ఆ కార్డు బయటకు తీస్తే జగన్..?
ఏపీలో అధికారం చేపట్టాలంటే రాంగ్ రూట్లో రావడమే కరెక్ట్ అని కాషాయం పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో హిందుత్వ కార్డ్ ని ప్రయోగించేందుకు ఏ మాత్రం [more]
ఏపీలో అధికారం చేపట్టాలంటే రాంగ్ రూట్లో రావడమే కరెక్ట్ అని కాషాయం పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో హిందుత్వ కార్డ్ ని ప్రయోగించేందుకు ఏ మాత్రం [more]
ఏపీలో అధికారం చేపట్టాలంటే రాంగ్ రూట్లో రావడమే కరెక్ట్ అని కాషాయం పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో హిందుత్వ కార్డ్ ని ప్రయోగించేందుకు ఏ మాత్రం మొహమాటపడడంలేదు. వైఎస్ జగన్ స్వతహాగా క్రిస్టియన్ మతారాధకుడు కావడం ఎంతో కొంత తమకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే హిందుత్వం నాశనం అయిపోతోందంటూ బీజేపీ పడిన ఆరాటం అంతా చూశారు, ఈ ఆరాటం వెనక రాజకీయ తాపత్రయం చాలానే ఉందని అంటున్నారు. శ్రీశైలంలో అన్య మతస్తుల అధిపత్యం పెరిగిందని ఆందోళనకు బీజేపీ సిధ్ధపడగానే అక్కడ ఈవోను వెంటనే మార్చేసి వైఎస్ జగన్ సర్కార్ జాగ్రత్తపడింది.
తిరుమలలో కూడా…
తిరుమలలో బస్సు టికెట్లపై అన్య మతప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ చేసిన మరో ఆందోళన సైతం బూమరాంగ్ అయింది. ఆ టికెట్లు టీడీపీ అధికారంలో ఉన్న మార్చి నెలలో జరిగిందని తేలడంతో కమలనాధుకు కిక్కురుమనలేకపోయారు. అంతకు ముందు వైఎస్ జగన్ బాబాయి సుబ్బారెడ్డి అన్యమతస్థుడు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని నానాయాగీ చేస్తే ఆయన తన పుట్టు పూర్వోత్తరాలు మొత్తం విప్పి చెప్పుకోవాల్సివచ్చింది. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ కఠినంగా ఉండేందుకు తిరుమలతో సహా ఏపీలోని మొత్తం హిందూ దేవాలయాల్లో అన్య మతానికి చెందిన ఉద్యోగులు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు, తిరుపతిలో మద్యం దుకాణాలు సైతం ఉండరాదని నిర్ణయం తీసుకుని బీజేపీ నిలువు బొట్ల కంటే తానే అతి పెద్ద హిందువుల బంధువు అని నిరూపించుకున్నారు. ఈ నిర్ణయాలను తెలంగాణాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆర్ఎస్ఎస్ నేత ఉమేష్ జీ మెచ్చుకుని వైఎస్ జగన్ హిందువులకు ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడారు. కానీ ఏపీ బీజెపీ నేతలు మాత్రం వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయాలను స్వాగతించలేకపోయారు.
కొత్త అంశాలు వెతుక్కుంటున్నారు…
ఇపుడు కొత్తగా పేద పాస్టర్లకు వైఎస్ జగన్ సర్కార్ జీతాలు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. పాస్టర్లకు నెలకు అయిదు వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని అందరి కలెక్టర్లకు ఆగస్ట్ 27న వైఎస్ జగన్ సర్కార్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని మీద ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు. అయితే ఇదే వైఎస్ జగన్ సర్కార్ ఆగస్ట్ 20న హిందూ దేవాలయాల్లో పేద పూజారులకు కూడా జీతాలు ఇస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. నిజానికి ఇది వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా ఉంది.
మతం కార్డుతో….
వీటిని ఎన్నికల ప్రణాళికలో పెట్టి వైఎస్ జగన్ ఊరూరా చెప్పారు. ఆనాడు అభ్యంతరం వ్యక్తం చేయని బీజేపీ ఇపుడు అడగడంతో అర్ధమేంటని వైసీపీ నేతలు అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు న్యాయం చేయడం కోసం జగన్ క్రుషి చేస్తున్నారని, ఆయన ఓ మతానికి కట్టుబడి లేరని అంటున్నారు, పేద పూజారులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని మరో పాతిక శాతం పెంచడం వంటిని వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలని, వాటిని తప్పుపట్టని బీజేపీ నేతలు పేద పాస్టర్లకు నెలకు అయిదు వేలు ఇస్తామంటే మతం రంగు పూయడమేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మరో అడుగు ముందుకేసి దేవాలయ భూముల జోలికి వైఎస్ జగన్ సర్కార్ వస్తే వూరుకోబోమని హెచ్చరించారు. ఏపీలో పేదలకు గ్రుహ నిర్మాణానికి అవసరమైన భూములు లేకపోతే దేవాలయ భూములు నిరుపయోగంగా ఉన్నవి పరిశీలించాలని వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తోందని ప్రచారంలో ఉంది. మొత్తానికి వైఎస్ జగన్ మీద మతం ముద్ర పులిమేస్తూ రచ్చకు దిగిపోతున్న బీజేపీకి దీనివల్ల ఏమైనా రాజకీయ లాభం ఉంటుందా అన్నదే ప్రశ్న.
.