నేలబారు రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు?
బీజేపీ జాతీయ పార్టీ. ఇన్నాళ్ళూ ఉత్తరాది పార్టీగా ఉన్నా కూడా మోడీ చరిష్మాతో ఈశాన్య భారతాన, కొంత దక్షిణానా వికసించింది. అటువంటి బీజేపీలో జాతీయ భావాలు ఎక్కువ [more]
బీజేపీ జాతీయ పార్టీ. ఇన్నాళ్ళూ ఉత్తరాది పార్టీగా ఉన్నా కూడా మోడీ చరిష్మాతో ఈశాన్య భారతాన, కొంత దక్షిణానా వికసించింది. అటువంటి బీజేపీలో జాతీయ భావాలు ఎక్కువ [more]
బీజేపీ జాతీయ పార్టీ. ఇన్నాళ్ళూ ఉత్తరాది పార్టీగా ఉన్నా కూడా మోడీ చరిష్మాతో ఈశాన్య భారతాన, కొంత దక్షిణానా వికసించింది. అటువంటి బీజేపీలో జాతీయ భావాలు ఎక్కువ అని అంటారు. కానీ అది నేతి బీర కాయ చందం అని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. దేశమంతా ఒక్కటి, భారతీయులంతా ఒక్కటి, ఒకే దేశం. ఒకే జాతి అని అందమైన నినాదాలు ఇచ్చే బీజేపీ ఆచరణలో ఎందుకు వాటిని పాటించదు అన్న సందేహాలు మేధావుల్లో, చదువరులలో వస్తున్నాయి. నిజానికి జాతీయ జల విధానానికి బీజేపీ మద్దతు ఇస్తోంది. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నపుడు దేశమంతా ఉన్న నదులను అనుసంధానం చేయాలనుకున్నారు. అటువంటి ఉత్తమ ఆశయాలు ఉన్న బీజేపీ ఇపుడు నేలబారు రాజకీయాలు చేయడం దారుణమే.
నిన్నటిదాకా…?
ఏపీతో కొత్త చిచ్చుకు తెలంగాణాలో రచ్చ చేస్తోంది అచ్చంగా బీజేపీయే. ఆ పార్టీ నేత, నిన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న మాజీ మంత్రి జి వివేక్ తెరతీశారు. వివేక్ కి కాంగ్రెస్ రక్తం బాగానే ఉందని భావించవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బీజేపీని ఆమూలాగ్రం ఒంటి నిండా నింపుకున్న తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి ఏమైంది. ఆయన ఎందుకులా తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ చలిమంటలతో అధికారానికి బాటలు వేసుకోవాలన్న ఆరాటం ఎందుకు అన్నదే చర్చ. నిన్నటి దాక ఉమ్మడి ఏపీగా ఉంది. ఆంధ్రా అంటే పరాయి దేశం కాదు, పైగా అంతా కలసి అన్నదమ్ములుగా ఉందామని చెప్పారు. ఇపుడు చుక్క నీరు ఏపీకి ఇస్తే ఒప్పుకోనూ అంటూ అందరి కంటే ముందు బీజేపీ నేతలే పెద్ద గొంతు చేస్తున్నారు.
తప్పేముంది..?
నిజానికి ఏపీలోని రాయలసీమతో పాటు, దక్షిణ కోస్తాలోని రెండు జిల్లాలలో కరవు దారుణంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. కనీసం తాగడానికి నీళ్ళు లేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకం ప్రారంభించారు. ఇపుడు జగన్ 80 క్యూసెక్కుల నీరు లిఫ్ట్ చేయడానికి అనుమతించారు. అది కూడా వరద నీరు. వరద నీరు సముద్రంలో కలుస్తుంది. అది అందరికీ తెలిసిందే. దాన్ని ఒడిసిపట్టుకుని దాహం తీర్చుకుంటామంటే తప్పు పట్టడం ధర్మమేనా. పైగా శ్రీశైలం రిజర్వాయర్లో 850 అడుగులు పైదాటితేనే నీరు లిఫ్ట్ చేయడం సాధ్యపడుతుంది. అంటే ఆ నీటి వరకూ ఒప్పందాలకు ఎక్కడా రెండు రాష్ట్రాల మధ్య చిక్కులు లేవు. అయినా బీజేపీ ముందుండి రాధ్ధాంతం చేయడమే దారుణం.
వారిదే వివేచన….
నిజానికి ఉప ప్రాంతీయ నినాదంతో ఉద్యమించి తెలంగాణా రాష్ట్రం తెచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి వివేచన ఉంది. అందుకే ఆయన విపక్షాలు రాద్ధాంతం చేసే వరకూ ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు దాని వల్ల తెలంగాణాకు నష్టం లేదని, పైగా కేసీఆర్, జగన్ అన్నదమ్ములుగా ఉంటున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యమని అనుకున్నారు. ఈ ఇద్దరూ ప్రాంతీయ పార్టీల నాయకులే కానీ, జాతీయ ద్రుక్పధంతో వ్యవహరిన్నారు. కానీ గిల్లికజ్జాలు పెట్టే పార్టీలన్నీ జాతీయపార్టీలే, బీజేపీ రచ్చ చేస్తే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇలా అన్ని జాతీయ పార్టీలు సాటి తెలుగు రాష్ట్రం మీద కక్షపూనినట్లుగా గొడవ చేస్తున్నాయి. ఇది నిజంగా అసలైన ప్రాంతీయ ద్వేషం తప్ప మరోటి కాదని వివేచన ఉన్నవారంతా అంటున్నారు.