నినాదం నిలుపుతుందా?

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ఇప్పటికే సెప్టంబరు 17వ తేదీన తెలగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న డిమాండ్ తో ఇప్పటికే సెంటిమెంట్ ను [more]

Update: 2019-09-01 17:30 GMT

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ఇప్పటికే సెప్టంబరు 17వ తేదీన తెలగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న డిమాండ్ తో ఇప్పటికే సెంటిమెంట్ ను రాజేసిన బీజేపీ మరో నినాదాన్ని అందుకుంది. నగరాల పేర్లను మార్చాలని ప్రజలను సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటంతో ఆ స్థానాన్ని తాము ఆక్రమించాలని కమలనాధులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

అవకాశముండటంతో…..

పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రం తర్వాత కొద్దోగొప్పో అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ మాత్రమే అనుకూలమని కమలనాధులు భావిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలన్నది బీజేపీ పాత డిమాండ్. ప్రతి ఏడాది ఈ డిమాండ్ ను బీజేపీ తెరపైకి తెస్తూనే ఉంది. ఈసారి కూడా సెప్టెంబరు 17న పెద్దయెత్తున బహిరంగ సభ జరపాలని నిర్ణయించింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆహ్వానించింది.

పేర్లు మార్చాలని….

ఇప్పటికే నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీద ఉంది. ఇక విమోచన దినంతో పాటుగా మరో సెంటిమెంట్ ను బీజేపీ ప్రయోగిస్తోంది. ప్రధాన నగరాలకు పేర్లు మార్చాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. గతంలో నగరాలకు ఉన్న చారిత్రాత్మక పేర్లను తిరిగి పెట్టాలని వత్తిడి తేవాలని నిర్ణయించింది. నిజామాబాద్ కు ఇందూరు, కరీంనగర్ కు కరీంనగరం, మహబూబ్ నగర్ కు పాలమూరు పేర్లగా మార్చాలని ఉద్యమించనుంది బీజేపీ. జన్ సంఘ్ కార్యక్రమాల్లోనూ ఇవే పేర్లను కార్యకర్తలు, నేతలు వాడుతుంటారు.

జాతీయవాదంతో పాటు…..

చరిత్రలో ఉన్న పేర్లను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఒక వైపు జాతీయ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కాశ్మీర్ అంశంలో బీజేపీ వ్యవహరించిన తీరును క్షేత్రస్థాయిలోకి తీసుకెళుతుంది. దీంతో పాటు స్థానిక అంశాలను కూడా సెంటిమెంట్ తో తీసుకెళ్లాలని భావిస్తుంది. అందుకే నగరాల పేర్లను ఎంచుకుని స్థానికంగా బలపడేందకు ప్రయత్నిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలను బీజేపీ ఇటీవల గెలుచుకుంది. మహబూబ్ నగర్ లో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు చేరి బలోపేతమయింది. దీంతో పాలమూరులో కూడా బలపడాలని పేర్ల అంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News