఈ నేపధ్యంలో సుజయ కృష్ణ రంగారావుతో పాటు సోదరుడు బేబీనాయనను కూడ బీజేపీలోకి తేవాలని ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బొబ్బిలి రాజులకు సమీప బంధువు కావడంతో ఆయన తన పలుకుబడితో వీరిని బీజేపీ వైపుగా నడిపించాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే వైసీపీలోకి వెళ్ళాలన్నది బేబీ నాయన ఆలోచనగా ఉంది. కానీ సోదరుడిని అక్కడ చేర్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. బీజేపీ అంటే సుజయ కృష్ణ మాత్రమే సుముఖంగా ఉన్నారు. మరి ఈ ఇద్దరు సోదరులను ఒకే పార్టీలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియదు. అయితే జిల్లాలో మాత్రం మంత్రి బొత్స సత్యనారాయణ సుజయ కృష్ణ రాకను వ్యతిరేకిస్తూంటే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారు స్వాగతిస్తున్నారు. ఇక జిల్లా ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే జిల్లాలో వైసీపీ పటిష్టతకు క్రుషి చేస్తున్నారు. మరి జగన్ తో చెప్పించి. బొత్సను ఒప్పించి బొబ్బిలి సోదరులను వైసీపీ గూటికి తెప్పిస్తారా అన్నది చూడాలి. అదే సమయంలో బీజేపీలోకి వీరిని సీఎం రమేష్ తీసుకెళ్లడానికి ఎంతవరకూ అవకాశం ఉందో కూడా చూడాలి.