ఆరాటం.. ఆర్భాటం తప్ప అసలు విషయం లేదా?
బీజేపీకి ఆత్రం ఆరాటం ఎక్కువ అవుతున్నాయి. దుబ్బాక విజయం కాదు కానీ గ్రేటర్ హైదరాబాద్ మీద పడిపోతోంది. గతసారి ఎన్నికల్లో మూడంటే మూడు డివిజన్లు గెలుచుకున్న బీజేపీ [more]
బీజేపీకి ఆత్రం ఆరాటం ఎక్కువ అవుతున్నాయి. దుబ్బాక విజయం కాదు కానీ గ్రేటర్ హైదరాబాద్ మీద పడిపోతోంది. గతసారి ఎన్నికల్లో మూడంటే మూడు డివిజన్లు గెలుచుకున్న బీజేపీ [more]
బీజేపీకి ఆత్రం ఆరాటం ఎక్కువ అవుతున్నాయి. దుబ్బాక విజయం కాదు కానీ గ్రేటర్ హైదరాబాద్ మీద పడిపోతోంది. గతసారి ఎన్నికల్లో మూడంటే మూడు డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 103 టార్గెట్ అంటోంది. మరి అది జరిగేపనేనా అన్నది చర్చగా ఉంది. నిజానికి బీజేపీకి ఇప్పటికిపుడు బలం రావడానికి బాహుబలి కాదు కదా. టీయారెస్ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంది. దాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీలు ఉన్నాయి.ఇదేమీ ముఖా ముఖీ పోరు కాదు, పైగా మరో మూడేళ్ళ పాటు కేసీయారే అధికారంలో ఉంటారు.
రాంగ్ సైడ్ డ్రైవింగ్ ….
బీజేపీకి దుబ్బాక గెలుపు అన్నది బలమో వాపో తెలియడంలేదు. పైగా రాంగ్ టైంలో ఈ విజయం దక్కిందా అన్నది కూడా ఒక భావనగా ఉందిట. నిజానికి దుబ్బాకలో కేసీయార్ గెలిచి ఉంటే అంత తొందరగా గ్రేటర్ హైదరాబాద్ కి ఎన్నికలు పెట్టరు. అపుడు ఏ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగితే కచ్చితంగా వ్యతిరేకత గట్టిగా కనిపిస్తుంది. ఇపుడు అన్నీ సర్దుకుని ఎన్నీకలకు కేసీయార్ సై అనేశాడు. ఈ క్రమంలో బీజేపీ ఎంత పరుగులు తీసినా కూడా లాభం ఉంటుందా అన్నది చూడాలి. మరో వైపు చూసుకుంటే దుబ్బాక గేం గ్రేటర్ లో అసలు కుదరదు అన్నది బీజేపీకి అర్ధం కావడం లేదు. దానికి తోడు ప్రమాదకరమైన క్రీడకు బీజేపీ తెర తీసింది అంటున్నారు.
అక్కడే యాంటీనా …
గ్రేటర్ హైదరాబాద్ లో కోటి దాకా జనాభా ఉంటున్నారు. అంటే ఒక చిన్న రాష్ట్రం జనాభా అన్న మాట. ఇక్కడ అన్ని కులాలు, మతాలు కలసి ఉంటున్నాయి. అందరూ సామరస్యంగా ఉంటున్నారు. వారి మధ్యన రచ్చ పెట్టి గెలవడం అంటే మేధావులు, చదువరులు ఉన్న హైదరాబాద్ లో కుదిరే పని కాదు అన్న మాట ఉంది. ఇక బీజేపీ ప్రెసిడెంట్ సంజయ్ చాలా దూకుడు మీద ఉన్నారు. ఆయన పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ అనేశారు. అది దావాలనంగా వ్యాపించింది. అంతే కాదు, కూల్ సిటీగా పేరున్న భాగ్యనగరంలో కొత్త అలజడిని రేపింది.దాంతో బీజేపీకి వచ్చిన అనుకూలత కూడా కొంత తగ్గిందన్న భావన కూడా ఏర్పడింది.
ఫెయిల్యూరే కదా…?
నిజానికి పాతబస్తీలో రోహింగ్యాలు, ఇతర దేశాలకు చెందిన ముస్లింలు ఉన్నారన్నది బీజేపీ ఆరోపణ. అది ఈనాటిది కాదు, 16 ఏళ్ళ క్రితం అప్పటి హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగరరావు తొలిసారి ఈ ఆరోపణ చేశారు. నాడు ఆయన వాజ్ పేయి మంత్రివర్గంలో ఉన్నారు. నాటి నుంచి నేటి వరకూ బీజేపీ ఈ విషయంలో ఏం చేసింది అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఇక ప్రస్తుతం కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉంటున్నారు. మరి ఆయనకు కనుక అక్కడ విదేశీయులు ఉన్నారని తెలిస్తే ఎందుకు ఇన్నాళ్ళూ ఉపేక్షించారన్నది కూడా ప్రశ్నగా వస్తుంది కదా. మొత్తానికి చూసుకుంటే ఇది అటూ ఇటూ తిరిగి బీజేపీ మెడకు చుట్టుకునే వ్యవహారంగానే ఉంది. జనం కూడా ఇలగే ఆలోచిస్తారు తప్ప రెండు గా చీలిపోయి మెజారిటీ వర్గం గుత్తమొత్తంగా బీజేపీకి మద్దతు ఇస్తనుకుంటే పొరపాటే. ఏది ఏమైనా హైదరాబాద్ సౌత్ కి గేట్ వే అని బీజేపీ భావించవచ్చు కానీ అతి ఉత్షాహంలో ఆ పార్టీ చేసిన కొన్ని తప్పులు ఇపుడు ఇబ్బందిగా మారుతున్నాయి.