కన్నాను కట్టడి చేశారా? కాస్కో మన్నారా?

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న బీజేపీ, వైసీపీ వార్ పై కేంద్ర నాయకత్వం ఎలా స్పందించింది. ఎవరికి తోచినట్లు వారు చెప్పుకుంటున్నారు. కన్నా లక్షీనారాయణను కట్టడి చేస్తూ కేంద్ర [more]

Update: 2020-04-23 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న బీజేపీ, వైసీపీ వార్ పై కేంద్ర నాయకత్వం ఎలా స్పందించింది. ఎవరికి తోచినట్లు వారు చెప్పుకుంటున్నారు. కన్నా లక్షీనారాయణను కట్టడి చేస్తూ కేంద్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసిందని ఒక వర్గం మీడియా ప్రచారం చేసుకుంటుంటే, మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కంటిన్యూ చేయమన్నారని మరో వర్గం మీడియా చెబుతోంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో అధిష్టానం మాత్రం జోక్యం చేసుకుందన్నది మాత్రం సుస్పష్టం.

ఇద్దరి మధ్య వివాదం…..

గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవకతవకలకు జరిగాయని తొలుత కన్నా లక్ష్మీనారాయణ వివాదానికి తెరతీశారు. దీనికి విజయసాయిరెడ్డి హార్డ్ గా స్పందించారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి 20 కోట్లకు అమ్ముడుపోయారని ప్రకటించారు. ఇద్దరి మధ్య ఇంకా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.

నడ్డా ఏం చెప్పారు?

ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అయితే ఆరోపణలు చేసే ముందు కొంత చెక్ చేసుకుంటే మంచిదని కన్నా లక్ష్మీనారాయణకు జేపీ నడ్డా సూచించినట్లు తెలిసింది. ఏవైనా ఆరోపణలు చేయదలచుకుంటే అందుకు సంబంధించిన ఆధారాలు కేంద్ర పార్టీకి పంపాలని కూడా జేపీ నడ్డా సూచించినట్లు చెబుతున్నారు. తాము ఆమోదించిన తర్వాతనే ఆరోపణలు చేస్తే ఎలాంటి వివాదాలకు తావుండదని కూడా నడ్డా బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఎవరి వర్షన్ వారిదే….

అయితే మరొక వర్షన్ కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ చేసిన ఆరోపణలపై జేపీ నడ్డా సీరియస్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి తాము వ్యతిరేకం కాదని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న పురంద్రీశ్వరి ఎన్నికల ఫండ్ పై కూడా వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను నడ్డా దృష్టికి తీసుకురాగా, వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని నడ్డా కొట్టిపారేసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద బీజేపీ నేతలు మాత్రం ఈ సమావేశం తర్వాత ఏ విషయం చెప్పకపోయినా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మీడియా మాత్రం ఎవరికి వారే తమకు అనుకూలంగా మలుచుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News