అందుకే బంతాట…!!
దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఆటలు ఇంతలా సాగడంలేదు. ఎక్కడ కూడా ఇంతటి విచిత్రమైన పరిస్థితులూ లేవు. రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ వరకూ వచ్చేసరికి [more]
దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఆటలు ఇంతలా సాగడంలేదు. ఎక్కడ కూడా ఇంతటి విచిత్రమైన పరిస్థితులూ లేవు. రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ వరకూ వచ్చేసరికి [more]
దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఆటలు ఇంతలా సాగడంలేదు. ఎక్కడ కూడా ఇంతటి విచిత్రమైన పరిస్థితులూ లేవు. రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ వరకూ వచ్చేసరికి బీజేపీ జాగ్రత్తగానే ఉంటోంది. ఎందుకంటే అక్కడ జనం సెంటిమెంట్లు, వారి ఊపు, ఉద్యమాల సంగతి బీజేపీకి బాగా తెలుసు. కాసింత చప్పుడు చేసినా తెలంగాణా సమాజం ఒక్కటై ఉప్పెనలా మీద పడిపోతుంది. అపుడు అక్కడ ఉప్పూ పత్రీ కూడా దొరకదని బీజేపీకి చాలా బాగా తెలుసు. అందుకే ఏపీ మీదనే తన ప్రతాపం అంతా బీజేపీ చూపిస్తోంది. . ఇక్కడ జనంలో సెంటిమెంట్లు పెద్దగా ఉండవు. రాజకీయ పార్టీల మధ్య ఐక్యత అంతకంటే ఉండదు, దాంతో బీజేపీ అవకాశవాద రాజకీయానికి కార్యక్షేత్రం ఏపీ అయిపోయింది.
అపుడు అలా.. ఇపుడు ఇలా…
ఏపీలో చంద్రబాబు గద్దె మీద ఉన్నపుడు, తమ మాట విన్నపుడు బీజేపీ ఒకలా వ్యవహరించింది. ఆయన ఎపుడైతే కటీఫ్ అన్నాడో నాటి నుంచి ఏకంగా ఒక వ్యూహం బీజేపీ ప్రకారం విరుచుకుపడిపోయింది. అపుడు మచ్చుకైనా ప్రతిపక్ష వైసీపీని ఒక్క మాట కూడా అనలేదు. నాడు జగన్ మంచివాడు అయ్యాడు. తీరా ఎన్నికల్లో బాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి రాగానే బీజేపీ స్టాండ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. నాడు ఏ పోలవరాన్ని ప్రధాని మోడీ చంద్రబాబుకు ఏటీయం అన్నారో అదే పోలవరం ఇపుడు బీజేపీకి బంగారమైపోయింది. పోలవరం టెండర్ల రద్దును బీజేపీ తప్పు పడుతోంది. దుబారా బాబు అంటూ తిట్టిన నోళ్ళే అన్న క్యాంటీన్లు చాలా గొప్పగా ఉన్నాయని కితాబు ఇస్తూ ఎందుకు మూసేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమాల పుట్ట మీద బాబు నిర్మాణాలు చేస్తున్నరని విమర్శించిన కాషాయం గొంతులే ఇపుడు ప్రజా వేదిక ఎందుకు కూల్చారని జగన్ ని నిగ్గదీస్తున్నాయి. కాపులను బాబు మోసం చేశాడని చెప్పిన ఇదే కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు అయిదు శాతం ఈబీసీ కోటా కాపులకు జగన్ ఎందుకు ఇవ్వరని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చెబుతూ పోతే ఒకటేమిటి, అన్ని విషయాల్లోనూ బాబుని తిట్టిన ఆ నాలుకలే మడతేసి మరీ జగన్ ని తిడుతున్నాయి.
ఇద్దరితోనూ సయ్యాట…..
ఏపీలో రాజకీయం సజావుగా సాగడం లేదు. బద్ద శత్రువుల మధ్య వైరం సాగుతోంది. పేరుకు టీడీపీ, వైసీపీ అయినా వ్యక్తిగతంగా బాబు, జగన్ ల మధ్యన బిగ్ ఫైట్ జరుగుతోంది. ఆ ఇద్దరూ కలవరు, కనీసం ఏపీ ప్రయోజనాల కోసమైనా కలసినట్లుగా నటించరు. బీజేపీకి కూడా ఇదే కావాలి. ఇలా పిల్లీ పిల్లీ తగవులాడుకుంటే ఏపీకి అయిదు పైసలు కూడా సాయం చేయకుండానే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ముత్తయిదువ మాదిరిగా బీజేపీ విమర్శలకు దిగిపోతోంది. ప్యాకేజ్ ఇస్తామని ప్రత్యేక హోదా ఎగ్గొట్టి ఇపుడు ప్యాకేజి కి కూడా మంగళం పాడేసిన బీజేపీ ఏపీలో ఎన్ని రాజకీయాలైన చేయగలదని అంటున్నారు. దానికి కారణం బీజేపీ కంటే రాజకీయ పార్టీలు, దేనికీ స్పందించని జనాలు. అందుకే బీజేపీ ఏపీతో బంతాడుకుంటోందిగా.