జగన్ ను “క్రాస్” చేయగలదా?
కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీపై దృష్టి పెట్టిన నాయకులు ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే అధికారం [more]
కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీపై దృష్టి పెట్టిన నాయకులు ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే అధికారం [more]
కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో ఎదగాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీపై దృష్టి పెట్టిన నాయకులు ఇక్కడ వచ్చే ఎన్నికల నాటికి కుదిరితే అధికారం లేకపోతే.. ప్రధాన ప్రతిపక్షం హోదానైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో రాష్ట్రంలో కొన్నాళ్లుగా బీజేపీ దూకుడు ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రం ఎక్కింది లేకపోగా.. సిట్టింగ్ స్థానాలను కూడా పోగొట్టుకుంది. పైగా ఓటు షేరింగ్‌లోనూ పెద్దగా ఏమీ ప్రభావం చూపించలేకపోయింది. దీంతో ఇక, పార్టీ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకున్నారు.
రైతు భరోసాలో సక్సెస్….
కానీ, అనూహ్యంగా బీజేపీ ఇక్కడ పుంజుకునేందుకు ప్రయత్నించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని సైతం డామినేట్ చేస్తూ.. బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడం తోపాటు కొన్ని విషయాల్లో వారు సక్సెస్ కూడా అయ్యారు. ఉదాహరణకు రైతు భరోసా కార్యక్రమం ప్రారంభించిన జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పథకానికి కేంద్రం నుంచి నిధులు అందు తున్నాయని, ఒక్కొక్క రైతుకు కేంద్రమే రూ.6500 ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ఎలా చెప్పుకొంటుందని, దీనికి ప్రధాని పేరు కూడా పెట్టాలని డిమాండ్ తీసుకువచ్చారు.
ఆపరేషన్ క్రాస్…..
బీజేపీ ఒత్తిడికి తలొగ్గిన జగన్ వైఎస్సా రైతు భరోసా-ప్రధాని కిసాన్ యోజనగా ఈ పథకానికి పేరు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తొలి విజయం నమోదు చేయడం నిజానికి రికార్డే అనాలి. ఇక, ఇప్పుడు బీజేపీ పూర్తిస్థాయిలో ఆపరేషన్ క్రాస్ పేరుతో ఏపీలో పూర్తిగా చ క్రం తిప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. దీనిలో భాగంగానే జగన్ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న తెలుగు మీడియం రద్దును భుజాలకు ఎత్తుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్ర వేశ పెట్టడం ద్వారా మత మార్పిడులను ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ప్రచారం ప్రారంభించారు.
ఎంపీలను చేర్చుకుని….
దీనికి ఓ మీడియా కూడా జతకలవడం విశేషం. ఈ నేపథ్యంలోనే కొందరు ఎంపీలను కూడా తనవైపు తిప్పుకొనేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలైతే.. తమ పార్టీలోకి మారినా.. తర్వాత రాష్ట్ర పరిధిలో జగన్ ప్రభుత్వం అనర్హత వేటు వేస్తే.. బీజేపీకి ఎలాంటి ప్రయోజనం లేదని బావిస్తున్న కమల నాథులు .. ఎంపీలను తీసుకుంటే.. అనర్హత వేటు ప్రక్రియ అంతా కేంద్రంలోని ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తాము వచ్చే నాలుగున్నరేళ్లు సేఫ్‌గా ఇక్కడ రాజకీయాలు చేయొచ్చని, పార్టీని పుంజుకునేలా చేయొచ్చని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ క్రాస్ అనే కార్యక్రమానికి బీజేపీ పెద్దలు వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఎలా దీనికి ముందుకు తీసుకువెళ్తారో.. జగన్ ఎలా నిలువరిస్తాడో ? చూడాలి.